
Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్
తగ్గేదేలే అనే రీతిలో పలు ఆసక్తికర తెలుగు సినిమా వార్తలు తెలుగు సినిమా ప్రేమికులు, పాఠకుల కోసం అందుబాటులో ఉన్నాయి. 1 . నాగార్జున విషయంలో హైకోర్ట్ కీలక తీర్పు.. అనుమతి పత్రాలు చూపండి అని ఆదేశాలు నా పేరుతో టీ షర్ట్స్ ని ఒక సంస్థ విక్రయిస్తుందని కొన్ని రోజుల క్రితం నాగార్జున ఢిల్లీ హై కోర్ట్ ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు స్పందిస్తు నాగార్జునతో నేరుగా ఒప్పందం లేనప్పుడు ఆయన పేరు, ఫోటోలని వాడుకుంటూ టీ షర్టులు ఎలా అమ్ముతారు. మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా హక్కులు పొందామని చెప్తే సరిపోతుందా! ప్లెయింటిఫ్ తో మీకు పరిచయం కూడా లేనప్పుడు ఆ వస్తువులని అమ్మే చట్టబద్ధత మీకు ఎక్కడి నుంచి వచ్చింది. అనుమతి పాత్రలు ఉన్నాయా అని ఢిల్లీ హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 2. విజయ్ ఇక సెకండ్ ప్లేస్ లోనే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, రాజకీయాల్లో తనకంటు ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకున్న దళపతి విజయ్ మరో అరుదైన ఘనతని సొంతం చేసుకున్నారు. ప్రముఖ సినిమా వెబ్ సైట్ ఐఎండీబీ తాజాగా విడుదల చేసిన 'పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్' జాబితాలో విజయ్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అంతకు ముందు వారంలో 21 వ స్థానంలో ఉన్న విజయ్ ఇప్పుడు సెకండ్ ప్లేస్ కి రావడం విశేషం. 3 . భోపాల్‌లో ‘పెద్ది’ సౌండ్.. థర్డ్ సాంగ్ లాంచ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వన్ మాన్ షో పెద్ది నుంచి తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ కి సంబంధించిన శుభవార్త బయటకు వచ్చింది. 'సౌండ్ ఆఫ్ పెద్ది' పేరుతో మే 23వ తేదీన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో స్పెషల్ సాంగ్‌ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్లో రెహమాన్ స్వయంగా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతుండటం విశేషం. ఆయన స్వరపరిచిన బాణీలకి స్టేజ్ పై లైవ్ మ్యూజిక్ తోడైతే, ఆ వైబ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే వచ్చిన రెండు సాంగ్స్ ఒక రేంజ్ లో సక్సెస్ అయిన విషయం తెలిసిందే. 4 . బాలకృష్ణ, ఎన్టీఆర్ మల్టీస్టారర్! గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మల్టిస్టారర్ చెయ్యాలి అనే డిమాండ్ ఎప్పట్నుంచో ఫ్యాన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా మళ్ళీ తమ కోరికని వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళ కోరికని బాలయ్య, ఎన్టీఆర్ తీరుస్తారేమో చూడాలి. బాలయ్య ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చిత్రంతో బిజీగా ఉండగా, ప్రశాంత్ నీల్ సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. 5 . IBOMMA మళ్లీ వచ్చేసింది! కొంతకాలంగా నిలిచిపోయినట్లు కనిపించిన IBOMMA వెబ్సైట్ తాజాగా మళ్లీ ఆన్లైన్లో కనిపించడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. సైట్ ని ఆపరేట్ చేస్తున్నాడనే ఆరోపణలతో రవిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేయగా.. సైట్ కూడా క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు మళ్లీ కొత్త సినిమాలతో సైట్ యాక్టివ్ కావడం ఇండస్ట్రీకి పెద్ద షాక్‌గా మారింది. ఈ పరిణామంపై పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రవి ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న విషయం తెలిసిందే. 