
Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్..
'వారణాసి' షూటింగ్.. ఆ సమస్యకు పరిష్కారం దొరికిందా? మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న 'వారణాసి' సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా పాల్గొంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లో నీటి కొరత కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడిందన్న వార్తలు వైరల్ అయ్యాయి. భారీ వాటర్ అవసరాల నేపథ్యంలో సమస్య తలెత్తినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వడంతో ఆ సమస్యకు పరిష్కారం దొరికిందా? లేదా ప్లాన్ మార్చారా? అన్న చర్చ సాగుతోంది. ముంబైలో పెద్ది హంగామా! పెద్ది ట్రైలర్‌ను ఈ నెల 18న ముంబైలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు మూవీ టీమ్ మొత్తం ఈ ఈవెంట్లో పాల్గొననుంది. ట్రైలర్ లాంచ్ తర్వాత భోపాల్‌లో స్పెషల్ మ్యూజికల్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తోంది. ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్ టైమ్ ఫిక్స్! ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'డ్రాగన్' నుండి సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను మే 20న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు టైం కూడా ఫిక్స్ అయింది. మే 19 అర్థరాత్రి 12 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చిరంజీవి! మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో రానున్న క్రేజీ ప్రాజెక్ట్ 'Mega158' గురించి తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం మెగాస్టార్ సరికొత్త మేకోవర్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో.. రగ్గడ్ గా కనిపించబోతున్నారని సమాచారం. విభిన్నమైన హెయిర్ స్టైల్, గడ్డంతో చిరు వింటేజ్ మాస్ లుక్‌ను తలపించేలా ఈ క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు టాక్. డైరెక్టర్ గా మారుతున్న రామ్ పోతినేని! టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకుడిగా మారబోతున్నాడు. వరుస పరాజయాల నేపథ్యంలో, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి రామ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, తన అన్న కృష్ణ చైతన్యతో కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. రవితేజ రెమ్యూనరేషన్లో భారీ కోత! తనపై నమ్మకం ఉంచిన నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశంతో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ. 25 నుండి 30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న రవితేజ.. తన రాబోయే చిత్రాల కోసం దానిని రూ. 15 కోట్లకు తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. తన మార్కెట్ మళ్ళీ నిలదొక్కుకునే వరకు బడ్జెట్ నియంత్రణలో ఉండాలని, తద్వారా సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారట. విజయ్ సీఎం కావడంపై రజినీకాంత్ రియాక్షన్! తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ కు.. సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్తున్నాయి. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడ్డారు. ఈ సందర్భంగా విలేకరులు విజయ్ సీఎం కావడంపై ఆయన అభిప్రాయాన్ని కోరారు. రజినీకాంత్ ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా, కేవలం తనదైన శైలిలో నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. రజినీకాంత్ మౌనంగా ఉన్నప్పటికీ.. ఆ చిరునవ్వులో విజయ్ పట్ల గౌరవం, అభినందనలు ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సూర్య సినిమాకు కొత్త తలనొప్పి! కోలీవుడ్ నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ ఇప్పుడు తెలుగు నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. సూర్య హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'వీర భద్రుడు' సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో.. బాలాజీ గతంలో తెలుగు సినిమాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో.. తెలుగు సినిమాల్లో లాజిక్ ఉండదని, కేవలం హీరోల ఎలివేషన్లకే ప్రాధాన్యత ఇస్తారని ఆయన విమర్శించారు. విడాకుల బాటలో మౌనీ రాయ్ బాలీవుడ్ నటి, 'నాగిని' ఫేమ్ మౌనీ రాయ్ తన భర్త, దుబాయ్ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో విడిపోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట గత కొద్ది రోజులుగా విడివిడిగా నివసిస్తున్నారని, వీరి మధ్య మనస్పర్థలు తీవ్రమయ్యాయని తెలుస్తోంది. మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. మౌనీ తన ప్రొఫైల్ నుండి భర్తతో ఉన్న కొన్ని ఫోటోలను తొలగించగా, సూరజ్ కూడా తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేసినట్లు సమాచారం. ప్రముఖ సింగర్ కు జైలు శిక్ష ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టు తీర్పు వెలువడింది. గత మార్చిలో కాలిఫోర్నియాలో మద్యం మత్తులో కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన బ్రిట్నీపై నమోదైన కేసులో, తాజాగా ఆమెకు ఒక్కరోజు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జైలు శిక్షతో పాటు 571 డాలర్ల జరిమానాను కోర్టు విధించింది.
