మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
on Feb 25, 2025
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరి తెలిసిందే. రెండు సంవత్సరాలకో సినిమా చేసినా అతని సినిమాల కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తుంటారు. ఇప్పటికే సలార్, కల్కి వంటి సినిమాలతో అతని స్టార్ డమ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దాన్ని మరింత పెంచుకునేందుకు, ప్రేక్షకుల్ని మరింత ఎంటర్‌టైన్ చేసేందుకు తను చేసే సినిమాలను పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే చేతి నిండా సినిమాలు ఉన్నాయి. అవి పూర్తి కావడానికే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ సినిమాలు ఉండగానే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.
ప్రభాస్ లాస్ట్ సినిమా కల్కి రిలీజ్ అయి 8 నెలలు అవుతోంది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. మరో పక్క హను రాఘవపూడి కాంబినేషన్‌లో ‘ఫౌజీ’ చేస్తున్నారు. ఈ సినిమా కూడా సెట్స్‌పైనే ఉంది. వీటి తర్వాత సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రం చెయ్యాల్సి ఉంది. ఇవన్నీ పక్కన పెడితే.. సలార్2, కల్కి2 సినిమాలు కూడా పూర్తి చేయాలి. ఈ ఐదు సినిమాలు పూర్తి కావడానికి నాలుగైదు సంవత్సరాలు ఈజీగా పడుతుంది. ఈలోగా మరో సినిమా కమిట్ అయ్యాడన్న వార్త అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
గత ఏడాది సంక్రాంతికి భారీ సినిమాలను సైతం పక్కన పెట్టి ‘హనుమాన్’ చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్న ప్రశాంత్ వర్మతో ప్రభాస్ సినిమా ఓకే చేశాడనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ప్రశాంత్‌వర్మకు మంచి ఆఫర్లు ఉన్నాయి. అందులో ప్రభాస్ ప్రాజెక్ట్ కూడా వచ్చి చేరింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నిర్మిస్తుందని తెలుస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాలోని క్యారెక్టర్ కోసం ప్రభాస్‌కి లుక్ టెస్ట్ చెయ్యబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో కన్నడ హీరో రిషబ్‌శెట్టి మెయిన్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. ఇక ప్రభాస్‌తో చేసే సినిమా గురించి చెప్పాలంటే.. ఇప్పుడు అతని చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుందా లేక మధ్యలోనే సెట్స్‌పైకి వెళుతుందో తెలియాల్సి ఉంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