6 . మెగాస్టార్ చిరంజీవి జెన్ జీ లుక్ వైరల్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎంతో స్లిమ్‌గా, స్టైలిష్‌గా జెన్ జీ లుక్ లో యువ హీరోలకి సైతం పోటీ ఇచ్చేలా ఉన్నారు. దీంతో సదరు స్టిల్స్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. గత కొంతకాలంగా చిరు కఠినమైన డైట్ క్రమశిక్షణతో కూడిన వర్కవుట్స్ చేస్తున్నారు. అందుకే అంత ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారని సినీ వర్గాల టాక్. 7 . క్షమాపణలు చెప్తున్న అలీ హిందువులని అవమానించే రీతిలో ఉన్న సోప్ యాడ్ చేసి ప్రముఖ నటుడు అలీ అపఖ్యాతికి గురైన విషయం తెలిసిందే. హిందువులు సోషల్ మీడియా వేదికగా అలీపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. గతంలో తాను నటించిన 'దేవుడు చేసిన మనుషులు' సినిమాలోని ఒక పాపులర్ కామెడీ సీన్‌ని స్ఫూర్తిగా తీసుకుని ముంబైకి చెందిన కంపెనీ ఈ యాడ్ రూపొందించింది దాంతో కేవలం వినోదం కోసమే ఆ యాడ్ చేశాను. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదు. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరాడు. 8 . పూజాహెగ్డే కి అండగా అల్లు అర్జున్! పూజాహెగ్డే ఇటీవల కెరీర్ పరంగా కొంచం డల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంలో తనకి అవకాశం ఇవ్వబోతున్నాడనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. అట్లీ మూవీతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న విషయం తెలిసిందే. పూజా, అల్లు అర్జున్ కాంబోలో ఇప్పటికే డి జె జగన్నాధం, అల వైకుంఠ పురం వచ్చి మంచి విజయాలు అందుకున్నాయి. 9 . వారణాసిలో వారణాసి’ షూటింగ్? మహేశ్‌బాబు రాజమౌళి ల ‘వారణాసి’షూటింగ్ ఇప్పుడు అసలు లెవల్‌కి వెళ్లబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. భారీ అండర్‌వాటర్ యాక్షన్ సీన్‌ని వారణాసిలో చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. మొదట ఈ సన్నివేశాన్ని హైదరాబాద్‌లో షూట్ చేయాలని అనుకున్నారు. కానీ 150 ట్యాంకర్ల నీటి సరఫరాకి జలమండలి అనుమతి ఇవ్వకపోవడంతో వారణాసికి షిఫ్ట్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి . 10 . నట్టి కుమార్ రాజీనామా ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ పదవికి రాజీనామా చేయడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు తాను పంపిన రాజీనామా లేఖలో 'ప్రొడ్యూసర్ కౌన్సిల్లో పారదర్శకత లోపించింది. కొందరు సభ్యుల ఏకపక్ష నిర్ణయాల వల్ల చిన్న నిర్మాతలకి అన్యాయం జరుగుతుంది. థియేటర్ల కేటాయింపు, వర్చువల్ ప్రింట్ ఫీజు వంటి విషయాల్లో కౌన్సిల్ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైంది. కేవలం కొందరి ప్రయోజనాల కోసమే కౌన్సిల్ కార్యకలాపాలు సాగుతున్నాయి. అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
May 13, 2026
Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్..