May 12, 2026
NTRNeel Glimpse: ఎన్టీఆర్- నీల్ మూవీ క్రేజీ అప్డేట్.. విధ్వంసానికి టైమ్ ఫిక్స్..!
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ #NTRNeel గురించి ఒక సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఎన్టీఆర్ పుట్టినరోజు(మే 20) సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గ్లింప్స్ కి టైం కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. అర్థరాత్రి నుంచే ఊచకోత! సాధారణంగా స్టార్ హీరోల పుట్టినరోజు అప్డేట్స్ ఉదయం వస్తుంటాయి. కానీ, ప్రశాంత్ నీల్ సినిమా అంటే ఆ లెక్కలే వేరుగా ఉంటాయి. తాజా సమాచారం ప్రకారం, మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో, దానికి ఒక రోజు ముందు అంటే మే 19 అర్థరాత్రి 12:06 గంటలకు ఈ సినిమా అధికారిక గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ గ్లింప్స్ ద్వారా ప్రశాంత్ నీల్ సృష్టించిన కొత్త ప్రపంచంలో తారక్‌ను ఎలా చూపించబోతున్నారో చిన్న శాంపిల్ చూపించనున్నారు. దీంతో మే 19 రాత్రి నుంచే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా మొదలుకానుంది. నెక్స్ట్ లెవల్లో ఎలివేషన్స్ 'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ఎన్టీఆర్‌ను ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. నీల్ మార్క్ డార్క్ థీమ్, భారీ ఎలివేషన్స్ ఈ సినిమాలో నెక్స్ట్ లెవల్లో ఉండబోతున్నాయని టాక్. గ్లింప్స్ విడుదలయ్యాక ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయమని అంటున్నారు. ఖచ్చితంగా ఈ గ్లింప్స్ యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఆ అర్థరాత్రి రాబోయే విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలంటే మే 19 వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమాకు మొదటి నుంచి 'డ్రాగన్' టైటిల్ ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్ బర్త్ డేకి టైటిల్ ను కూడా అధికారికంగా రివీల్ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
May 12, 2026
NTRNeel Glimpse: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. 3 నిమిషాల మ్యాడ్నెస్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందుతోన్న 'డ్రాగన్' సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 20న విడుదల కానున్న ఈ మూవీ గ్లింప్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ గ్లింప్స్‌కు సంబంధించి ఒక సెన్సేషనల్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా ఏ సినిమా గ్లింప్స్ అయినా ఒక నిమిషానికి అటుఇటుగా ఉంటుంది. కానీ ప్రశాంత్ నీల్ ఈసారి తన మార్క్ యాక్షన్ అడ్వెంచర్‌ను గట్టిగా చూపించాలని డిసైడ్ అయ్యారట. తాజా సమాచారం ప్రకారం, ఈ గ్లింప్స్ రన్ టైమ్ దాదాపు 3 నిమిషాలు (180 సెకన్లు) ఉండబోతోంది. సాధారణంగా ట్రైలర్ మూడు నిమిషాల నిడివి ఉండటం చూస్తుంటాం. అలాంటిది గ్లింప్స్ మూడు నిమిషాలు అంటే.. దీనితోనే ఒక చిన్నపాటి సునామీని చూపించేందుకు నీల్ ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతోంది. ఈ 3 నిమిషాల గ్లింప్స్ లో ప్రతి షాట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. ఇది ప్యూర్ మ్యాడ్నెస్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ 3 నిమిషాల గ్లింప్స్ గనుక వస్తే, యూట్యూబ్ రికార్డులన్నీ చెల్లాచెదురు అవ్వడం గ్యారెంటీ. ఎన్టీఆర్‌ను గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక పవర్ఫుల్ అండ్ డార్క్ షేడ్ ఉన్న రోల్లో చూపించబోతున్నారు. 'కేజీఎఫ్', 'సలార్' తరహాలోనే ఈ చిత్రంలో కూడా ప్రశాంత్ నీల్ మార్క్ భారీ సెట్టింగులు, మాస్ ఎలివేషన్స్, ఎమోషనల్ హైస్ ఉండనున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా వేరే లెవెల్ లో ఉంటుందని టాక్. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోని విక్టోరియా మెమోరియల్ స్కూల్ లో షూటింగ్ జరుగుతోంది. 2027, జూన్ 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
May 09, 2026
Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు హెడ్ లైన్స్..
