
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో షాక్.. వచ్చే ఏడాదికి వాయిదా పడిన ఫౌజీ..?
'సీతారామం' ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న భారీ పీరియడ్ డ్రామా 'ఫౌజీ' (Fauzi)పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం రిలీజ్ డేట్ విషయంలో వార్తల్లో నిలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాది చివర్లో రావాల్సిన ఈ మూవీ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. రిలీజ్ వాయిదాకు కారణాలు: ఈ చిత్రం హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతోంది. సహజంగానే ఇలాంటి సినిమాలకు వీఎఫ్ఎక్స్ అత్యంత కీలకం. యుద్ధ సన్నివేశాలు, పీరియడ్ సెట్టింగ్స్‌ను అత్యంత నాణ్యంగా తెరపైకి తీసుకురావడానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు భారీగా ఉన్నాయి. విజువల్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని దర్శకుడు హను రాఘవపూడి భావిస్తున్నారు. దీనివల్ల మొదట అనుకున్న దసరా 2026 లేదా డిసెంబర్ విడుదల తేదీలు దాటిపోయే పరిస్థితి కనిపిస్తోంది. 2027లో రానుందా? ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, 'ఫౌజీ' సినిమాను 2027 ప్రారంభంలో విడుదల చేసే యోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మిగిలి ఉన్న 20 శాతం షూటింగ్ తో పాటు, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. ఈ జాప్యం ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్ అయిన సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' (Spirit) పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. 2027 మార్చి 5న 'స్పిరిట్' ఉండటంతో.. దానికి అడ్డు రాకుండా, గ్యాప్ ఉండేలా 'ఫౌజీ' విడుదలను ప్లాన్ చేసుకోవాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా కనిపిస్తారని సమాచారం. ఇమాన్వి హీరోయిన్గా పరిచయం అవుతుండగా, మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వాయిదా వార్త ప్రభాస్ అభిమానులకు కొంత నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ, అవుట్‌పుట్ అద్భుతంగా రావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా వస్తే, బాక్సాఫీస్ వద్ద 'ఫౌజీ' సృష్టించే విధ్వంసం మామూలుగా ఉండదు. మరి ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఎప్పుడు స్పందిస్తుందో వేచి చూడాలి.
May 07, 2026
Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు హెడ్ లైన్స్..
1. శ్రీతేజ్ ఇంటికి అల్లు అర్జున్ సతీమణి.. 'పుష్ప 2' ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ నివాసానికి.. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి వెళ్లారు. ప్రస్తుతం కోలుకుంటున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని.. ఆ కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ సోదరి చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను తానే భరిస్తానని అల్లు అరవింద్ హామీ ఇచ్చారు. 2. ‘ఫౌజీ’ రిలీజ్ పై కొత్త ట్విస్ట్.. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ ‘ఫౌజీ’. సుమారు 80 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమాకి భారీ వీఎఫ్ఎక్స్ పనులు మిగిలి ఉండటంతో.. రిలీజ్‌పై కొత్త అనుమానాలు మొదలయ్యాయి. దసరా లేదా ఈ ఏడాది చివర్లో రావాల్సిన ‘ఫౌజీ’.. 2027కు వాయిదా పడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. 3. ముందుగానే 'పెద్ది' సందడి.. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం 'పెద్ది'. ఈ సినిమాకు సంబంధించిన ఎడిటింగ్ వర్క్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. ఒకరోజు ముందుగానే అంటే జూన్ 3న భారీ స్థాయిలో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. 4. అల్లు అర్జున్ రాక ఎప్పుడంటే? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం “రాకా” రిలీజ్ పై కొత్త టాక్ మొదలైంది. భారీ వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా సినిమా వచ్చే ఏడాది వేసవి తర్వాత విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పారలెల్ గా కొనసాగుతున్నాయి. 5. కార్తీ కొత్త తెలుగు మూవీ లాంచ్.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా రూపొందనున్న కొత్త చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 'మ్యాడ్' ఫేమ్ కళ్యాణ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. 