
Peddi: భోపాల్‌లో పెద్ది సౌండ్: ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్తో స్పెషల్ సాంగ్ లాంచ్
మరింత సందడిని పెంచిన పెద్ది మూడో సాంగ్ కోసం అందరు వెయిటింగ్ ఈ నేపథ్యంలో అధికార ప్రకటన మెగా జాతర మొదలైనట్టే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో పెద్ది(Peddi). చరణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ కి సంబంధించిన శుభవార్త బయటకు వచ్చింది. 'సౌండ్ ఆఫ్ పెద్ది' పేరుతో నిర్వహించబోయే ఒక భారీ ఈవెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్(A.R Rehman)సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. మే 23వ తేదీన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో స్పెషల్ సాంగ్‌ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్లో రెహమాన్ స్వయంగా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతుండటం విశేషం. ఆయన స్వరపరిచిన బాణీలకు స్టేజ్ మీద లైవ్ మ్యూజిక్ తోడైతే, ఆ వైబ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే వచ్చిన రెండు సాంగ్స్ ఒక రేంజ్ లో సక్సెస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో థర్డ్ సాంగ్ పై ఫ్యాన్స్ తో పాటు మ్యూజిక్ లవర్స్ లో ఆసక్తి నెలకొని ఉంది. ఈ సాంగ్ చరణ్, శృతి హాసన్ , జాన్వీ కపూర్ పై చిత్రీకరించారు. Also read: Pooja Hegde: పూజాహెగ్డే అందాల అస్త్రం.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్ ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు బాలీవుడ్ మరియు టాలీవుడ్ ప్రముఖులు సందడి చేయనున్నారు. 'పెద్ది' చిత్రం జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. మరి చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ఈ పవర్ ఫుల్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
May 13, 2026
Peddi: పెద్ది రిలీజ్ టైంలో కావాలనే ఇలా చేస్తున్నారా?
టాలీవుడ్ లో నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్ల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎగ్జిబిటర్లు పర్సెంటేజ్ విధానానికి పట్టుబడుతుండగా, నిర్మాతలు రెంటల్ విధానానికి మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఈ వివాదం మరింత ముదిరింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది అంటూ తాజాగా తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఏ ప్రెస్ మీట్లో ప్రముఖ నిర్మాత శిరీష్ (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్) కూడా పాల్గొన్నారు. జూన్ 4న విడుదలవుతున్న రామ్ చరణ్ 'పెద్ది' (Peddi) సినిమాని టార్గెట్ చేస్తూ ఈ వివాదాన్ని పెద్దది చేస్తున్నారా? అనే అనుమానులు వ్యక్తమవుతున్నాయి. ఇదే ప్రశ్న శిరీష్ కి ఎదురవ్వగా ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఇది ఎవరినో టార్గెట్ చేసేది కాదని, కేవలం థియేటర్ల వ్యవస్థను కాపాడుకోవడానికి చేస్తున్న 'బ్రతుకు పోరాటం' అని శిరీష్ అన్నారు. ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న కష్టాలను వివరిస్తూ, థియేటర్లు బతకాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో ఎవరినీ తక్కువ చేయాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. మన హీరోలు అందరూ మంచి మనసున్న వారని, పరిశ్రమను కాపాడుతున్నారని ఆయన కొనియాడారు. ఎగ్జిబిటర్ల సమస్యను అర్థం చేసుకుని హీరోలు తమకు అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. థియేటర్లలో భారీ సెలబ్రేషన్స్ వల్ల డ్యామేజ్ జరుగుతున్నా, ఎగ్జిబిటర్లు అభిమానుల ఉత్సాహాన్ని గౌరవిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఫ్యాన్స్ కూడా ఈ క్లిష్ట పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు శిరీష్ చెప్పారు.