1. పెద్ది రికార్డుల వేట మొదలు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న 'పెద్ది' మూవీ ఓవర్సీస్ లో సంచలనం సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన 4 గంటల్లోనే.. ఒక లక్ష డాలర్ల మార్కును దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, జూన్ 3న ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. 2. పవర్ ఫుల్ మ్యూజిక్ తో 'డ్రాగన్' గ్లింప్స్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్'. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇందుకోసం మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ గత మూడు రోజులుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. 'డ్రాగన్' గ్లింప్స్‌కు ఆయన 'పవర్ ఫుల్ అండ్ యూనిక్' మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం. 3. 'రేజర్' మూవీ రివ్యూ రవిబాబు స్వీయ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'రేజర్' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక పవర్ ఫుల్ పొలిటీషియన్ అండ్ క్రిమినల్ గ్యాంగ్ బారి నుండి.. ఒక చిన్న పాప ప్రాణాలను రక్షించే వ్యక్తిగా రవిబాబు ఈ సినిమాలో కనిపించారు. సినిమా అంతా రవిబాబు మార్క్ వైల్డ్ యాక్షన్, హింసతో నిండిపోయింది. కథలో వైవిధ్యం లేకపోవడం, ఎమోషన్స్ పండకపోవడం సినిమాకు మైనస్ గా మారాయి. 4. 'సతీ లీలావతి' మూవీ రివ్యూ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తాతినేని సత్య దర్శకత్వంలో వచ్చిన 'సతీ లీలావతి' ఒక యావరేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మిగిలిపోయింది. విడాకులు కోరిన భర్తను భార్య బంధించి మనసు మార్చే ప్రయత్నం చేయడం అనే పాయింట్ ఆసక్తికరంగా ఉన్నా.. కథనంలో బలం లేకపోవడం వల్ల సినిమా సాగదీతగా అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బలమైన ఎమోషన్ మిస్ అయ్యింది. సిల్లీ డైలాగ్స్, లాజిక్ లేని సీన్స్ బోర్ కొట్టిస్తాయి. 5. 'గోదారి గట్టుపైన' మూవీ రివ్యూ సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన 'గోదారి గట్టుపైన' నేడు విడుదలైంది. ఒక ఆటో డ్రైవర్, ఇంజనీరింగ్ స్టూడెంట్ మధ్య సాగే ప్రేమకథకు.. గోదావరి నేపథ్యం, నాగవంశీ అందించిన సంగీతం ప్రధాన బలాలుగా నిలిచాయి. అయితే, కథలో కొత్తదనం లేకపోవడం, సాగదీత సన్నివేశాలు సినిమాకు మైనస్ అయ్యాయి. 6. 'పెద్ది' సెట్స్‌లో మెగాస్టార్ సందడి రామ్ చరణ్ 'పెద్ది' షూటింగ్ సెట్స్‌ను మెగాస్టార్ చిరంజీవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దర్శకులు బుచ్చిబాబు, సుకుమార్‌లతో కలిసి సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను బుచ్చిబాబు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "ది బాస్, మై గురు 'పెద్ది' సెట్స్‌లో అడుగుపెట్టడం నా జీవితంలో మధుర జ్ఞాపకం" అని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 7. నెవర్ బిఫోర్ లుక్ లో తారక్ జూనియర్ ఎన్టీఆర్ అల్ట్రా స్టైలిష్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సంగీత దర్శకుడు థమన్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఎన్టీఆర్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో.. గుబురు గడ్డం, నోటిలో టూత్ పిక్ తో ఎన్టీఆర్ చూపించిన యాటిట్యూడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ లుక్ తో ఒక్క సినిమా పడితే బాక్సాఫీస్ రికార్డులు గల్లంతేనని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 8. శ్రీదేవి కుటుంబానికి