Akhanda 2: సంక్రాంతి బరిలో అఖండ-2... షాక్‌లో బాలయ్య ఫ్యాన్స్!
on Dec 5, 2025
- ఓవర్సీస్ చేజారిపోయిందా?
- బాలయ్యకు ఇదే తొలి అనుభవం
- తీర్పు అనుకూలంగా వచ్చినా సమస్యలెన్నో
అఖండ2 రిలీజ్‌పై ఏర్పడ్డ వివాదంపై మద్రాస్ హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. ఈరోస్ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను 14 రీల్స్ చెల్లించిందని, ఈరోజుతో ఈ సమస్య పరిష్కారమవుతుందని అందరూ భావిస్తున్నారు. వాదోపవాదాలు విన్న కోర్టు ఇచ్చే తీర్పు 14 రీల్స్‌కి అనుకూలంగా వచ్చినప్పటికీ సినిమా రిలీజ్ విషయంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
14 రీల్స్, ఈరోస్ ఇంటర్నేషనల్ మధ్య ఉన్న ఆర్థిక వివాదాలను పరిష్కరించుకుంటే ఈరోజు సాయంత్రం ప్రీమియర్స్ పడిపోతాయి. అయితే అవి ఇండియాకి మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఓవర్సీస్లో 'అఖండ2'కి కేటాయించిన థియేటర్లు ఇప్పుడు అందుబాటులో లేవని తెలుస్తోంది.
అంతకుముందు బిగ్ రేంజ్లో థియేటర్లను 'అఖండ2'కి కేటాయించారు. ఒకరోజు సినిమా పోస్ట్‌పోన్ అవ్వడం వల్ల కొన్ని సింగిల్ స్క్రీన్స్ మాత్రమే లభించే అవకాశం ఉంది. 'అఖండ2'కి కేటాయించిన థియేటర్లను 'జూటోపియా2'తోపాటు మరో సినిమాకి కేటాయించి టికెట్స్ సేల్ చేస్తున్నారు. ఇప్పుడా థియేటర్స్‌లో 'అఖండ2' చిత్రానికి షోలు తెచ్చుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఇలాంటి పరిస్థితుల్లో వున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఒక వారం తర్వాత 'అఖండ2' చిత్రాన్ని రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఒకరోజు పోస్ట్ పోన్ అయినప్పటికీ ఇప్పుడు రిలీజ్ చేసుకోగలిగితే ఓకే.. లేదంటే మళ్ళీ డిసెంబర్ 12కి ప్రయత్నం చెయ్యాల్సి ఉంటుంది. అది కూడా మిస్ అయితే డిసెంబర్ 19కి వెళ్లాలి. అదే టైమ్‌కి 'అవతార్3' రిలీజ్‌కి రెడీగా ఉంది. ఇండియాలో పరిస్థితి ఎలా ఉన్నా.. ఈరోజు అంటే డిసెంబర్ 5 శుక్రవారం ఓవర్సీస్లో 'అఖండ2' రిలీజ్ లేనట్టే అనుకోవాలి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బాలయ్యబాబు సినిమా ఈరోజు అక్కడ రిలీజ్ అవ్వదు. సో.. ఈ పరిస్థితులను చూసి దర్శకనిర్మాతలు 'అఖండ2' ని సంక్రాంతి బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సో.. ఈ పరిస్థితులను చూసి దర్శకనిర్మాతలు 'అఖండ2' ని సంక్రాంతి బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వార్త వచ్చినప్పటి నుంచి బాలయ్య ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



