సంక్రాంతి రన్నర్ చిరంజీవి.. మరి విన్నర్?
on Jan 15, 2026

ఈ సంక్రాంతికి ఐదు తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. 'ది రాజా సాబ్'తో ప్రభాస్, 'మన శంకర వరప్రసాద్ గారు'తో చిరంజీవి బాక్సాఫీస్ బరిలో నిలిచారు. రాజా సాబ్ మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ ని సొంతం చేసుకోగా.. 'మన శంకర వరప్రసాద్ గారు' పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో చిరంజీవి సంక్రాంతి విన్నర్ అని అందరూ అనుకున్నారు. అయితే కంటెంట్ పరంగా చిరంజీవి సినిమా కంటే, మరో సినిమా విన్నర్ గా నిలిచింది.
ది రాజా సాబ్: (తెలుగువన్ రేటింగ్: 2.5/5)
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ ఫిల్మ్ 'ది రాజా సాబ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ మూవీ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐడియా బాగానే ఉన్నప్పటికీ, ఎగ్జిక్యూషన్ లో మారుతి తడబడ్డాడు. దీంతో మొదటి షోకే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి, ప్రభాస్ ఓల్డ్ గెటప్స్ సీన్స్ యాడ్ చేయడంతో అవుట్ పుట్ కాస్త మెరుగుపడింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
Also Read: ది రాజా సాబ్ మూవీ రివ్యూ
మన శంకర వరప్రసాద్ గారు: (తెలుగువన్ రేటింగ్: 2.75/5)
చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ఫిల్మ్ 'మన శంకర వరప్రసాద్ గారు'. నయనతార హీరోయిన్ గా నటించగా, వెంకటేష్ ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 12న థియేటర్లలో అడుగుపెట్టింది. స్టోరీ రొటీన్ గా ఉన్నప్పటికీ.. కామెడీ వర్కౌట్ అయింది. చిరంజీవి ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా అనిల్ రావిపూడి ఈ సినిమాని మలిచాడు.
Also Read: మన శంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ
భర్త మహాశయులకు విజ్ఞప్తి: (తెలుగువన్ రేటింగ్: 2.5/5)
రవితేజ హీరోగా కిషోర్ తిరుమల రూపొందిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi). జనవరి 13న విడుదలైంది. డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో.. వైఫ్, గర్ల్ ఫ్రెండ్ మధ్య నలిగిపోయే వ్యక్తిగా రవితేజ కనిపించాడు. కామెడీ బాగానే పండింది. గొప్ప సినిమా కాకపోయినా.. రీసెంట్ టైమ్స్ లో రవితేజ నుంచి వచ్చిన బెటర్ ఫిల్మ్ అనిపించుకుంది. సోలోగా రిలీజ్ అయ్యుంటే.. ఇంకా బెటర్ రిజల్ట్ ఉండేది.
Also Read: భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ
అనగనగా ఒక రాజు: (తెలుగువన్ రేటింగ్: 2.75/5)
హ్యాట్రిక్ హిట్స్ తర్వాత నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన మూవీ 'అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju). విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ ఫిల్మ్ లో మీనాక్షి చౌదరి హీరోయిన్. నూతన దర్శకుడు మారి రూపొందించాడు. సితార ఎంటెర్టైనమెంట్స్ నిర్మించిన ఈ మూవీ జనవరి 14న రిలీజ్ అయింది. ఈ సినిమాలో నవీన్ వన్ మ్యాన్ షో చూపించాడు. డైలాగ్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ నవ్వులు పూయించింది. సెకండ్ హాఫ్ లో నవ్వుల డోస్ తగ్గినా.. చివరిలో ఎమోషన్ పండింది.
Also Read: అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ
నారీ నారీ నడుమ మురారి: (తెలుగువన్ రేటింగ్: 3.25/5)
ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానంభవతి వంటి విజయాలతో ఈ జనరేషన్ సంక్రాంతి హీరోగా పేరుపొందిన శర్వానంద్, ఈ సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్.. జనవరి 14 సాయంత్రం థియేటర్లలో అడుగుపెట్టింది. సంక్రాంతి సినిమాలలో ప్రమోషన్స్ పరంగా తక్కువ హడావుడి చేసింది ఈ సినిమానే. కానీ, కంటెంట్ పరంగా మాత్రం అన్ని సినిమాల కంటే టాప్ లో ఉంది. అన్ని విభాగాలు కరెక్ట్ గా పనిచేసి, ఒక మంచి ఎంటెర్టైనర్ ను ప్రేక్షకులను అందించారు. ఈ సినిమాకు క్రమంగా థియేటర్లు పెరగడంతో పాటు, లాంగ్ రన్ ఉండే అవకాశముంది.
Also Read: నారీ నారీ నడుమ మురారి మూవీ రివ్యూ
మొత్తానికైతే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న పెద్ద సినిమా కనుక.. వసూళ్ల పరంగా 'మన శంకర వరప్రసాద్ గారు' టాప్ లో ఉంటుంది. కానీ, కంటెంట్ పరంగా మాత్రం 'నారీ నారీ నడుమ మురారి' ఈ సంక్రాంతి విన్నర్ అని చెప్పవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