హైకోర్టులో ఊరట దివంగత నటి శ్రీదేవి కుటుంబానికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. చెన్నై ఈసీఆర్ రోడ్డులోని 27 ఎకరాల భూమిపై వాటా కోరుతూ నటరాజన్, శివగామి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 37 ఏళ్లుగా శ్రీదేవి కుటుంబం ఆధీనంలో ఉన్న ఆస్తిపై ఇప్పుడు యాజమాన్య హక్కులు కోరడం తగదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో బోనీ కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లకు ఆస్తి వివాదం నుండి విముక్తి లభించింది. 9. శక్తి కపూర్ ఆరోగ్యంగానే ఉన్నారు బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్ తన మరణం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. తాను పూర్తి ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నానని, ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. గత కొద్ది రోజులుగా శక్తి కపూర్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని, మరణించారని జరుగుతున్న ప్రచారానికి ఈ వీడియోతో చెక్ పడింది. 10. ఓటీటీలోకి 'ధురందర్ 2' రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురందర్ 2: ది రివేంజ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. మే 14 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇండియాలో జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుండగా.. ఓవర్సీస్ ప్రేక్షకులకు Netflix లో అందుబాటులోకి రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
May 08, 2026
Jr NTR: ఎన్టీఆర్ మాస్ జాతర.. తమన్ షేర్ చేసిన క్రేజీ పిక్ వెనుక అసలు గుట్టు ఇదేనా?
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ (Thaman) తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్న ఈ బ్లాక్ అండ్ వైట్ పిక్ చూసి నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' (Dragon) చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'గాడ్ ఆఫ్ వార్' (God Of War) చేయనున్నాడు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'డ్రాగన్' గ్లింప్స్ విడుదల కానుంది. అలాగే, 'గాడ్ ఆఫ్ వార్' అనౌన్స్ మెంట్ కూడా వచ్చే అవకాశముంది. ఈ సినిమాలకు సంబంధించిన వార్తలు ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నాయి. ఈ తరుణంలో తమన్ షేర్ చేసిన ఎన్టీఆర్ ఫోటో హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ గుబురు గడ్డం, కోర మీసం, నోట్లో టూత్ పిక్ తో అత్యంత పవర్ఫుల్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. తమన్ ఈ ఫోటోను షేర్ చేస్తూ ఎమోజీలతో ఒక 'బాంబ్' హింట్ ఇచ్చాడు. దీంతో ఇది ప్రశాంత్ నీల్ సినిమాకి సంబందించిన బ్లాస్టింగ్ న్యూస్ కోసమా లేదా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసమా అనే సస్పెన్స్ మొదలైంది. ఎన్టీఆర్ లుక్ చూస్తుంటే, అది నీల్ ప్రాజెక్ట్ లోదే అనిపిస్తోంది. దీంతో 'డ్రాగన్' గ్లింప్స్ ఓ రేంజ్ లో ఉండబోతుందని చెప్పడం కోసం తమన్ ఈ ట్వీట్ చేసుంటాడు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ ఫోటో విషయంలో మరో చర్చ కూడా జరుగుతుంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ ను త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతుండటంతో.. బిగ్ బ్లాస్ట్ కి రెడీగా ఉండమని ఫ్యాన్స్ కి తమన్ హింట్ ఇచ్చాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏదైనా తమన్ షేర్ చేసిన ఫొటోలో మాత్రం ఎన్టీఆర్ లుక్ వేరే లెవెల్ లో ఉంది.
