![]() |
![]() |

భారతీయ సినీ సంగీతంలో పలాష్ ముచ్చల్(Palash Muchhal)కి ప్రత్యేకమైన పేరు ఉంది. 2014 లో సంగీత దర్శకుడిగా కెరీర్ ని స్టార్ట్ చేసి ఎన్నో సినిమాలకి వర్క్ చేయడంతో పాటు పలు మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా అందించాడు. ఇప్పుడు పలాష్ ముచ్చల్ పై ఎస్ సి, ఎస్ టి కేసు నమోదవు కావడం సంచలనంగా మారింది. ఆ డీటెయిల్స్ చూద్దాం.
పలాష్ ముచ్చల్ ఒక సినిమా ప్రాజెక్ట్ కోసం విజ్ఞాన్ మానే వద్ద నుంచి సుమారు 25 లక్షల రూపాయల తీసుకున్నారు. ఆరు నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి చేయలేదు. దీంతో విజ్ఞాన్ మానే
తన డబ్బులు ఇవ్వమని పలాష్ ని అడిగాడు. కాని డబ్బులు ఇవ్వకపోగా పలాష్ తనపై కుల వివక్షతో కూడిన అనుచిత వ్యాఖ్యలు చేశారని, తనను దూషించారని విజ్ఞాన్ పోలీసులకి ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు పలాష్‌పై SC/ST బీఎన్ఎస్ సెక్షన్ 351(2), 352 కింద కేసు పలాష్ పై కేసు నమోదు చేసారు.
Also read: KHxRK: రజినీ, కమల్ మల్టిస్టారర్ మూవీ బడ్జెట్ ఇంతే!. మరి ఆ మాత్రం హడావిడి ఉండాలిగా
పలాష్ ముచ్చల్ ఎవరో కాదు స్మృతి మంధాన మాజీ ప్రేమికుడు.2025 నవంబర్‌లో వీరిద్దరూ వివాహం చేసుకోవాల్సి ఉంది. పెళ్లి వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే, అనూహ్యంగా పెళ్లికి కొన్ని రోజుల ముందే ఆ వేడుకలు ఆగిపోయాయి. పలాష్ మరొక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే కారణంతో స్మృతి ఆ పెళ్లిని రద్దు చేసుకుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకుని, విడిపోతున్నట్లు ప్రకటించారు. పలాష్ పై కేసు నమోదు చేసిన విజ్ఞాన్ మానే కూడా ఎవరో కాదు స్మృతి ఫ్రెండ్. మరాఠి చిత్ర సీమలో ప్రముఖ నటుడు, నిర్మాత. ఈ నేపథ్యంలో కూడా ఈ విషయం సంచలనంగా మారింది.
![]() |
![]() |