‘2018’ డైరెక్టర్‌తో సూపర్‌స్టార్ సినిమా.. ఎప్పడంటే..?
on Sep 25, 2024
‘జైలర్’ ఘనవిజయంతో సూపర్‌స్టార్ రజినీకాంత్ తన లైనప్ పెంచుకుంటూ వెళ్తున్నారు. టిజె జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వేట్టైయాన్’ చిత్రం అక్టోబర్ 10న విడుదల కాబోతోంది. ఈ సినిమా జరుగుతుండగానే లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో ‘కూలీ’ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇది పూర్తయిన తర్వాత నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్‌లో ‘జైలర్2’ చిత్రం సెట్స్‌కి వెళతారు రజినీ.
ఈ సినిమాలు ఉండగానే మరో కొత్త సినిమాకి రజినీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది మలయాళంలో విడుదలైన ‘2018’ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 2018లో కేరళలో ఏర్పడిన వరదల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. గత ఏడాది ఇండియా తరఫున ఈ చిత్రాన్ని ఆస్కార్‌కు పంపారు. జూడ్ ఆంటోని జోసెఫ్ దర్శత్వంలో రూపొందిన ఈ సినిమాను రూ.26 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా, రూ.176 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్ర దర్శకుడు జూడ్ ఆంటోని జోసెఫ్ కాంబినేషన్‌లో ఓ సినిమాకి సూపర్‌స్టార్ రజినీకాంత్ ఓకే చెప్పబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించే ఈ తమిళ సినిమాలో మొదట శింబుని హీరోగా అనుకున్నారు. అయితే జూడ్ చెప్పిన కథకు సూపర్‌స్టార్ రజినీకాంత్ పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతారని భావించిన మేకర్స్ ఆయన్ని సంప్రదించినట్టు తెలుస్తోంది. రజినీకి ఆల్రెడీ కథ వినిపించారట. ఈ సినిమా విషయంలో రజినీ పాజిటివ్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
Also Read