May 08, 2026
ఎన్టీఆర్ బర్త్‌డే ట్రీట్.. 'గాడ్ ఆఫ్ వార్' అనౌన్స్మెంట్ వీడియోతో సెన్సేషన్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులకు త్వరలో ఒక భారీ సర్ప్రైజ్ రాబోతోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' (Dragon) ప్రాజెక్టుతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'గాడ్ ఆఫ్ వార్' (God of War) సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మే 20న భారీ ప్రకటన? ఈ సినిమా మేకర్స్ ప్రస్తుతం 'గాడ్ ఆఫ్ వార్' అనౌన్స్మెంట్ వీడియో పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రత్యేక వీడియోను మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈ వీడియోను అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నట్లు సమాచారం. VFX పనులపై ప్రత్యేక దృష్టి ఈ అనౌన్స్మెంట్ వీడియోలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) అత్యంత కీలకం కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం ఈ వీడియో కోసం రేయింబవళ్లు శ్రమిస్తోంది. అవుట్‌పుట్ లో వచ్చే వీఎఫ్ఎక్స్ నాణ్యత పట్ల మేకర్స్ సంతృప్తి చెందితే, మే 20న దీనిని అధికారికంగా విడుదల చేస్తారు. ఒకవేళ ఏవైనా మార్పులు అవసరమైతే తప్ప, ఎన్టీఆర్ బర్త్ డే రోజున 'గాడ్ ఆఫ్ వార్' అనౌన్స్మెంట్ వీడియో రావడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఎన్టీఆర్ బర్త్ డే ట్రీట్ తో ఫ్యాన్స్‌కు పూనకాలు గ్యారెంటీ అని చెప్పవచ్చు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి పెరిగింది. అందుకే 'గాడ్ ఆఫ్ వార్' వంటి భారీ చిత్రాల విషయంలో మేకర్స్ ఏ చిన్న విషయంలోనూ రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే, మే 20న సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం. మరోవైపు ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 20న 'డ్రాగన్' గ్లింప్స్ కూడా విడుదల కానుంది. ఓ వైపు 'డ్రాగన్' గ్లింప్స్, మరోవైపు 'గాడ్ ఆఫ్ వార్' అనౌన్స్మెంట్ వీడియోతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ అందనుంది.
May 06, 2026
Ntr: ఎన్టీఆర్ డ్రాగన్ కోసం రంగంలోకి దేవ కట్టా.. ఎంత పని చేసావు ప్రశాంత్ నీల్
-రోజు రోజుకి అంచనాల్ని పెంచుకుంటున్న డ్రాగన్ -ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ -రంగంలోకి దేవ కట్టా -బాక్స్ ఆఫీస్ కి కొత్త లెక్కలు దొరికినట్లేనా! మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr),ప్రశాంత్ నీల్(Prashanth Neel)కాంబోలో తెరకెక్కుతున్న 'డ్రాగన్'(Dragon)ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. షూటింగ్ విషయంలో కొన్నాళ్లుగా వినిపిస్తున్న రూమర్స్ కి సైతం చెక్ పెడుతూ, రూమర్స్ నమ్మకండి, మేమే ఎవిరీ అప్ డేట్ అందిస్తామని మేకర్స్ చెప్పారంటే ఫ్యాన్స్ లో డ్రాగన్ పై ఉన్న అంచనాల రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు. ఈ కోవలోనే తాజా అప్ డేట్ ఒకటి బయటకి వచ్చింది. సంచలన దర్శకుడు దేవకట్టా డ్రాగన్ కోసం రంగంలోకి దిగుతున్నాడు. అవును.. డ్రాగన్ కి దేవకట్టా(Deva Katta)డైలాగ్ రైటర్ గా వర్క్ చేస్తున్నాడు. పవర్ ఫుల్ డైలాగ్స్ కి దేవకట్టా పెట్టింది పేరు. కమర్షియల్ ఫ్లేవర్ ఉంటూనే సూటిగా, సుతిమెత్తగా, సమాజంలోని అన్ని వర్గాలకి చేరువయ్యేలా దేవకట్టా డైలాగ్స్ ఉంటాయి. 'ప్రస్థానం', 'ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. అందుకే దేవకట్టాని ప్రశాంత్ నీల్ ఎంచుకున్నాడు. పైగా ఎన్టీఆర్ వంటి మాస్ అమ్మ మొగుడు కట్ అవుట్ కి దేవకట్టా శైలి పర్ఫెక్ట్ గా సూటవుతుంది. ఒక రకంగా ఎన్టీఆర్ ఇమేజ్ ని మరింతగా పెంచుతాయి. మరి ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఎలివేషన్ సీక్వెన్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయో తెలిసిందే. సదరు ఎలివేషన్ కి దేవకట్టా మార్క్ డైలాగ్స్ తోడైతే సెల్యులాయిడ్ పై మాస్ జాతర ఖాయం. మహేష్(Mahesh),రాజమౌళి(Rajamouli)ల ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ వారణాసి(Varanasi)కూడా దేవకట్టా డైలాగ్స్ అందిస్తున్న విషయం తెలిసిందే. డ్రాగన్ ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కథా నేపథ్యం గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని, పొలిటికల్ టచ్ కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. అందుకే పొలిటికల్ డ్రామాను డీల్ చేయడంలో అనుభవం ఉన్న దేవకట్టాను టీమ్‌లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. డ్రాగన్ జూన్ 11 న వరల్డ్ వైడ్ గా ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
