Home

»

Gossips

బుచ్చిబాబు కాదు.. ఆ సంచలన దర్శకుడితోనే మహేష్ బాబు నెక్స్ట్ మూవీ!

Jun 16, 2026 5:10PM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం గ్లోబల్ లెవెల్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా 'వారణాసి' (Varanasi) సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే, మహేష్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో చేయబోతున్నారనే ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ గట్టిగా నడుస్తోంది. రాజమౌళితో సినిమా అంటే కచ్చితంగా సుదీర్ఘ కాలం పడుతుంది, ఆ తర్వాత మహేష్ బాబును అంతకంటే పవర్‌ఫుల్‌గా వెండితెరపై చూపించే దమ్మున్న దర్శకుడు ఎవరు అనే ప్రశ్న గత కొన్ని రోజులుగా ట్రెండ్ అవుతోంది.

ఈ రేసులోకి ఇప్పటికే 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానాతో పాటు పలువురు టాప్ డైరెక్టర్ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ ఇప్పుడు వాటన్నింటినీ పక్కకు నెట్టేస్తూ ఒక ఊహించని మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. తన మార్క్ బోల్డ్, ఇంటెన్స్ మేకింగ్‌తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల రాత మార్చిన సందీప్ రెడ్డి వంగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఒక నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. వీరిద్దరి కలయికలో సినిమా వస్తే చూడాలని టాలీవుడ్ ఆడియన్స్ చాలా ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ క్రేజీ వెయిటింగ్‌కు ఎండ్ కార్డ్ పడే సమయం దగ్గరపడిందని, ఈ మైండ్ బ్లోయింగ్ కాంబో దాదాపు ఖరారైందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ అధినేత ఏషియన్ సునీల్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ఇమేజ్‌కు, సందీప్ రెడ్డి వంగా నయా టేకింగ్‌కు సరిపోయేలా ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాజమౌళి 'వారణాసి' చిత్రం తర్వాత మహేష్ బాబు ఇమేజ్ గ్లోబల్ వైడ్‌గా మారిపోవడం ఖాయం కాబట్టి, దానికి తగ్గట్టుగానే సందీప్ కూడా పాన్ ఇండియా రేంజ్‌లో ఈ కథను ప్లాన్ చేశారట. సూపర్ స్టార్ క్లాస్ అండ్ డీసెంట్ లుక్‌కు, సందీప్ రెడ్డి వంగా మార్క్ అల్ట్రా వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద పూనకాలు రావడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. రాజమౌళి సినిమా ముగిసేలోపే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

కాగా, ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా కూడా రెబల్ స్టార్ ప్రభాస్ తో 'స్పిరిట్' అనే భారీ మూవీ చేస్తున్నారు. 'స్పిరిట్' పూర్తి కాగానే, మహేష్ ప్రాజెక్ట్ పైకి సందీప్ రెడ్డి ఫోకస్ షిఫ్ట్ అయ్యే అవకాశముంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com