May 13, 2026
Peddi: పెద్ది చూస్తుంటే ఆ సినిమా గుర్తుకురాకూడదు.. మరి టీం ఏం చేసింది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో 'పెద్ది'(Peddi)పై అంచనాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా జరుగుతున్న రికార్డు బిజినెస్ నే అందుకు ఉదాహరణ. మేకర్స్ కూడా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచడంతో సోషల్ మీడియా కూడా 'పెద్ది' సాక్షిగా కళకళ లాడుతూ ఉంది. ఈ నేపథ్యంలో పెద్ది ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా(Avinash Kolla)పలు ఆసక్తి కర విషయాలని పంచుకున్నారు. తెలుగు వన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతు పెద్ది కుస్తీ నేపథ్యంలో సాగుతుంది. దీంతో కుస్తీ నేపథ్యంలోనే తెరకెక్కిన దంగల్ ని గుర్తు చేయకపోవడమే మా l లక్ష్యం. అందుకే ప్రేక్షకులకి దంగల్ గుర్తుకు రాకుండా చేయాలని చాలా జాగ్రత్తలు తీసుకొని సెట్స్ వేసాం. దీంతో దంగల్ గుర్తుకు రాదు. మేము పెద్దిలో చేసిన ప్రయోగం అలాంటిది. నా కెరీర్ లోనే పెద్ది బెస్ట్ స్క్రిప్ట్. ఇలాంటి సినిమాకి పని చేసే అవకాశం రావడం నా అదృష్టమని అవినాష్ చెప్పుకొచ్చాడు. Also read: Avatar 3 Fire and Ash: ఓటిటిలోకి అవతార్ 3 .. స్ట్రీమింగ్ డేట్ ఇదే దీంతో కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా 'దంగల్' తో పెద్దికి పోలికలు ఉండబోతున్నాయనే న్యూస్ కి బ్రేక్ పడినట్లే. జూన్ 4 న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతున్న పెద్ది 1980 వ సంవత్సరంలో ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ జర్నీ. ఒక సామాన్యుడు తన ఊరి కోసం, తన ఆత్మగౌరవం కోసం చేసే పోరాటం నేపథ్యంలో జరిగే కథ అని టాక్.
May 13, 2026
Peddi Business: తెలుగు రాష్ట్రాల్లో ‘పెద్ది’ మైండ్ బ్లోయింగ్ బిజినెస్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi). ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ లెక్కలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. చరణ్ క్రేజ్, బుచ్చిబాబు మేకింగ్ పై ఉన్న నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరలకు హక్కులను దక్కించుకుంటున్నారు. ఏరియా వైజ్ బిజినెస్ వివరాలు: విశ్వసనీయ సమాచారం ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో 'పెద్ది' సినిమా బిజినెస్ రూ.163 కోట్లకు క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ (నైజాం) ఏరియా హక్కులు దాదాపు రూ.63 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇది రామ్ చరణ్ కెరీర్ లోనే అత్యుత్తమ డీల్స్ లో ఒకటిగా నిలిచింది. ఆంధ్రా థియేట్రికల్ హక్కులు సుమారు రూ.75 కోట్లు పలికినట్లు సమాచారం. ఇక సీడెడ్(రాయలసీమ) ఏరియాలో ఈ చిత్రం రూ.25 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు ట్రేడ్ టాక్. అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.163 కోట్ల మార్కును తాకింది. ఓవర్సీస్, మిగిలిన రాష్ట్రాల బిజినెస్ కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భారీ అంచనాల మధ్య ‘పెద్ది’ ఈ సినిమాలో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్ లో కనిపిస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో బజ్ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మే 18న ట్రైలర్ విడుదల కానుంది. ఈ భారీ బిజినెస్ రికార్డులను బట్టి చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