6. 'బ్లడీ రోమియో'కు బ్రేకులు.. నాని, సుజీత్ కాంబినేషన్లో అనౌన్స్ అయిన క్రేజీ ప్రాజెక్ట్ 'బ్లడీ రోమియో' వాయిదా పడినట్లు తెలుస్తోంది. నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్' ఆలస్యమవ్వడమే దీనికి కారణమని సమాచారం. ఈ గ్యాప్‌ను ఉపయోగించుకుంటూ.. సుజీత్ తన పూర్తి దృష్టిని పవన్ కళ్యాణ్ 'ఓజీ పార్ట్ 2' పనులపై మళ్లించారు. ప్రస్తుతం 'ఓజీ-2' స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. 'బ్లడీ రోమియో' ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. 7. వెన్నులో వణుకు పుట్టిస్తోన్న 'అగాధ' టీజర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ హర్రర్ థ్రిల్లర్ 'అగాధ' టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. క్షుద్ర పూజలు, నిగూఢమైన రహస్యాల చుట్టూ సాగుతూ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. టీజర్‌లోని విజువల్స్, భయానక వాతావరణం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో అలరించేందుకు సిద్ధమవుతోంది. 8. 'రాజ రాజ చోర' దర్శకుడితో రవితేజ మాస్ మహారాజా రవితేజ, యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్లో ఒక సినిమా రానుంది. 'రాజ రాజ చోర', 'స్వాగ్' చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హసిత్ గోలి చెప్పిన వైవిధ్యమైన స్క్రిప్ట్‌కు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. ప్రస్తుతం రవితేజ 'ఇరుముడి' షూటింగ్లో బిజీగా ఉండగా, అది పూర్తయిన వెంటనే ఈ కొత్త సినిమా ప్రారంభం కానుంది. 9. ఓటీటీలోకి 'తిమ్మరాజుపల్లి టీవీ' యువ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారిన తొలి సినిమా 'తిమ్మరాజుపల్లి టీవీ' డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. మునిరాజు దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా.. మే 15న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్లు 24 గంటల ముందే, అంటే మే 14 నుంచే ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. 10. షారుఖ్-దీపికా సాంగ్ వీడియో లీక్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ 'కింగ్' షూటింగ్ స్పెయిన్‌లో శరవేగంగా జరుగుతుండగా, లీకుల బెడద చిత్ర యూనిట్‌ను కలవరపెడుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి షారుఖ్ ఖాన్-దీపికా పదుకొణె పాల్గొన్న ఒక సాంగ్ షూటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాంగ్ తో పాటు కొన్ని కీలక యాక్షన్ సీక్వెన్స్ లు కూడా లీక్ అయినట్లు సమాచారం.
May 07, 2026
Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్‌లో ఈరోజు హెడ్ లైన్స్..
1. 'విశ్వంభర' నుంచి కీరవాణి అవుట్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' టీమ్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో.. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం 'హనుమాన్' ఫేమ్ హరి గౌరను తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి హరి గౌర తన పనిని ఇప్పటికే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 2. NBK112 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న 'NBK112' మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మొదట అనిరుధ్ రవిచందర్ పేరు వినిపించినప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం ఆయన రేసులో లేరని తెలుస్తోంది. ప్రస్తుతం థమన్ లేదా దేవి శ్రీ ప్రసాద్‌లలో ఒకరిని ఫైనల్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. 3. 'ఫౌజీ' చిత్ర యూనిట్ లో ఒకరు మృతి ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' చిత్ర యూనిట్ కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టడం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 4. 'RC17' షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న 'RC17' మూవీ షూటింగ్ కి ముహూర్తం ఖరారైంది. ఇటీవల 'పెద్ది' సినిమా షూటింగ్ పూర్తి చేసిన చరణ్.. త్వరలోనే 'RC17' షూటింగ్ మొదలుపెట్టనున్నారు. జూన్ 25 నుండి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. 'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్-సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 5. ఎన్టీఆర్ 'డ్రాగన్' షూటింగ్ అప్డేట్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'డ్రాగన్' మూవీలో యాక్షన్ సీక్వెన్స్ లు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయట. పార్ట్-1 లో కీలకమైన యాక్షన్ ఘట్టాలను పూర్తి చేయడానికి చిత్ర బృందం మరో 40 రోజుల సమయాన్ని కేటాయించిందని సమాచారం. యాక్షన్ పార్ట్ ముగిసిన వెంటనే.. సాంగ్స్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఆపై టాకీ పోర్షన్ తో షూటింగ్ ను ముగించనున్నారు. 