akhanda 2 : జై బాలయ్య అంటు థమన్ ట్వీట్
on Dec 5, 2025
.webp)
-ట్వీట్ లో ఏముంది
-అభిమానుల్లో జోష్
-అఖండ 2 ఈ రోజు ఉందా!
అఖండ 2(Akhanda 2)ఈ రోజు బెనిఫిట్ షో నుంచి సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దీంతో అభిమానుల్లో సంతోష వాతావరణం నెలకొని ఉండటంతో పాటు అధికార ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం మ్యూజిక్ డైరెక్టర్ థమన్(Thaman)"ఎక్స్' వేదికగా అఖండ 2 లో దైవ శ్లోకాలు ఆలపించిన మిశ్రా సోదరుల వీడియోని షేర్ చేసాడు.
సదరు వీడియోలో విజయానికి సంకేతంగా భావించే శ్లోకాన్ని పఠించిన మిశ్రా సోదరులు అఖండ 2 సాధించబోయే విజయం గురించి కూడా మాట్లాడటం జరిగింది. థాంక్స్ గురూజీ , మిశ్రా బ్రదర్స్ జి, 'ఆల్ ది వే ఫ్రమ్ మతురా' అఖండ 2 తాండవం జై బాలయ్య' అనే క్యాప్షన్స్ తో పాటు ఆసక్తికర ఎమోజిస్ ని కూడా షేర్ చేసాడు. సోషల్ మీడియాలో సదరు ట్వీట్ వైరల్ గా మారడంతో ఈ రోజు బెనిఫిట్ షో నుంచి శివ తాండవం స్టార్ట్ కాబోతుందనడానికి శుభ సూచకంగా థమన్ ట్వీట్ ని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు.
also read: అఖండ 2 కోసం వేణు స్వామి పూజలు చేశాడా! ఫ్యాన్స్ ఆగ్రహం
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