'వారణాసి' షూటింగ్.. ఆ సమస్యకు పరిష్కారం దొరికిందా? మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న 'వారణాసి' సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా పాల్గొంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లో నీటి కొరత కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడిందన్న వార్తలు వైరల్ అయ్యాయి. భారీ వాటర్ అవసరాల నేపథ్యంలో సమస్య తలెత్తినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వడంతో ఆ సమస్యకు పరిష్కారం దొరికిందా? లేదా ప్లాన్ మార్చారా? అన్న చర్చ సాగుతోంది. ముంబైలో పెద్ది హంగామా! పెద్ది ట్రైలర్‌ను ఈ నెల 18న ముంబైలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు మూవీ టీమ్ మొత్తం ఈ ఈవెంట్లో పాల్గొననుంది. ట్రైలర్ లాంచ్ తర్వాత భోపాల్‌లో స్పెషల్ మ్యూజికల్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తోంది. ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్ టైమ్ ఫిక్స్! ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'డ్రాగన్' నుండి సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను మే 20న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు టైం కూడా ఫిక్స్ అయింది. మే 19 అర్థరాత్రి 12 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చిరంజీవి! మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో రానున్న క్రేజీ ప్రాజెక్ట్ 'Mega158' గురించి తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం మెగాస్టార్ సరికొత్త మేకోవర్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో.. రగ్గడ్ గా కనిపించబోతున్నారని సమాచారం. విభిన్నమైన హెయిర్ స్టైల్, గడ్డంతో చిరు వింటేజ్ మాస్ లుక్‌ను తలపించేలా ఈ క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు టాక్. డైరెక్టర్ గా మారుతున్న రామ్ పోతినేని! టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకుడిగా మారబోతున్నాడు. వరుస పరాజయాల నేపథ్యంలో, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి రామ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, తన అన్న కృష్ణ చైతన్యతో కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. రవితేజ రెమ్యూనరేషన్లో భారీ కోత! తనపై నమ్మకం ఉంచిన నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశంతో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ. 25 నుండి 30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న రవితేజ.. తన రాబోయే చిత్రాల కోసం దానిని రూ. 15 కోట్లకు తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. తన మార్కెట్ మళ్ళీ నిలదొక్కుకునే వరకు బడ్జెట్ నియంత్రణలో ఉండాలని, తద్వారా సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారట. విజయ్ సీఎం కావడంపై రజినీకాంత్ రియాక్షన్! తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ కు.. సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్తున్నాయి. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడ్డారు. ఈ సందర్భంగా విలేకరులు విజయ్ సీఎం కావడంపై ఆయన అభిప్రాయాన్ని కోరారు. రజినీకాంత్ ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా, కేవలం తనదైన శైలిలో నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. రజినీకాంత్ మౌనంగా ఉన్నప్పటికీ.. ఆ చిరునవ్వులో విజయ్ పట్ల గౌరవం, అభినందనలు ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సూర్య సినిమాకు కొత్త తలనొప్పి! కోలీవుడ్ నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ ఇప్పుడు తెలుగు నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. సూర్య హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'వీర భద్రుడు' సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో.. బాలాజీ గతంలో తెలుగు సినిమాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో.. తెలుగు సినిమాల్లో లాజిక్ ఉండదని, కేవలం హీరోల ఎలివేషన్లకే ప్రాధాన్యత ఇస్తారని ఆయన విమర్శించారు. విడాకుల బాటలో మౌనీ రాయ్ బాలీవుడ్ నటి, 'నాగిని' ఫేమ్ మౌనీ రాయ్ తన భర్త, దుబాయ్ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో విడిపోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట గత కొద్ది రోజులుగా విడివిడిగా నివసిస్తున్నారని, వీరి మధ్య మనస్పర్థలు తీవ్రమయ్యాయని తెలుస్తోంది. మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. మౌనీ తన ప్రొఫైల్ నుండి భర్తతో ఉన్న కొన్ని ఫోటోలను తొలగించగా, సూరజ్ కూడా తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేసినట్లు సమాచారం. ప్రముఖ సింగర్ కు జైలు శిక్ష ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టు తీర్పు వెలువడింది. గత మార్చిలో కాలిఫోర్నియాలో మద్యం మత్తులో కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన బ్రిట్నీపై నమోదైన కేసులో, తాజాగా ఆమెకు ఒక్కరోజు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జైలు శిక్షతో పాటు 571 డాలర్ల జరిమానాను కోర్టు విధించింది.