May 06, 2026
Dragon: ఎన్టీఆర్ 'డ్రాగన్' గురించి షాకింగ్ న్యూస్.. ఇంతవరకు టాకీ పార్ట్ స్టార్ట్ కాలేదు!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్' (Dragon) గురించి సినీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్ర షూటింగ్ ప్రణాళికలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా పార్ట్-1 కి సంబంధించి అత్యంత కీలకమైన యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించడానికి చిత్ర బృందానికి మరో 40 రోజుల సమయం పట్టనుంది. ఇప్పటివరకు పూర్తయిన షూటింగ్ కాకుండా, మరో 40 రోజులు కేవలం యాక్షన్ సీన్స్ కే కేటాయిస్తున్నారంటే.. ఇందులో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. యాక్షన్ పోర్షన్ పూర్తయిన వెంటనే, 'డ్రాగన్' మూవీ టీమ్ సాంగ్స్ చిత్రీకరణపై దృష్టి సారించనుంది. పాటల షూటింగ్ ముగిసిన తర్వాత చివరిగా టాకీ పోర్షన్‌ను పూర్తి చేసి షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది. దీనికోసం సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులను ప్రారంభించారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
May 05, 2026
Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్‌లో ఈరోజు హెడ్ లైన్స్..
1. 'విశ్వంభర' నుంచి కీరవాణి అవుట్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' టీమ్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో.. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం 'హనుమాన్' ఫేమ్ హరి గౌరను తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి హరి గౌర తన పనిని ఇప్పటికే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 2. NBK112 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న 'NBK112' మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మొదట అనిరుధ్ రవిచందర్ పేరు వినిపించినప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం ఆయన రేసులో లేరని తెలుస్తోంది. ప్రస్తుతం థమన్ లేదా దేవి శ్రీ ప్రసాద్‌లలో ఒకరిని ఫైనల్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. 3. 'ఫౌజీ' చిత్ర యూనిట్ లో ఒకరు మృతి ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' చిత్ర యూనిట్ కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టడం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 4. 'RC17' షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న 'RC17' మూవీ షూటింగ్ కి ముహూర్తం ఖరారైంది. ఇటీవల 'పెద్ది' సినిమా షూటింగ్ పూర్తి చేసిన చరణ్.. త్వరలోనే 'RC17' షూటింగ్ మొదలుపెట్టనున్నారు. జూన్ 25 నుండి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. 'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్-సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 5. ఎన్టీఆర్ 'డ్రాగన్' షూటింగ్ అప్డేట్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'డ్రాగన్' మూవీలో యాక్షన్ సీక్వెన్స్ లు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయట. పార్ట్-1 లో కీలకమైన యాక్షన్ ఘట్టాలను పూర్తి చేయడానికి చిత్ర బృందం మరో 40 రోజుల సమయాన్ని కేటాయించిందని సమాచారం. యాక్షన్ పార్ట్ ముగిసిన వెంటనే.. సాంగ్స్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఆపై టాకీ పోర్షన్ తో షూటింగ్ ను ముగించనున్నారు. 