![]() |
![]() |
![]()
కంటెంట్ ఉంటే చాలు.. స్టార్స్ లేని సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తాయి అని మరోసారి నిరూపించిన చిత్రం 'మహావతార్ నరసింహ'. జూలై 25న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ యానిమేటెడ్ మైథలాజికల్ ఫిల్మ్.. మౌత్ టాక్ తోనే రోజురోజుకి వసూళ్ళను పెంచుకుంటూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. (Mahavatar Narsimha)
'మహావతార్ నరసింహ' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ రాబట్టింది. ముఖ్యంగా ఈ మూవీ హిందీలో అదిరిపోయే కలెక్షన్స్ ని రాబడుతోంది. హిందీ నెట్ కలెక్షన్స్ పరంగా ఇప్పటికే 'పుష్ప-1', 'బాహుబలి-1' వంటి భారీ చిత్రాలను దాటేసింది.
హిందీలో 'పుష్ప-1' రూ.106 కోట్ల నెట్ రాబట్టగా, 'బాహుబలి-1' రూ.118 కోట్ల నెట్ సాధించింది. ఇక 'మహావతార్ నరసింహ' విషయానికొస్తే.. ఈ చిత్రం ఇప్పటికే 126 కోట్లకు పైగా నెట్ సాధించడం విశేషం.
హిందీ వెర్షన్ పరంగా మొదటి వారం రూ.32.63 కోట్ల నెట్, రెండవ వారం రూ.55.17 కోట్ల నెట్ రాబట్టిన 'మహావతార్ నరసింహ'.. మూడో వీకెండ్ లో రూ.38.96 కోట్ల నెట్ తో ఇప్పటిదాకా మొత్తం రూ.126.76 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ఫుల్ రన్ లో రూ.150 కోట్ల నెట్ రాబట్టే ఛాన్స్ ఉంది.
ఆగస్టు 14న జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించిన భారీ బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2' విడుదలవుతోంది. లేదంటే 'మహావతార్ నరసింహ' మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
![]() |
![]() |