Home

»

Gossips

మళ్ళీ పెళ్లికి సిద్దమైన కథానాయకి..!?

May 15, 2017

 

అందం,అభినయం తో అలరించి అంచెలంచెలుగా ఎదిగి అగ్ర కథానాయకిగా గుర్తింపు తెచ్చుకొని బాలీవుడ్ తనదే అనేలా మెరిసిపోయిన భామ -కరిష్మా కపూర్ .ముచ్చటైన తన వైవాహిక బంధానికి బీటలువారడం తో తన భర్త సంజయ్ కపూర్ తో విడాకులు తీసుకొని దూరం గాఉంటుంది.తన భర్త మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకొని కొత్త లోకం లో బ్రతికేస్తున్నారు.తానేం తక్కువకాదంటూ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నది.ఆమె పెళ్లికి  సిద్దమైనట్లు సన్నిహితుల సమాచారం.

ఈ విషయం  ప్రచారంలా జోరుగా సాగుతుంది.తన చిరకాల మిత్రుడితో చెట్టాపట్టాల్ వేసుకొని భారీగానే షికార్లు చేస్తున్నట్లు బాలీవుడ్ కోడై కూస్తుంది.అగ్ర తార గా తన అందాలను చూపించిన ఈ భామ ఇప్పుడు పెళ్లి గురించి తెగ ఆలోచిస్తుందట.మరి ఈ సొగసరి నోరువిప్పితేగాని వివరాలు తెలిసేలా లేవు.కూలిన తన వివాహ బంధం తో నేర్చుకున్న పాఠాలను మళ్ళీ తన కొత్త వరుడితో రాకుండా ఉండేందుకు ప్రణాళికలను చేస్తోందట.మళ్ళీ తన కొత్త వైవాహిక బంధంలోనైనా అనుబంధాలను పెనవేసుకోవాలని ఆశిదాం..

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com