6. సాయిపల్లవి వల్ల 'కల్కి 2' షూటింగ్ కు బ్రేక్ 'కల్కి 2' సినిమాకు సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్, సాయి పల్లవి కాంబినేషన్లో సోమవారం ప్రారంభం కావాల్సిన 'కల్కి 2' కొత్త షెడ్యూల్ వాయిదా పడింది. సాయి పల్లవి అనారోగ్యం కారణంగా ఈ షూటింగ్ షెడ్యూల్‌ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలుస్తోంది. కాగా, దీపికా పదుకొణె స్థానంలో ఈ ప్రాజెక్ట్ లోకి సాయి పల్లవి వచ్చినట్లు సమాచారం. 7. డైరెక్టర్స్ అసోసియేషన్‌కు మోహన్ బాబు విరాళం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సోమవారం జరిగిన 'డైరెక్టర్స్ డే 2026' వేడుకలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కు మోహన్ బాబు 15 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. 8. 20 రోజులకే ఓటీటీలోకి 'పాపం ప్రతాప్' తిరువీర్ నటించిన తాజా చిత్రం 'పాపం ప్రతాప్' ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన ఈ రూరల్ కామెడీ మూవీ.. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ విజయాన్ని అందుకోవడమే కాకుండా, IMDBలో 7.8 రేటింగ్ సాధించి ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కానుంది. 9. ప్రముఖ నటుడు కన్నుమూత మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు సంతోష్ నాయర్.. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆయన భార్య రాజలక్ష్మి కూడా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. 10. ఆస్కార్ రేంజ్ విజువల్స్ తో 'ది ఒడిస్సీ' ట్రైలర్! ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కిస్తున్న అత్యంత భారీ మూవీ 'ది ఒడిస్సీ' ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. రెండున్నర నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత గ్రీకు వీరుడు 'ఒడిస్సియస్' తన ఇంటికి చేరుకోవడానికి సాగించిన ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాన్ని కళ్ళకు కట్టినట్లు ఈ ట్రైలర్ చూపించింది. గంభీరమైన సముద్ర దృశ్యాలు, పురాణ కాలం నాటి వింత జీవుల మధ్య సాగే పోరాటాలు ప్రేక్షకులకు ఆస్కార్ స్థాయి అనుభూతిని ఇస్తున్నాయి.
May 05, 2026
‘కల్కి 2’ సెట్స్‌కి ప్రభాస్.. బాక్సాఫీస్ రికార్డులు ఇక షేక్ అవ్వాల్సిందే!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన 'కల్కి 2898 AD' చిత్రం బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది. పార్ట్-1 క్లైమాక్స్‌లో ప్రభాస్‌ను 'కర్ణుడు'గా చూపించి నాగ్ అశ్విన్ ఇచ్చిన ట్విస్ట్ సీక్వెల్‌పై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. ఇప్పుడు 'కల్కి 2'కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రేపటి (మే 4) నుంచి ఈ సీక్వెల్ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొనబోతున్నట్లు సమాచారం. (Kalki Part 2) హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో 'కల్కి 2' కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. రేపు జరగబోయే నైట్ షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొనబోతున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లపై ఇప్పటికే కొన్ని సీన్స్ తెరకెక్కించగా.. ప్రభాస్ మొదటిసారి 'కల్కి 2' షూటింగ్ లో పాల్గొంటుండడం విశేషం. పార్ట్-1 క్లైమాక్స్‌లో ప్రభాస్‌ను 'కర్ణుడి' అవతారంలో చూసిన ప్రేక్షకులకు, పార్ట్-2 లో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో షూటింగ్ ప్రారంభం కావడం ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది. 'కల్కి 2' నుంచి దీపికా పదుకొణెను తొలగించిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో సాయి పల్లవి నటించే అవకాశముంది. 'కల్కి 2'తో పాటు ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 'ఫౌజీ', 'స్పిరిట్' ఉన్నాయి. ఈ మూడు సినిమాల షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లు సమాచారం.