May 12, 2026
Varanasi: ఇక నో హాలిడేస్.. రాజమౌళి బ్రాండ్ షురూ
మహేష్(Mahesh Babu)రాజమౌళి(ss Rajamouli)కలల ప్రాజెక్ట్ వారణాసి(Varanasi). భారతీయ చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు భారతీయ సినీ ప్రేక్షకుల కలల ప్రాజెక్ట్ కూడా. రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాల ఆధారంగా, ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహసికుడి కథగా రూపొందుతుందనే టాక్ ఉంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగుతుందని, వారణాసి నుంచి మొదలై కెన్యా, అంటార్కిటికా వంటి వివిధ ప్రాంతాలకి కథ విస్తరిస్తుందనే మరో టాక్ కూడా వినిపిస్తూ ఉంది వేసవి కాలం కావడంతో మండుతున్న ఎండల దృష్ట్యా వారణాసికి చిత్ర యూనిట్ కొన్ని రోజుల క్రితం స్మాల్ బ్రేక్ ఇచ్చింది. ఇప్పడు తిరిగి కొత్త షెడ్యూల్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ కొత్త షెడ్యూల్లో మహేష్, ప్రియాంక చోప్రా(Priyanka Chopra)ఇతర ప్రధాన తారాగణంపై కొన్ని కీలకమైన సన్నివేశాలని తెరకెక్కించబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే భారీ సెట్లని రూపొందించినట్టు సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిత్ర బృందం అంతర్జాతీయ లొకేషన్లకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. Also read: వీరభద్రుడు ట్రైలర్ అదుర్స్.. తెల్ల వాళ్ళ దేవుడైతే క్షమాపణ అడగవచ్చు ఇటీవల మెక్సికోలో జరిగిన ఓ అంతర్జాతీయ ఈవెంట్లో ‘వారణాసి’ని చిత్ర బృందం పరిచయం చేసింది. ప్రెజెంట్ షెడ్యూల్ పూర్తవ్వగానే ఫ్రాన్స్‌లో కూడా భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించనున్నట్లు సమాచారం. గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ జానర్లో తెరకెక్కుతున్న వారణాసిని హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తీర్చిదిద్దుతున్నారు. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా కె ఎల్ నారాయణ, ఎస్ ఎస్ కార్తికేయ సుమారు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
May 12, 2026
Manasa Varanasi vs Mamitha bhaiju: ఎంత పని జరిగిపోయింది.. ఒకరి ప్లేస్ లో మరొకరు!
ఒకరి అవకాశాలని ఒకరు అందిపుచ్చుకోవడం అనేది సినీ ఇండస్ట్రీలో కామన్. ప్రెజెంట్ క్రేజ్ ని బట్టి మేకర్స్ తమ సినిమాలో పలానా వాళ్ళు ఉంటే తమ సినిమాకి ఉపయోగమని కోరుకోవడమే అందుకు కారణం. అంతే కానీ సినిమా కథలగా పగలు, కుట్ర కుతంత్రాలు ఉండవు. ఈ కోవలోనే ప్రేమలు, డ్రాగన్ బ్యూటి మమిత భైజు(Mamitha bhaiju)ప్లేస్ లో కపుల్ ఫ్రెండ్లీ ఫేమ్ మానస వారణాసి(Manasa Varanasi)వచ్చి చేరిందనే న్యూస్ వైరల్ గా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. శర్వానంద్, శ్రీనువైట్ల(Srinu Vaitla) కాంబోలో ‘జార్జ్ క్రిష్’అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ ప్రెస్టేజియస్ట్ గా రూపొందిస్తుంది. తొలుత హీరోయిన్ గా మమితా బైజుని ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అధికార ప్రకటన రావడమే తరువాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు మానస వారణాసిని ఫైనల్ చేసే ఆలోచనలో టీమ్ ఉందని తెలుస్తోంది.. కపుల్ ఫ్రెండ్లీ లో మిత్రా క్యారక్టర్ ని అత్యద్భుతంగా పోషించింది. ప్రభాస్ సైతం మానస పెర్ఫార్మ్ ని మెచ్చుకున్నాడు. మరి ఈ వార్త నిజం అయితే మానస వారణాసికి మంచి అవకాశమని చెప్పవచ్చు మరోవైపు శర్వానంద్ ఇప్పటికే తన లుక్ పై కసరత్తులు చేస్తున్నాడు. బైకర్ కోసం సన్నబడ్డ శర్వా జార్జ్ క్రిష్ కోసం కొంచెం వెయిట్ పెరగబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. శ్రీను వైట్ల గత చిత్రం ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన సత్తా చాటాలనే పట్టుదలతో శ్రీను వైట్ల ఉన్నాడు.
