Home  »  Bollywood News  »  రామాయణ ట్రైలర్ ఆ మూవీతో పాటు రాబోతోందా!

Updated : Jul 27, 2026

 


భారతీయ చిత్ర పరిశ్రమ గొప్పతనాన్ని వరల్డ్ మేకర్స్ , సెల్యులాయిడ్ కి చాటి చెప్పడానికి రామాయణ(Ramayana)శరవేగంగా ముస్తాబు అవుతుంది. రెండు భాగాలుగా తెరకెక్కనుండగా మొదటి భాగం రిలీజ్ డేట్ నవంబర్ 8 . దీపావళి కూడా కావడంతో రామ భక్తులు, సినీ అభిమానులు రామాయణ రాక కోసం రీగర్ గా వెయిట్ చేస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ అధినేత నమిత్ మల్హోత్రా నిర్మిస్తుండగా యష్ కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు.

.మొదట ‘రామాయణ’ ట్రైలర్‌ను జులై 24, 2026న విడుదల చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఆ ప్లాన్ వాయిదా పడింది.  తాజా సమాచారం ప్రకారం,  జులై 29, 2026న ‘రామాయణ’ ట్రైలర్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేసే అవకాశాలను మేకర్స్ పరిశీలిస్తున్నారట. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సోషల్ మీడియాలో ఈ వార్తలు వేగంగా వైరల్ అవుతూ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇటీవల హాలీవుడ్ దిగ్గజ సంస్థ సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘రామాయణ’ చిత్రానికి ప్రపంచవ్యాప్త డిస్ట్రిబ్యూషన్ భాగస్వామిగా చేరడం విశేషం. ఈ నేపథ్యంలో జులై 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘Spider-Man: Brand New Day’ సినిమాతో పాటు థియేటర్లలో ‘రామాయణ’ ట్రైలర్‌ని  ప్రదర్శించే అవకాశముందని బలమైన ప్రచారం జరుగుతోంది.

Also read: The odyssey: ఆన్‌లైన్‌లో ది ఒడిస్సీ..పైరసీని గంటలో ఎంత మంది చూశారంటే 

 రణబీర్ కపూర్ శ్రీరాముడిగా కనిపిస్తుండగా, సాయి పల్లవి సీతమ్మ వారీగా, యష్ లంకేశ్వరుడైన రావణాసురుడిగా, పవన పుత్ర హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే, కైకేయిగా లారా దత్తా, దశరథుడిగా అరుణ్ గోవిల్ చేస్తున్న విషయం తెలిసిందే. టెక్నికల్ పరంగా కూడా రామాయణ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌తో పాటు హాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ హన్స్ జిమ్మర్ ఈ చిత్రానికి సంయుక్తంగా సంగీతాన్ని అందిస్తున్నారు. 

Ramayana, Ranbirkapoor, Sai Pallavi, Nitesh Tiwari






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.