May 03, 2026
Prabhas: ‘ఫౌజీ’లో ఆ సీన్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ (Fauzi) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. క్లాస్ సినిమాల దర్శకుడిగా పేరున్న హను రాఘవపూడి, ఈసారి ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక భారీ మాస్ యాక్షన్ విజువల్ వండర్‌ను సిద్ధం చేస్తున్నట్లు తాజా సమాచారం. దర్శకుడు హను రాఘవపూడి మేకింగ్ స్టైల్ చాలా విభిన్నంగా ఉంటుంది. ఆయన సినిమాల్లో క్లాసిక్ టచ్, అందమైన ప్రేమకథలు ఉంటాయి. కానీ 'ఫౌజీ' విషయంలో ఆయన తన రూట్ మార్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఫిజిక్, ఆయన ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుని.. వెండితెరపై ఆయనను అత్యంత పవర్‌ఫుల్‌గా చూపించేందుకు హను భారీ మాస్ ఎలివేషన్లను డిజైన్ చేశారట. ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని రీతిలో హను ప్రజెంట్ చేస్తున్నారట. ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ గతంలో వచ్చిన వార్ సినిమాల కంటే భిన్నంగా, అత్యంత వైల్డ్ గా ఉండబోతున్నాయని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కేవలం భారీ డైలాగులు మాత్రమే కాకుండా, ప్రభాస్ కటౌట్‌ను పూర్తిగా జస్టిఫై చేసేలా ప్రతి ఫ్రేమ్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటివరకు ప్రభాస్ ఎన్నో రకాల యాక్షన్ పాత్రలు చేసినప్పటికీ.. ‘ఫౌజీ’లో ఆయన స్టైల్, మేకోవర్ సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తారని సమాచారం. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. సినిమాలో ఒక పర్టికులర్ కాస్ట్యూమ్‌లో ప్రభాస్ వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయట. ఆ కాస్ట్యూమ్‌లో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి అందరూ ఫిదా అయిపోతారని, ఆ సీన్స్ సినిమాకే మేజర్ ప్లస్ పాయింట్‌గా మారుతాయని చర్చించుకుంటున్నారు. ప్రభాస్ కటౌట్‌కు హను రాఘవపూడి విజన్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ రావడం గ్యారెంటీ.
Apr 17, 2026ప్రభాస్ ఫౌజీ షూటింగ్లో భారీ మార్పు.. పండగ చేసుకుంటున్న రెబల్‌స్టార్ ఫ్యాన్స్!
- రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ - ఒకేసారి రెండు యూనిట్లతో ‘ఫౌజీ’ హంగామా - హను రాఘవపూడి మాస్టర్ ప్లాన్! రెబల్ స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్‌లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రాల్లో దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ వార్ డ్రామా 'ఫౌజీ' (వర్కింగ్ టైటిల్) ఒకటి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. షూటింగ్ పనుల్లో వేగం పెంచేందుకు చిత్ర యూనిట్ ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలకు షూటింగ్ సమయం ఎక్కువగా పడుతుంది. అయితే 'ఫౌజీ' చిత్రాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేసి, అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా రెండు వేర్వేరు షూటింగ్ యూనిట్లను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఒక యూనిట్ ఆధ్వర్యంలో దర్శకుడు హను రాఘవపూడి ప్రధాన తారాగణంపై కీలకమైన ఎమోషనల్ సీన్లను చిత్రీకరిస్తుండగా, మరో యూనిట్ సమాంతరంగా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ మరియు ఇతర కీలక సన్నివేశాలను పూర్తి చేస్తోంది. ఈ డబుల్ యూనిట్ ప్లాన్ వెనుక ఒక బలమైన కారణం ఉంది. 2026 ఆగస్టు నెలలో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. పీరియాడిక్ డ్రామా కావడంతో పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. అందుకే షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, టెక్నికల్ పనులపై దృష్టి సారించాలని హను రాఘవపూడి ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్లు టాక్. 'సీతా రామం' వంటి క్లాసిక్ హిట్‌ను అందించిన హను రాఘవపూడి, ఈసారి 1940ల కాలం నాటి యుద్ధ నేపథ్యంలో ఒక అద్భుతమైన ప్రేమకథను సిద్ధం చేశారు. ఇందులో ప్రభాస్ ఒక పవర్ఫుల్ సోల్జర్ పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయం అవుతుండగా, బాలీవుడ్ లెజెండరీ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఈ సినిమాకు మరో మేజర్ అసెట్ కానుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ అప్డేట్తో పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ మార్కెట్ రేంజ్‌కు తగ్గట్టుగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. మొత్తానికి, డబుల్ యూనిట్ షూటింగ్‌తో 'ఫౌజీ' టీమ్ చేస్తున్న హంగామా చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద మరోసారి ప్రభాస్ ప్రభంజనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. యుద్ధ క్షేత్రంలో ఈ రెబల్ స్టార్ చేసే విన్యాసాలు ఎలా ఉంటాయో చూడాలంటే ఆగస్టు వరకు వేచి చూడాల్సిందే!