May 10, 2026
Rajamouli: రాజమౌళి నెక్స్ట్ టార్గెట్.. మహేష్ తర్వాత మళ్ళీ 'ఆర్ఆర్ఆర్' హీరోలతోనేనా?
- 'వారణాసి' తర్వాత రాజమౌళి మూవీ ఏ హీరోతో? - ఎన్టీఆర్, రామ్ చరణ్ వైపే జక్కన్న మొగ్గు చూపుతున్నాడా? - మరో మల్టీస్టారర్ చేసే సాహసం చేస్తాడా? - ఆ రెండు స్టోరీలతో దర్శకధీరుడు వేస్తున్న స్కెచ్ ఏంటి? దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ప్రస్తుతం మహేష్ బాబుతో 'వారణాసి' (Varanasi) సినిమా చేస్తున్నారు. ఈ భారీ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ ఏ హీరోతో ఉంటుంది అనే చర్చ మొదలైపోయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'వారణాసి' సినిమా తర్వాత రాజమౌళి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం 'ఆర్ఆర్ఆర్'తో ఈ ఇద్దరు హీరోలకు గ్లోబల్ ఇమేజ్ వచ్చింది. అలాగే, రాజమౌళితో వారికున్న బాండింగ్ కూడా చాలా ప్రత్యేకమైనది. రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ కోసం విడివిడిగా రెండు పవర్ఫుల్ కథలను సిద్ధం చేయిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఏ కథ ముందుగా కొలిక్కి వస్తే.. ఆ హీరోతో సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు. గతంలో వీరిద్దరితో కలిసి మల్టీస్టారర్ చేసిన రాజమౌళి.. ఈసారి మాత్రం విడివిడిగా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ కోసం ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఒక హై-వోల్టేజ్ ఎమోషనల్ డ్రామాను సిద్ధం చేస్తున్నట్లు టాక్. అలాగే రామ్ చరణ్ స్టైలిష్ లుక్, యాక్షన్ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుని మరో భారీ కథపై కసరత్తు జరుగుతోందట. ఈ ఇద్దరు హీరోలలో ఎవరితో ముందుగా సినిమా సెట్స్ పైకి వెళ్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బహుశా రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి ఈ రెండు స్క్రిప్టులపై సమాంతరంగా చర్చలు జరిపే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతానికి రాజమౌళి పూర్తి దృష్టి మహేష్ బాబు సినిమాపైనే ఉంది. 'వారణాసి' మూవీ ఇండియన్ సినిమాలో ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇది పూర్తి కాగానే తన తదుపరి హీరో ఎవరనే దానిపై జక్కన్న అధికారికంగా స్పందించే అవకాశం ఉంది.