May 13, 2026రామ్ చరణ్ పెద్ది స్టోరీ లీక్.. ఒక పల్లెటూరు, ఓ రైలు.. అసలు కథ ఇదేనా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న 'పెద్ది' చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 'ఉప్పెన' వంటి క్లాసిక్ తర్వాత బుచ్చిబాబు తీస్తున్న సినిమా కావడంతో, అసలు ఈ కథ ఎలా ఉండబోతోంది? చరణ్ పాత్ర ఏంటి? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విజయనగరం బ్యాక్‌డ్రాప్.. గుర్తింపు లేని ఊరు! ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మారుమూల పల్లెటూరు నేపథ్యంలో సాగుతుంది. ఆ ఊరిలో రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ, అక్కడ ఒక్క ట్రైన్ కూడా ఆగదు. అసలు ఆ ఊరి ఉనికిని ఎవరూ గుర్తించరు. అటువంటి పరిస్థితుల్లో ఆ ఊరికి ఒక గుర్తింపు తీసుకురావాలని, అక్కడి సమస్యలను తీర్చాలని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక యువకుడు చేసే పోరాటమే 'పెద్ది' కథ అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. చరణ్ నాలుగు షేడ్స్.. 10 ఏళ్ల జర్నీ ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతోంది. ఒక పెద్ది అనే క్యారెక్టర్ యొక్క 10 సంవత్సరాల ప్రయాణాన్ని ఇందులో చూపించనున్నారట. ముఖ్యంగా చరణ్ ఈ సినిమాలో నాలుగు భిన్నమైన షేడ్స్‌లో కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో మనం క్రికెట్ మరియు కుస్తీ (రెజ్లింగ్) నేపథ్యాలను చూశాం. వీటితో పాటు మరో రెండు వేరియేషన్స్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయనున్నాయి. దీనికోసం చరణ్ నిజమైన కుస్తీ యోధులతో కలిసి కఠినమైన శిక్షణ కూడా తీసుకున్నారట. కీలక పాత్రల్లో జాన్వీ కపూర్, జగపతి బాబు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో ఒక పక్కా పల్లెటూరి అమ్మాయిగా, చాలా రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్లో కనిపించబోతోంది. అలాగే, జగపతి బాబు పాత్ర సినిమాను మరో లెవల్‌కు తీసుకువెళుతుందని తెలుస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో చరణ్‌కు కుస్తీ మాస్టర్‌గా కీలక పాత్రలో నటించడం విశేషం. ఏఆర్ రెహమాన్ సంగీతం, శృతి హాసన్ స్పెషల్ సాంగ్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. ఎమోషనల్ రైడ్.. థియేటర్లకు కళ! డైరెక్టర్ బుచ్చిబాబు ఈ కథను కేవలం స్పోర్ట్స్ డ్రామాగా మాత్రమే కాకుండా, తండ్రి-కొడుకుల ఎమోషన్ మరియు ఊరితో ఉన్న అనుబంధాన్ని మిక్స్ చేసి ఒక క్లాసిక్ ఎపిక్ లాగా తీర్చిదిద్దారు. సినిమా చూసి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు కంటతడి పెట్టకుండా ఉండలేరని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది. మే 18న ఈ చిత్ర ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఉన్న స్తబ్దతను పోగొట్టి, థియేటర్లకు మళ్ళీ కళ తీసుకువచ్చే సినిమా 'పెద్ది' అవుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
May 12, 2026
Peddi: 'పెద్ది' సినిమా మీ ఊహలకు కూడా అందదు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' (Peddi). ఈ సినిమా గురించి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారుతోంది. తాజాగా ఈ చిత్ర ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా 'తెలుగువన్'(TeluguOne)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా విశేషాలను పంచుకుంటూ రామ్ చరణ్ పాత్రపై చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. చరణ్ మాస్ మేకోవర్.. ఆశ్చర్యపోవడం ఖాయం! ఈ సినిమా కోసం రామ్ చరణ్ చేసిన మేకోవర్ గురించి అవినాష్ కొల్లా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. "చరణ్ గారిని ఇప్పటివరకు ఎన్నో రకాల పాత్రల్లో చూశారు. కానీ 'పెద్ది'లో ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా, ఎంతో రా (Raw) గా ఉంటుంది. ఆయన డెడికేషన్ చూసి ఆశ్చర్యం వేసింది" అని అవినాష్ పేర్కొన్నారు. ఇది ఎవరి బయోపిక్ కాదు, కానీ ఒక లోకల్ స్పోర్ట్స్ పర్సన్ బయోపిక్ లా ఉంటుందని తెలిపారు. మే 18న వస్తున్న ట్రైలర్ చూసిన తర్వాత.. ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలిసి మైండ్ బ్లాక్ అయిపోతుంది అన్నారు. కథ విన్న తర్వాత 20 నిమిషాలు షాక్‌లోనే.. "దర్శకుడు బుచ్చిబాబు నాకు 'పెద్ది' కథ చెప్పినప్పుడు సుమారు 20 నిమిషాల పాటు నేను మామూలు స్థితికి రాలేకపోయాను. అంతటి బలమైన ఎమోషన్ ఈ కథలో ఉంది. కేవలం స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు, మనుషుల మధ్య ఉండే గాఢమైన బంధాలను ఈ సినిమా ప్రతిబింబిస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడి కళ్లు కచ్చితంగా చెమ్మగిల్లుతాయి" అని అవినాష్ అన్నారు. 24 భారీ సెట్లు.. విజువల్ వండర్! ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని వివరిస్తూ, సుమారు ఒక సంవత్సరం పాటు ప్రీ-ప్రొడక్షన్ పనులు జరిగాయని అవినాష్ తెలిపారు. "సినిమాలో సుమారు 24 భారీ సెట్లు వేశాం. కానీ అవి సెట్లు అని ఎవరూ గుర్తుపట్టలేరు. అంత సహజంగా విజయనగరం నేపథ్యాన్ని రీ-క్రియేట్ చేశాం." అని చెప్పారు. 1970-80 కాలం నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో భారీ సెట్లను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కథలో ఉండే ఎమోషన్ కు తగ్గట్టుగా విజువల్స్ చాలా నేచురల్ గా ఉంటాయని స్పష్టం చేశారు. కేవలం స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాకుండా, ఒక గ్రామీణ నేపథ్యాన్ని కళ్లకు కట్టేలా చూపించడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎంతో కష్టపడింది ఆయన చెప్పారు. దర్శకుడు బుచ్చిబాబు విజన్ అద్భుతమని అవినాష్ అన్నారు. బుచ్చిబాబు ఈ కథను ఎంత గొప్పగా విజువలైజ్ చేశారో అవినాష్ వివరించారు. జాన్వీ కపూర్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్స్ ఉండటంతో సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, విజువల్స్ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 'రంగస్థలం' తర్వాత రామ్ చరణ్ మళ్ళీ ఒక పక్కా లోకల్ మాస్ క్యారెక్టర్లో కనిపిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా మాటలు విన్నాక, ఈ 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద పెద్ద విధ్వంసమే సృష్టించేలా కనిపిస్తోంది. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్, ఈ మట్టి కథతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూలు, సినిమా అప్డేట్స్ కోసం 'తెలుగువన్'(TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
May 12, 2026
Peddi: బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ట్రైలర్ తర్వాత ఊహించని గిఫ్ట్
'పెద్ది'(Peddi)ట్రైలర్ ఈ నెల 18 న రిలీజ్ కాబోతుంది. దీంతో మెగా ఫ్యాన్స్ లో సందడి వాతావరణం నెలకొని ఉంది. ట్రైలర్ వేడుకని మధ్యప్రదేశ్ లోని భోపాల్ లేదా ముంబైలో నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన కూడా చేయనున్నారని అంటున్నారు. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఫ్యాన్స్ జోష్ మరింత పెంచేలా స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. సదరు సాంగ్ సూపర్ గా వచ్చిందని, రెహ్మాన్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చాడని అంటున్నారు. శృతి హాసన్ పై చిత్రీకరించిన ఈ సాంగ్ లో జాన్వీ కపూర్ కూడా సందడి చేయనుంది. Also read: veerabhadrudu: సరికొత్త వివాదంలో వీరభద్రుడు.. తెలుగు ఫ్యాన్స్ ఫైర్ జూన్ 4 వరల్డ్ వైడ్ గా విడుదల అవుతున్న పెద్ది చరణ్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కింది. దర్శకుడు బుచ్చిబాబు(Buchibabu)సోషల్ మీడియా వేదికగా రోజుకొక అప్ డేట్ ఇస్తూ పెద్ది పై అంచనాలని రెట్టింపు చేస్తున్నాడు.
May 12, 2026
Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్..
