విజయశాంతి సర్జరీకి కారణం...ఓవర్ వర్కవుట్సా..?
on May 10, 2017
.jpg)
లేడీ అమితాబ్‌గా..లేడీ సూపర్‌స్టార్‌గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు విజయశాంతి. హీరోయిన్‌గా దక్షిణ భారతదేశాన్ని ఒక ఊపి రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలారు..ఆ తర్వాత కొత్త భామలు రావడంతో క్రమంగా వెండితెరకు దూరమయ్యారు. కొన్నాళ్లు రాజకీయాల్లో కీలక భూమిక పోషించి ఎంపీగా సేవలందించారు. కానీ ఏమైందో ఏమో గానీ సడెన్‌గా ఫేడవుటైపోయారు. అయితే మళ్లీ ఆమె రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. దీని కోసం బాడీని తిరిగి ఫిట్‌గా తయారు చేసుకోవడం కోసం కసరత్తులు చేస్తున్నారట. ఇదే ఇప్పుడు విజయశాంతిని ఆస్పత్రి పాలు చేసిందట. ఓ సినిమా కోసం వర్కవుట్స్ చేస్తున్న సమయంలో ఆమె కాలు ఫ్రాక్చర్ అయిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో ఆమె పాదానికి చిన్న చిన్న సర్జరీలు చేశారట వైద్యులు...ఇకపై జాగ్రత్తగా ఉండాలని..భారీ వర్కవుట్స్ తగ్గించుకోవాలని చెప్పారట. ఇంత చెప్పినా సరే రోజుకు రెండున్నర గంటలు జిమ్‌లోనే గడుపుతున్నారట విజయశాంతి..ఏదేమైనా సరే ఆ మూవీ షూటింగ్‌లో జాయిన్ అవ్వాలని ఆమె బలంగా ఫిక్సయినట్లున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