May 09, 2026
Varanasi: వారణాసి@199 రూపాయలు
మహేష్ బాబు(Mahesh Babu),రాజమౌళి(Ss Rajamouli)ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ వారణాసి(Varanasi)ఇప్పుడు సరికొత్త ఫీచర్ ని ఇండియన్ చిత్ర సీమకి పరిచయం చేస్తుంది. ఇండియాలోనే ఇది ఫస్ట్ టైం. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వారణాసి ట్రెండింగ్ లో కొనసాగుతుంది. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. సాధారణంగా సినిమాలకు సంబంధించిన అప్డేట్లు సోషల్ మీడియాలో ఉచితంగా వస్తుంటాయి. కానీ, రాజమౌళి ఈసారి విభిన్నంగా ఆలోచిస్తున్నారు. సినిమా మేకింగ్ వీడియోలు, బిహైండ్ ద సీన్స్, నటీనటుల ఇంటర్వ్యూలు మరియు ఎక్స్‌క్లూజివ్ ఫోటోలను నేరుగా అభిమానులకు అందించేందుకు ఒక డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనికి 'వారణాసి' అనే కోడ్ నేమ్ పెట్టినట్లు తెలుస్తోంది. అంటే వారణాసిని తెరకెక్కించడం వెనక ఉన్న కష్టాన్ని, ఆసక్తికరమైన బి టి ఎస్ వీడియోస్ చూడాలని అనుకునే వాళ్ళు 199 రూపాయలు చెల్లించి వారణాసిని సబ్ స్క్రిప్షన్ చేసుకోవాలి. ఈ ప్యాకేజీ లో వారణాసికి సంబంధించి మహేష్,ప్రియాంకకి సంబంధించిన ఎక్స్ క్లూజివ్ ఫొటోలతో పాటు మిగతా ఆర్టిసుల డీటెయిల్స్ అన్ని ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే వారణాసి వివరాలన్నీ మీ పాకెట్ లో ఉండబోతున్నాయి. గతంలో కొన్ని హాలీవుడ్ చిత్రాలకి అనుసరించే ఈ విధానాన్ని ఇండియాలో రాజమౌళి ప్రవేశపెడుతుండటం విశేషం. Also read: Santhosh Nair: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి.. భార్య పరిస్థితి విషమం రాజమౌళి ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ గుర్తింపు పొందిన నేపథ్యంలో మహేష్ బాబు సినిమాతో ఇండియన్ సినిమా మార్కెట్ పరిధిని మరింత పెంచాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రవేశపెడుతున్న ఈ వినూత్న ప్రమోషనల్ స్ట్రాటజీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఒకవేళ ఇది క్లిక్ అయితే, భవిష్యత్తులో మిగిలిన పెద్ద సినిమాలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది.
May 05, 2026
Varanasi: వారణాసికి షాక్ ఇచ్చిన హైదరాబాద్ వాటర్ బోర్డు అధికారులు.. రద్దు తప్పదా!
మహేష్, రాజమౌళిలు వారణాసి(Varanasi)షూట్ కి ఇప్పుడు కొంచం గ్యాప్ ఇచ్చినా తిరిగి ఈ నెల 18 నుంచి హైదరాబాద్ లో స్టార్ట్ చేయనున్నారు. కానీ ఇప్పుడు ఆ షూట్ జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మేకర్స్ ఈ నెల 18 న హైదరాబాద్ గగన్ పహాడ్ ఏరియాలో వేసిన సెట్ లో నీటి అడుగున సన్నివేశాలు తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సదరు సన్నివేశాలకి శుద్ధి చేసే నీరు చాలా అవసరం అవుతుంది. సుమారు పదివేల లీటర్ల కావాలనేది అంచనా. దీంతో పదివేల లీటర్ల కెపాసిటీ ఉన్న 150 ట్యాంకర్ల నీరు కావాలని టీం హైదరాబాద్ వాటర్ బోర్డుకి దరఖాస్తు చేసుకుంది. కానీ నగరంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు నీటి కొరత కూడా ఉండటంతో వాటర్ బోర్డు వారణాసి టీం రిక్వెస్ట్ ని రద్దు చేసినట్టుగా సమాచారం. మరి ఊహించని ఈ సంఘటనతో షూట్ ని పోస్ట్ పోన్ చేస్తారా లేక వేరే మార్గాలతో స్టార్ట్ చేస్తారా అనేది చూడాలి. also read: Vijay: సినిమాకి ఉన్న పవర్ చూపిస్తూ 100 స్థానాల్లో విజయ్.. తిరుమల కొండపై త్రిష మహేష్ అయితే ప్రెజెంట్ జర్మనీలోని అడవుల్లో వారణాసి కోసమే ట్రెక్కింగ్ కి వెళ్ళాడు. మరో రెండు రోజుల్లో అక్కడనుంచి రానున్నట్టుగా సమాచారం. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ ని పూర్తి చేసుకున్న వారణాసి వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే
May 04, 2026
Mahesh Babu: బ్లాక్ ఫారెస్ట్ లో మహేష్ బాబు..ఏ దేశమో తెలుసా!
-సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మహేష్ పిక్స్ -ఆ దేశం వెళ్ళింది సరదా కోసం కాదా -బ్లాక్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది -పూర్తి డీటెయిల్స్ చూద్దాం సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)ఇటీవల ఫ్యామిలీతో కలిసి జర్మనీ(Germany)వెళ్లిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఎయిర్ పోర్ట్ పిక్స్ వైరల్ గా కూడా మారాయి. దీంతో అక్కడ్నుంచి రాగానే వారణాసి(Varanasi)షూట్ ని స్టార్ట్ చేస్తారని అందరు అనుకున్నారు. కానీ మహేష్ వెళ్ళింది జర్మనీలో ఎంజాయ్ చేయడానికి కాదు. అవును మహేష్ జర్మనీ వెళ్ళింది ఎంజాయ్ చేయడానికి కాదు. వారణాసికి సంబంధించి ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్ళాడు. ఈ విషయం మహేష్ రీసెంట్ గా చేసిన పోస్ట్ లతో అర్ధమవుతుంది.ట్రెక్కింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటు వారణాసి కోసం సిద్దమవుతున్నట్టుగా క్యాప్షన్ ఉంచాడు. దీంతో మహేష్ తన స్టైల్లోనే జర్మనీకి వెళ్తుంది ఎంజాయ్ చేయడానికని ఎవడికాడు కథలు అల్లుకుంటే ఎలా అన్నాయ్. అసలు నిజం ఇది అని చెప్పినట్లయింది. మహేష్ వెంట తన ఫిట్ నెస్, వెల్ నెస్ నిపుణులు డాక్టర్ హ్యారీ కొనిగ్ ఉన్నాడు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తుండటంతో అభిమానులు జోష్ లో ఉన్నారు. మహెష్ గతంలో కూడా జర్మనీ ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ చేసిన విషయం తెలిసిందే. Also read: Harish Shankar: నెక్స్ట్ ఏంటి అన్నయ్య... అనౌన్స్ మెంట్ ఎప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి(ss Rajamouli)అమ్ముల పొది నుంచి వస్తున్న వారణాసి 2027 ఏప్రిల్ 7 న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెట్టబోతుంది. తెలుగు సినిమానే కాదు, భారతీయ సినిమా కూడా ఇంతవరకు అడుగుపెట్టని ప్రపంచ లొకేషన్స్ లో వారణాసి ఎంట్రీ ఇవ్వబోతుంది.
May 02, 2026
Priyanka Chopra: అందం ఉంటే సరిపోదని ప్రియాంక చోప్రాపై మైక్ విసిరిన మన గురువు గారు
పాన్ వరల్డ్ నటిగా గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా(Priyanka Chopra)ప్రస్తుతం మహేష్(Mahesh),రాజమౌళి(Ss Rajamouli)ల వారణాసి(Varanasi)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మందాకినీ గా తన విశ్వరూపాన్ని ప్రదర్శించనుందనే టాక్ ఆల్రెడీ స్ప్రెడ్ అవుతూనే ఉంది. ఆ కెపాసిటీ కూడా సదరు కట్ అవుట్ కి ఉందనే నిజం తెలిసిందే. రీసెంట్ గా ప్రియాంక ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె ప్రముఖ డాన్స్ మాస్టర్ వలన తనకి జరిగిన అవమానం గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్య పరిచింది. మరి ఆ మాటలేంటో చూద్దాం. ప్రియాంక మాట్లాడుతు నా తొలి హిందీ చిత్రం 'అందాజ్' కి సంబంధించి సాంగ్ షూటింగ్ సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. నేను సరిగా స్టెప్పులు వేయలేకపోతున్నాను. డాన్స్ చేస్తూనే కళ్ళతో హావభావాలు పలికించడం కష్టంగా మారింది. దీంతో కొరియోగ్రాఫర్ రాజు ఖాన్(Raju Khan)నాపై అసహనానికి గురయ్యారు. నువ్వు ఎంత అందగత్తేవి అయినా, మిస్ వరల్డ్ అయినా అవ్వచ్చు. కానీ నటి కావాలంటే ముందు డాన్స్ నేర్చుకో అని అందరి ముందు అరుస్తూ మైక్‌ను కింద విసిరికొట్టారు. Also read: Kalki 2: కల్కి 2 , ప్రభాస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన జెడి ఆ సంఘటనని సవాలుగా తీసుకుని కత్రినా కైఫ్‌తో కలిసి రోజుకి ఆరుగంటలు డాన్స్ ప్రాక్టీస్ చేసానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి. మరి ఇప్పుడు మెరుపు తీగలాగా డాన్స్ చెయ్యగల సమర్థురాలు.