'వారణాసి' షూటింగ్.. ఆ సమస్యకు పరిష్కారం దొరికిందా? మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న 'వారణాసి' సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా పాల్గొంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లో నీటి కొరత కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడిందన్న వార్తలు వైరల్ అయ్యాయి. భారీ వాటర్ అవసరాల నేపథ్యంలో సమస్య తలెత్తినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వడంతో ఆ సమస్యకు పరిష్కారం దొరికిందా? లేదా ప్లాన్ మార్చారా? అన్న చర్చ సాగుతోంది. ముంబైలో పెద్ది హంగామా! పెద్ది ట్రైలర్‌ను ఈ నెల 18న ముంబైలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు మూవీ టీమ్ మొత్తం ఈ ఈవెంట్లో పాల్గొననుంది. ట్రైలర్ లాంచ్ తర్వాత భోపాల్‌లో స్పెషల్ మ్యూజికల్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తోంది. ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్ టైమ్ ఫిక్స్! ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'డ్రాగన్' నుండి సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను మే 20న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు టైం కూడా ఫిక్స్ అయింది. మే 19 అర్థరాత్రి 12 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చిరంజీవి! మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో రానున్న క్రేజీ ప్రాజెక్ట్ 'Mega158' గురించి తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం మెగాస్టార్ సరికొత్త మేకోవర్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో.. రగ్గడ్ గా కనిపించబోతున్నారని సమాచారం. విభిన్నమైన హెయిర్ స్టైల్, గడ్డంతో చిరు వింటేజ్ మాస్ లుక్‌ను తలపించేలా ఈ క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు టాక్. డైరెక్టర్ గా మారుతున్న రామ్ పోతినేని! టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకుడిగా మారబోతున్నాడు. వరుస పరాజయాల నేపథ్యంలో, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి రామ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, తన అన్న కృష్ణ చైతన్యతో కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. రవితేజ రెమ్యూనరేషన్లో భారీ కోత! తనపై నమ్మకం ఉంచిన నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశంతో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ. 25 నుండి 30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న రవితేజ.. తన రాబోయే చిత్రాల కోసం దానిని రూ. 15 కోట్లకు తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. తన మార్కెట్ మళ్ళీ నిలదొక్కుకునే వరకు బడ్జెట్ నియంత్రణలో ఉండాలని, తద్వారా సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారట. విజయ్ సీఎం కావడంపై రజినీకాంత్ రియాక్షన్! తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ కు.. సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్తున్నాయి. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడ్డారు. ఈ సందర్భంగా విలేకరులు విజయ్ సీఎం కావడంపై ఆయన అభిప్రాయాన్ని కోరారు. రజినీకాంత్ ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా, కేవలం తనదైన శైలిలో నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. రజినీకాంత్ మౌనంగా ఉన్నప్పటికీ.. ఆ చిరునవ్వులో విజయ్ పట్ల గౌరవం, అభినందనలు ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సూర్య సినిమాకు కొత్త తలనొప్పి! కోలీవుడ్ నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ ఇప్పుడు తెలుగు నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. సూర్య హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'వీర భద్రుడు' సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో.. బాలాజీ గతంలో తెలుగు సినిమాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో.. తెలుగు సినిమాల్లో లాజిక్ ఉండదని, కేవలం హీరోల ఎలివేషన్లకే ప్రాధాన్యత ఇస్తారని ఆయన విమర్శించారు. విడాకుల బాటలో మౌనీ రాయ్ బాలీవుడ్ నటి, 'నాగిని' ఫేమ్ మౌనీ రాయ్ తన భర్త, దుబాయ్ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో విడిపోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట గత కొద్ది రోజులుగా విడివిడిగా నివసిస్తున్నారని, వీరి మధ్య మనస్పర్థలు తీవ్రమయ్యాయని తెలుస్తోంది. మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. మౌనీ తన ప్రొఫైల్ నుండి భర్తతో ఉన్న కొన్ని ఫోటోలను తొలగించగా, సూరజ్ కూడా తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేసినట్లు సమాచారం. ప్రముఖ సింగర్ కు జైలు శిక్ష ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టు తీర్పు వెలువడింది. గత మార్చిలో కాలిఫోర్నియాలో మద్యం మత్తులో కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన బ్రిట్నీపై నమోదైన కేసులో, తాజాగా ఆమెకు ఒక్కరోజు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జైలు శిక్షతో పాటు 571 డాలర్ల జరిమానాను కోర్టు విధించింది.
