![]() |
![]() |

దుల్కర్ సల్మాన్ నటిస్తున్న సినిమా కింగ్ ఆఫ్ కోతా. ఈ సినిమా క్లైమాక్స్ పోర్షన్ బాగా రాలేదని, మళ్లీ రీ షూట్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నట్టు ఈ మధ్య వార్తలు వైరల్ అయ్యాయి. అప్పటి నుంచే ఈ సినిమా మీద వేరే లెవల్ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. అందులోని ప్రతి బిట్ చాలా బావుంది. మేకర్స్ ఎడ్జీ కేరక్టర్‌ని కట్ చేసిన విధానం చూసి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగ్జయిటింగ్‌గా ఉన్నారు. కేరక్టర్ అనౌన్స్ మెంట్ వీడియోలో కింగ్ ఆఫ్ కోతాకి సంబంధించిన పలు కీ కేరక్టర్లను పరిచయం చేశారు. అది కూడా చాలా కొత్తగా ఉంది. స్కెచ్ ఫార్మాట్లో అలాంటివి కనిపించడం కొత్తగా అనిపించాయి. దుల్కర్ సల్మాన్ కింగ్ లుక్‌లో రిఫ్రెషింగ్‌గా కనిపించారు.
కింగ్ ఆఫ్ కోతాలో దుల్కర్ సల్మాన్, డ్యాన్సింగ్ రోస్, ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేష్, షమ్మి తిలకన్, శాంతి కృష్ణ, వడ చెన్నై శరణ్, అనిక సురేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఈ ఏడాది ఓనంకి రిలీజ్ చేయాలన్నది ప్లాన్. ఈ సినిమాను హాలిడే స్పిరిట్‌తో తెరకెక్కించారు. అభిలాష్ జోషీ దర్శకత్వం వహిస్తున్నారు. షాన్ రెహ్మాన్, జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. కింగ్ ఆఫ్ కోతాను మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీలోనూ విడుదల చేయనున్నారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. జీ స్టూడియోస్, వేఫరర్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నాయి.
![]() |
![]() |