6. సాయిపల్లవి వల్ల 'కల్కి 2' షూటింగ్ కు బ్రేక్ 'కల్కి 2' సినిమాకు సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్, సాయి పల్లవి కాంబినేషన్లో సోమవారం ప్రారంభం కావాల్సిన 'కల్కి 2' కొత్త షెడ్యూల్ వాయిదా పడింది. సాయి పల్లవి అనారోగ్యం కారణంగా ఈ షూటింగ్ షెడ్యూల్‌ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలుస్తోంది. కాగా, దీపికా పదుకొణె స్థానంలో ఈ ప్రాజెక్ట్ లోకి సాయి పల్లవి వచ్చినట్లు సమాచారం. 7. డైరెక్టర్స్ అసోసియేషన్‌కు మోహన్ బాబు విరాళం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సోమవారం జరిగిన 'డైరెక్టర్స్ డే 2026' వేడుకలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కు మోహన్ బాబు 15 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. 8. 20 రోజులకే ఓటీటీలోకి 'పాపం ప్రతాప్' తిరువీర్ నటించిన తాజా చిత్రం 'పాపం ప్రతాప్' ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన ఈ రూరల్ కామెడీ మూవీ.. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ విజయాన్ని అందుకోవడమే కాకుండా, IMDBలో 7.8 రేటింగ్ సాధించి ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కానుంది. 9. ప్రముఖ నటుడు కన్నుమూత మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు సంతోష్ నాయర్.. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆయన భార్య రాజలక్ష్మి కూడా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. 10. ఆస్కార్ రేంజ్ విజువల్స్ తో 'ది ఒడిస్సీ' ట్రైలర్! ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కిస్తున్న అత్యంత భారీ మూవీ 'ది ఒడిస్సీ' ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. రెండున్నర నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత గ్రీకు వీరుడు 'ఒడిస్సియస్' తన ఇంటికి చేరుకోవడానికి సాగించిన ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాన్ని కళ్ళకు కట్టినట్లు ఈ ట్రైలర్ చూపించింది. గంభీరమైన సముద్ర దృశ్యాలు, పురాణ కాలం నాటి వింత జీవుల మధ్య సాగే పోరాటాలు ప్రేక్షకులకు ఆస్కార్ స్థాయి అనుభూతిని ఇస్తున్నాయి.
May 05, 2026
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో రెండు బిగ్ సర్ప్రైజ్లు..!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Dragon), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ (Dragon) గురించి రోజుకో క్రేజీ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ రాబోతుండగా, అంతకంటే ముందే రెండు సెన్సేషనల్ విషయాలు లీక్ అయ్యాయి. స్పెషల్ సాంగ్? ప్రస్తుత ట్రెండ్ ప్రకారం భారీ పాన్ ఇండియా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కిర్రాక్ పుట్టిస్తున్నాయి. ‘డ్రాగన్’లో కూడా ఒక అదిరిపోయే మాస్ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ పాట కోసం ఒక స్టార్ హీరోయిన్ను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు సమాచారం. రవి బస్రూర్ అందించే ఊర మాస్ బీట్స్‌కు తారక్ వేసే స్టెప్పులు థియేటర్లలో మోత మోగించడం ఖాయమని తెలుస్తోంది. షర్ట్‌లెస్ ఫైట్! సినిమాలోని అత్యంత పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ గురించి ఒక లీక్ బయటకు వచ్చింది. ఒక కీలక సన్నివేశంలో ఎన్టీఆర్ షర్ట్‌లెస్(Shirtless)గా కనిపించబోతున్నారట. ఈ ఫైట్ సీక్వెన్స్‌ను ఒక బీచ్ బ్యాక్‌డ్రాప్‌లో అత్యంత పవర్ ఫుల్ గా చిత్రీకరించనున్నట్లు టాక్. ఇప్పటికే తారక్ తన బాడీని రిప్డ్ లుక్‌లోకి మార్చుకునే పనిలో ఉన్నారని, ఆ ‘బీస్ట్’ అవతారం చూసి ఫ్యాన్స్ షాక్ అవ్వడం గ్యారెంటీ అని అంటున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాలో హీరో ఎలివేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలతో అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఎన్టీఆర్‌ను ఆయన మునుపెన్నడూ చూడని రీతిలో ప్రెజెంట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అంశాలు ఎన్నో ఉండనున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా ‘డ్రాగన్’ గ్లింప్స్ విడుదల కానుంది. ఇందులో రుక్మిణి వసంత హీరోయిన్గా నటిస్తుండగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.
May 03, 2026
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com