Apr 09, 2026ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్: సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ వాయిదా!
- ఫౌజీ షూటింగ్లో ప్రభాస్ బిజీ - వంగా సినిమా ఇప్పట్లో లేనట్టేనా? - ప్రభాస్ డబుల్ ప్లాన్ మిస్ - స్పిరిట్ కంటే ముందే ఫౌజీ సందడి పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే ఏ హీరోకైనా అసూయ కలగక మానదు. ఒకదానిని మించి మరొకటి అన్నట్లుగా భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టారు రెబల్ స్టార్. అయితే, ఈ సినిమాల షూటింగ్‌లు, విడుదల తేదీల విషయంలో మాత్రం తరచూ మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రభాస్ అభిమానులకు ఒక మిశ్రమ వార్త వినిపిస్తోంది. మోస్ట్ అవైటెడ్ మూవీ 'స్పిరిట్' షూటింగ్ మరోసారి వాయిదా పడినట్లు ఫిలిం నగర్ టాక్. నిజానికి 2026 కల్లా రెండు సినిమాలను థియేటర్లలోకి తీసుకురావాలని ప్రభాస్ గట్టి సంకల్పంతో ఉన్నారట. అందులో ఒకటి హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న యుద్ధ ప్రాతిపదికన సాగే 'ఫౌజీ' (వర్కింగ్ టైటిల్), మరొకటి 'యానిమల్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా రూపొందించాల్సిన 'స్పిరిట్'. కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే ఈ ఏడాది ప్రభాస్ పూర్తి ఫోకస్ అంతా 'ఫౌజీ' పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి 2026 ప్రథమార్థంలోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు, సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' కోసం ప్రభాస్ నుండి భారీగా బల్క్ డేట్స్ కోరినట్లు సమాచారం. ఒకసారి ఈ ప్రాజెక్ట్ మొదలైతే ఎక్కడా విరామం లేకుండా పూర్తి చేయాలనేది దర్శకుడి ఆలోచన. అయితే 'ఫౌజీ' షూటింగ్ ఒక కొలిక్కి వస్తే తప్ప ప్రభాస్ అన్ని డేట్లు కేటాయించే పరిస్థితి లేదు. దీంతో 'స్పిరిట్' ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో ఉంచినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సందీప్ రెడ్డి వంగా లాంటి క్రేజీ డైరెక్టర్ 'యానిమల్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ కోసం దాదాపు రెండేళ్లుగా ఎదురుచూస్తుండటం గమనార్హం. ఒకవేళ ఆయన వేరే హీరోతో సినిమా చేసి ఉంటే ఇప్పటికే అది విడుదలై ఉండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ ఒకటి కంటే ఎక్కువ సినిమాలు ఒకేసారి ఒప్పుకోవడం వల్ల, డేట్ల సర్దుబాటు కుదరక దర్శకులు వెయిటింగ్ పీరియడ్‌లో ఉండాల్సి వస్తోందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ విషయంపై ప్రభాస్ ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 'రాజా సాబ్' ఫలితం ఎలా ఉన్నా, ప్రభాస్ క్రేజ్ మాత్రం అణుమాత్రం తగ్గలేదు. అందుకే ఆయన ప్రతి సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఖాకీ డ్రెస్సులో ప్రభాస్‌ను చూడాలని ఆశపడుతున్న ఫ్యాన్స్‌కు 'స్పిరిట్' వాయిదా పడటం కొంత నిరాశ కలిగించే విషయమే. అయినప్పటికీ, హను రాఘవపూడి మార్కు ఎమోషనల్ వార్ డ్రామా 'ఫౌజీ' లో ప్రభాస్ లుక్ అదిరిపోతుందనే టాక్ రావడంతో ఫ్యాన్స్ ఆ సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం, వచ్చే రెండు మూడు నెలల్లో 'ఫౌజీ' షూటింగ్‌ను కంప్లీట్ చేసి, ఆ తర్వాతే 'స్పిరిట్' సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అంటే 2026లో 'ఫౌజీ' పలకరించనుండగా, 'స్పిరిట్' రాక 2027కు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ప్రభాస్ చేతిలో ఉన్న ఇతర ప్రాజెక్టులైన 'సలార్ 2', 'కల్కి 2' వంటి సినిమాలు కూడా క్యూలో ఉన్నాయి. మరి డార్లింగ్ తన డేట్లను ఎలా మేనేజ్ చేసి ఈ భారీ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తెస్తారో చూడాలి!