May 12, 2026
Peddi: 'పెద్ది' ఎలా ఉండబోతుంది.. స్పోర్ట్స్ డ్రామా అనుకుంటే పొరపాటే.. అసలు కథ వేరే ఉంది!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'పెద్ది' (Peddi). ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రాన్ని ఒక స్పోర్ట్స్ డ్రామాగానే ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో కేవలం ఆటలే కాకుండా అంతకు మించిన బలమైన ఎమోషనల్ కంటెంట్ ఉందని తెలుస్తోంది. ఊరి కోసం హీరో పోరాటం 'పెద్ది' కేవలం ఒక అథ్లెట్ కథ మాత్రమే కాదు, ఇందులో ఊరికి సంబంధించిన ఎమోషన్ చాలా బలంగా ఉండబోతోందని సమాచారం. పాలకుల నిర్లక్ష్యం వల్ల వెనుకబడిపోయిన ఒక ఊరి నేపథ్యంలో ఈ కథ సాగనుందట. నిర్లక్ష్యానికి గురైన తన మట్టి కోసం, తన వారి కోసం హీరో ఏం చేశాడు? వ్యవస్థతో ఎలా పోరాడాడు? అనే అంశాలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయని టాక్. ఊరి సమస్యలను పరిష్కరించే క్రమంలో స్పోర్ట్స్ ఎలిమెంట్ ఎలా ముడిపడి ఉందనేది దర్శకుడు బుచ్చిబాబు చాలా కొత్తగా డిజైన్ చేసినట్లు సమాచారం. పవర్ఫుల్ పాత్రల్లో జగపతిబాబు, శివరాజ్‌కుమార్ ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు మరికొంతమంది ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నడ సెన్సేషన్ శివరాజ్‌కుమార్ పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలవనుందని టాక్. విలక్షణ నటుడు జగపతిబాబు కూడా ఇందులో పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారు. వీరిద్దరి పాత్రలు కథను మలుపు తిప్పే విధంగా ఉంటాయని తెలుస్తోంది. మే 18న ట్రైలర్ సందడి! సినిమాలోని ఈ విభిన్న కోణాలన్నింటినీ మే 18న విడుదల కాబోయే ట్రైలర్లో రివీల్ చేసే అవకాశం ఉంది. ట్రైలర్లో స్పోర్ట్స్ ఎలివేషన్స్‌తో పాటు, ఊరి ఎమోషన్, ఎమోషనల్ డైలాగ్స్ మేళవించి ఉండబోతున్నాయట. మొత్తానికి 'పెద్ది' కేవలం మైదానంలో ఆడే ఆట కాదు, మట్టి కోసం ఆడే 'వేట' అని అర్థమవుతోంది. స్పోర్ట్స్ డ్రామాకి తోడు, బలమైన విలేజ్ ఎమోషన్, పొలిటికల్ టచ్ కలిపి ఒక పక్కా కమర్షియల్ ప్యాకేజీగా ఈ సినిమాను మలుస్తున్నారట. బుచ్చిబాబు మార్క్ ఎమోషన్స్, రామ్ చరణ్ మాస్ అప్పీల్ తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయం. మరి మే 18న రాబోయే ట్రైలర్ ఈ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.
May 12, 2026
Peddi Trailer: రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ డేట్ ఫిక్స్.. రికార్డులన్నీ బ్రేక్ అవ్వాల్సిందే!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న 'పెద్ది' (Peddi) సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ మెగా అభిమానులకు పూనకాలు తెప్పించాయి. ఇప్పుడు ఈ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. 'పెద్ది' సినిమా ట్రైలర్‌ను మే 18న విడుదల చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించడంతో సోషల్ మీడియాలో 'పెద్ది' మేనియా మొదలైంది. (Peddi Movie Trailer) సాధారణంగా రామ్ చరణ్ సినిమా అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. కానీ 'పెద్ది' విషయంలో ఆ లెక్క వేరేలా ఉంది. చరణ్ ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని సరికొత్త మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ చిత్రాన్ని ఒక పవర్ ఫుల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా మలిచారని తెలుస్తోంది. మే 18న రాబోతున్న ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడం ఖాయమంటున్నారు. 'పెద్ది'లో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్ లో రామ్ చరణ్ మ్యానరిజమ్స్, డైలాగ్స్, విజువల్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయనో.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతకుమించి అనేలా ఉండబోతుందని టాక్. ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత రామ్ చరణ్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి పెరిగింది. ఇప్పుడు 'పెద్ది'తో ఆయన తన మాస్ పవర్ ఏంటో మరోసారి నిరూపించుకోబోతున్నారు. మే 18న విడుదల కాబోతున్న ఈ ట్రైలర్ ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.
May 11, 2026
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com







