నా సినిమా విషయంలో మహేష్ బాబు ప్రమేయం లేదు.. పూర్తి వివరణ ఇదే
on Dec 5, 2025
.webp)
-వారణాసితో మహేష్ బాబు బిజీ
-ఆయన ప్రమేయం లేదు
-దర్శకుడి స్పష్టీకరణ
సూపర్ స్టార్ 'మహేష్ బాబు'(Mahesh Babu)ప్రస్తుతం తన డ్రీం ప్రాజెక్ట్ 'వారణాసి'(Varanasi)తో బిజీగా ఉన్నాడు. ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీగా కూడా వారణాసి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. వరల్డ్ సినీ మేకర్స్ సైతం అబ్బురపడేలా రాజమౌళి(ss Rajamouli)అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు టైటిల్ రిలీజ్ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ ట్రైలర్ నే అందుకు ఉదాహరణ. ప్రియాంక చోప్రా(priyankachopra),పృథ్వీ రాజ్ సుకుమారన్ తో పాటు పాన్ ఇండియాకి చెందిన ప్రతిభావంతమైన నటులు వారణాసి లో మెరవనున్నారు.
సోషల్ మీడియా వేదికగా గత కొన్నిరోజుల నుంచి మహేష్ బాబు తన అన్నయ్య రమేష్ బాబు(Ramesh Babu)కొడుకు జయకృష్ణ(Jaya Krishna)హీరోగా పరిచయమవుతున్న' శ్రీనివాస మంగాపురం'(Srinivasa Mangapuram)సినిమాలో మహేష్ బాబు ప్రమేయం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై చిత్ర దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) స్పందిస్తు మా సినిమా విషయంలో మహేష్ బాబు ప్రమేయం ఏ మాత్రం లేదు.ఆయనకీ నాపై పూర్తి నమ్మకం ఉంది.జయకృష్ణ కుటుంబానికి అయితే కథ కూడా తెలియదని అజయ్ భూపతీ చెప్పుకొచ్చాడు.
also read: akhnada 2: రిలీజ్ వాయిదాకి అసలు కారణం చెప్పిన సురేష్ బాబు
వాస్తవితకి పెద్ద పీట వేస్తు ప్రేమ కథా నేపథ్యంలో 'శ్రీనివాస మంగాపురం' తెరకెక్కుతుంది. జయకృష్ణ సరసన ఒకప్పటి అగ్ర హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె 'రషా తడాని' జత కడుతుండటంతో మూవీపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. పి ఉదయ్ కిరణ్ నిర్మాత కాగా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