Mar 31, 2026
Prabhas: మరో యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తున్న ప్రభాస్!
ప్రభాస్ ని కలిసి 'ఎకో' దర్శకుడు హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో భారీ సినిమా! 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్(Prabhas).. తనతో సినిమాలు చేయడానికి ఎందరో స్టార్ డైరెక్టర్స్ రెడీగా ఉన్నా.. యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పటికే సుజీత్, రాధాకృష్ణ కుమార్ వంటి పలువురు దర్శకులకు అవకాశమిచ్చాడు. ఇప్పుడు ఆ లిస్టులో మరో డైరెక్టర్ చేరేలా ఉన్నాడు. 'కక్ష: అమ్మినిప్పీళ్ల'తో దర్శకుడిగా పరిచయమైన మలయాళ డైరెక్టర్ దింజిత్ అయ్యతన్.. 'కిష్కింధ కాండం', 'ఎకో' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ దర్శకుడు ఇటీవల ప్రభాస్ ను కలవడం విశేషం. ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ప్రభాస్ తో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన దింజిత్.. "సూపర్ స్టార్ ప్రభాస్ ని కలవడం సంతోషంగా ఉంది. గొప్ప సంభాషణలు, నవ్వులు, మంచి విందుతో నిండిన అద్భుతమైన సాయంత్రం ఇది. ప్రభాస్ సార్ కి, హోంబలే ఫిల్మ్స్ కు ధన్యవాదాలు." అని రాసుకొచ్చాడు. గతంలో హోంబలే ఫిల్మ్స్, ప్రభాస్ తో మూడు సినిమాలను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ మూడు సినిమాలకు దర్శకులు ఎవరనేది అధికారికంగా చెప్పలేదు. అలాంటిది ఇప్పుడు ప్రభాస్ ని దింజిత్ కలవడం, హోంబలే ఫిల్మ్స్ కి థాంక్స్ చెప్పడం చూస్తుంటే.. వీరి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయిందని అనిపిస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ప్రభాస్ ప్రస్తుతం 'ఫౌజి' షూటింగ్ లో బిజీలో ఉన్నాడు. 1940 నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాకు హను రాఘవపూడి దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్ తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. 'ఫౌజి'తో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్', నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో 'కల్కి-2' సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. వీటి తర్వాత దింజిత్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందేమో చూడాలి. Also Read: 'ఉస్తాద్ భగత్ సింగ్' సెన్సార్ రిపోర్ట్ https://www.instagram.com/p/DVsKJwVj-Vj/
Mar 11, 2026
Prabhas: ప్రభాస్ గురించి వినిపిస్తున్న ఆ షాకింగ్ న్యూస్ నిజమేనా?