Apr 30, 2026
Varanasi: కొత్త మార్కెట్ పై వారణాసి గురి
ఇండియన్ సినిమా గొప్పతనాన్ని వరల్డ్ సిల్వర్ స్క్రీన్ వద్ద చాటాలనే లక్ష్యంతో వారణాసి(Varanasi)తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సదరు మూవీ మహేష్, రాజమౌళి ల కలల ప్రాజెక్ట్ నే కాదు అభిమానులు, ప్రేక్షకుల కలల ప్రాజెక్ట్ కూడా. దీంతో వారణాసి అప్ డేట్స్ గురించి సెర్చ్ చేయడం అనేది అలవాటుగా మారింది. ఈ క్రమంలో వారణాసి బిజినెస్ విషయంలో రాజమౌళి చేస్తున్న ప్లాన్స్ కి సంబంధించిన న్యూస్ వారణాసి రేంజ్ ని చెప్తుంది. బాహుబలి సిరీస్, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు జపాన్ తో సహా కొన్ని దేశాల్లో మంచి వసూళ్ళని సాధించాయి. ఓవర్ సీస్ అయితే చెప్పక్కర్లేదు. మిలియన్ డాలర్స్ స్వచ్ఛందంగా సరెండర్ అయ్యాయి. ఇప్పుడు కొత్తగా వారణాసికి దక్షిణ అమెరికాతో పాటు లాటిన్ అమెరికా దేశాలపైన గురి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇవే కాదు మరికొన్ని దేశాలలో రిలీజ్ చేయాలనే టార్గెట్ ని కూడా ఫిక్స్ అయినట్టుగా చెప్తున్నారు. వారణాసి కథ పలు దేశాలతో ముడిపడిన సబ్జెట్ కావడం, పైగా మహేష్ ప్రపంచ యాత్రికుడు కావడంతో చాలా దేశాలలో రిలీజ్ చేయాలనేది ప్లాన్ గా తెలుస్తుంది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వారణాసి సాధించబోయే రికార్డులు ఊహకి కూడా అందవనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతుంది. Also read: JD Chakravarthy: మా సినిమా ఆపేయాలని ప్రభుత్వం నుంచి ఫోన్ వచ్చింది కొన్ని రోజుల క్రితం షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన మేకర్స్ తిరిగి షూట్ ని స్టార్ట్ చేయనున్నారు. తదుపరి షెడ్యూల్ అంటార్కిటికాలోని 'రోస్ ఐస్ షెల్ఫ్' వద్ద ప్లాన్ చేశారు. అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకుంటున్న మొదటి భారతీయ చిత్రంగా కూడా వారణాసి రికార్డు సృష్టించనుంది. ఇటీవల మెక్సికో దేశంలో 'వారణాసి' గ్లింప్స్‌ని ప్రదర్శించారు. ఆ తరహాలోనే బ్రెజిల్ తో పాటు మరికొన్ని దేశాల్లో ప్రచారం చేయనున్నారు.
Apr 29, 2026
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com






