Home

»

Gossips

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్‌కి రంగం సిద్ధం.. డైరెక్టర్ ఎవరంటే?

Feb 20, 2026 11:19AM

మెగాస్టార్ చిరంజీవి(MegaStar Chiranjeevi) కెరీర్‌ని టర్న్ చేసిన సినిమా ఖైదీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆయన్ని తిరుగులేని స్టార్‌గా నిలబెట్టిన సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి. తెలుగు సినిమా చరిత్రలోనే ఓ మైల్‌స్టోన్‌గా నిలిచిన సినిమా అది. ఆ సినిమాకి సీక్వెల్ రాబోతోందని గత కొన్ని సంవత్సరాలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి కన్‌ఫర్మేషన్ లేదు. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Aswin) ఆ ప్రయత్నం చేయబోతున్నారనే సమాచారం అందుతోంది. 

 

2024లో ప్రభాస్‌(Prabhas)తో ‘కల్కి 2898 ఎడి’ వంటి భారీ కమర్షియల్ హిట్‌ని రూపొందించిన నాగ్ అశ్విన్.. ఇప్ప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక ఎక్స్‌ట్రార్డినరీ కథను రెడీ చేశారని తెలుస్తోంది. ఇప్ప్పుడీ వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. పురాణాలను, ఫాంటసీని మిక్స్ చేసి అద్భుతాలు చెయ్యొచ్చు అని కల్కి చిత్రంతో ప్రూవ్ చేసిన నాగ్ అశ్విన్.. మరోసారి ఆ తరహా కథతో రాబోతున్నారని సమాచారం. అయితే చిరంజీవి కోసం సిద్ధం చేసిన కథ జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రానికి సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. 

 

త్వరలోనే చిరంజీవిని కలిసి కథ వినిపించేందుకు నాగ్ అశ్విన్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ కథ ఓకే అయితే చిరంజీవి కెరీర్‌లో మరో మైల్‌స్టోన్ లాంటి సినిమా వస్తుందని అభిమానులు ఆశించవచ్చు. జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని నిర్మించిన అశ్వనీదత్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. నాగ్ అశ్విన్‌తో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’, ‘కల్కి’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అశ్వినీదత్.. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నాగఅశ్విన్ ‘కల్కి’ సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com