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన న్యూస్ ప్రభాస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడా? ఆ వార్తల్లో నిజమెంత? ఈ ఏడాది సంక్రాంతికి 'ది రాజా సాబ్'తో నిరాశపరిచిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas).. తన తదుపరి సినిమాలతో బాక్సాఫీస్ కి తన పవర్ ఏంటో చూపించాలి అనుకుంటున్నారు. ప్రస్తుతం 'ఫౌజి', 'స్పిరిట్', 'కల్కి-2' వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. 'సలార్-2' కూడా చేసే అవకాశముంది. ఇలాంటి తరుణంలో ఒక ఊహించని న్యూస్ తెరపైకి వచ్చింది. ప్రభాస్ తో 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma) భారీ మైథలాజికల్ ఫిల్మ్ ని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. రీసెంట్ గా ఆ వార్తలు మరింత ఊపందుకున్నాయి. ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో మూవీ ఖచ్చితంగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న మూడు సినిమాలు పూర్తయిన తరువాత.. ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని వినికిడి. ఈ లోపు ప్రశాంత్ కూడా 'జై హనుమాన్' పూర్తి చేయాల్సి ఉంది. ప్రభాస్ తో సినిమా ఉండటం ప్రశాంత్ వర్మకు బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తనవి రెండు ప్రాజెక్ట్ లు ఆగిపోయాయి. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో తలపెట్టిన 'బ్రహ్మ రాక్షస' ఆగిపోయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కూడా ఎందుకనో పట్టాలెక్కలేదు. ఆ రెండు సినిమాల బాటలోనే ప్రభాస్ ప్రాజెక్ట్ కూడా అటకెక్కినట్లే అని వార్తలొచ్చాయి. వరుసగా మూడో ప్రాజెక్ట్ ఆగిపోవడం అనేది ఏ దర్శకుడికైనా దెబ్బే. దీంతో ప్రశాంత్ వర్మ సినీ కెరీర్ పై తీవ్ర ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రభాస్ ప్రాజెక్ట్ ఆగిపోలేదనే తాజా వార్త.. ప్రశాంత్ వర్మకు ఎంతో ఊరట అని చెప్పవచ్చు. 'హనుమాన్' బాటలోనే 'జై హనుమాన్'తో మరో హిట్ కొట్టి.. ఆ తర్వాత ప్రభాస్ ప్రాజెక్ట్ తో మ్యాజిక్ చేస్తే.. ప్రశాంత్ వర్మ స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయినట్లే.
Feb 19, 2026
ప్రభాస్ కి గాయాలు! ఎందుకు అయ్యాయో తెలిస్తే షాక్ అవుతారు
-సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ప్రభాస్ -గాయాలు నిజమేనా! -ఫ్యాన్స్ ఆందోళన -అధికార ప్రకటన చేయాలని డిమాండ్ రాజా సాబ్ ఇచ్చిన పరాభవానికి గుణపాఠం నేర్పాలనే పట్టుదలతో ప్రభాస్ ఉన్నాడు. అందుకే తన అప్ కమింగ్ మూవీ 'ఫౌజీ'(Fauji)ని శరవేగంగా పూర్తి చేసి అభిమానుల ముందు ఉంచాలనేది ప్రభాస్ ప్లాన్. సీతారామం ఫేమ్ హను రాఘవపూడి(Hanu Raghavapudi)దర్శకత్వంలో పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతుంది. టీజర్ తో ఊహకి అందని విధంగా యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయనే మాటలో ఎవరికి డౌట్స్ లేవు. ఈ నేపథ్యంలోనే ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ప్రభాస్ గాయాలు పాలయ్యాడనే న్యూస్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. పూర్తి డీటెయిల్స్ చూద్దాం. రీసెంట్ గా ప్రభాస్ తన క్యారక్టర్ కి సంబంధించి గుర్రపు స్వారీ చేస్తుంటే, అనుకోకుండా కింద పడ్డాడని, దీంతో ప్రభాస్ చేతికి గాయమైందనే వార్త ఒక రేంజ్ లోనే చక్కర్లు కొడుతుంది. చిత్ర బృందం మాత్రం అధికారకంగా వెల్లడి చెయ్యలేదు. కానీ సోషల్ మీడియాలో గాయం న్యూస్ వైరల్ గా మారడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో సదరు విషయంపై నిర్మాణ సంస్థ పూర్తి క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. మరి అభిమానుల ఆందోళనని పరిగణలోకి తీసుకొని గాయం విషయంపై ప్రకటన వస్తుందేమో చూడాలి. also read: హీరో నిఖిల్ కాంట్రవర్సీ కామెంట్స్.. ఎవరిని టార్గెట్ చేశాడు? ప్రభాస్ సరసన ఇమాన్వి(Imanvi)జతకడుతుండగా మరో హీరోయిన్ కూడా ఉండే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. మిదున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్,జయప్రద, భానుచందర్ వంటి మేటి నటులు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. పాన్ ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది. ప్రభాస్ సోల్జర్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. తన ఎంటైర్ కెరీర్ లోనే ఫస్ట్ టైం సోల్జర్ రోల్ లో కనిపిస్తున్నాడు. సదరు క్యారక్టర్ లో మరో వేరియేషన్ కూడా ఉంటుందేమో చూడాలి. దసరా కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
Feb 16, 2026
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com







