Home

»

Gossips

‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’.. ఎన్టీఆర్, బన్నీలతో మల్టీస్టారర్.. ఇక బాక్సాఫీస్ బద్దలే

Mar 23, 2026

• బన్నీ, ఎన్టీఆర్.. క్రేజీ మల్టీస్టారర్ లోడింగ్!

• అల్లు అర్జున్, ఎన్టీఆర్‌తో ఆదిత్య ధర్ భారీ స్కెచ్

• మల్టీస్టారర్ సెట్ అయితే నెక్స్ట్ లెవలే

• మళ్లీ తెరపైకి అదిత్య ధర్ డ్రీమ్ ప్రాజెక్ట్

కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు డైరెక్టర్ ఆదిత్య ధర్ చేరువలో ఉన్నారు. ధురంధర్ ఫస్ట్ పార్ట్ 1300 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ధురంధర్2 ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 700 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సీక్వెల్.. త్వరలోనే కొత్త రికార్డులు సృష్టిస్తుందని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, బన్నీలతో ఆదిత్య ధర్ ఒక మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో ఆగిపోయిన తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ను మళ్ళీ పట్టాలెక్కించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు ఆదిత్య.

వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఆదిత్య ఎప్పుడో సంప్రదించారు. అయితే కథా చర్చలు పూర్తిస్థాయిలో కొలిక్కి రాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ హోల్డ్‌లో పడింది. తాజాగా ‘ధురంధర్ 2’ చూసిన బన్నీ, ఎన్టీఆర్ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఆదిత్యపై ప్రశంసల వర్షం కురిపించారు. దర్శకుడి ప్రతిభపై నమ్మకం కలగడంతో, ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ సినిమాలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో కనిపిస్తే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక పవర్ ఫుల్ స్పెషల్ రోల్‌లో మెరుస్తారని ఇండస్ట్రీ టాక్. ఈ ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు గనుక ఒక్క ఫ్రేమ్‌లో కనిపిస్తే ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆదిత్య ధర్ విజన్, తెలుగు స్టార్ల మాస్ ఇమేజ్ తోడైతే అది వెండితెరపై ఒక అద్భుతమే అవుతుంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com