సైఫ్‌పై దాడి అనేది కట్టు కథా? పోలీసుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా?
on Jan 18, 2025
జనవరి 15 బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నివాసంలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సైఫ్‌పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడని, ఈ దాడిలో సైఫ్ శరీరంపై ఆరు గాయాలయ్యాయని వైద్యులు తెలియజేశారు. అంతేకాదు, వెన్నులో తీవ్రగాయం కావడంతో దానికి శస్త్ర చికిత్స చేశారు. ఇదిలా ఉంటే.. తమ ఇంట్లోకి ప్రవేశించింది ఒక దొంగ అనీ, అతన్ని ప్రతిఘటించే క్రమంలో సైఫ్‌కు గాయాలయ్యాయని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఒకేఒక్క సిసి కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యం మాత్రమే పోలీసులకు లభించింది. అందులో నిందితుడుగా భావిస్తున్న వ్యక్తి మెట్లపై నుంచి దిగి వెళ్లడం కనిపించింది. మరుసటి రోజు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు పోలీసులు. అయితే సిసి కెమెరాలో కనిపించిన వ్యక్తి అతను కాదని నిర్ధారించుకున్న పోలీసులు అతన్ని విడుదల చేసి అసలైన హంతకుడి కోసం గాలిస్తున్నారు.
ఇది ఒక కథనమైతే.. ఇప్పుడు ఈ ఘటనలో మరో కథనం వెలుగులోకి వచ్చింది. అయితే ఇవన్నీ బయట వినిపిస్తున్న మాటలే. నిజానిజాలు ఏమిటి అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. బుధవారం అర్థరాత్రి వరకు సైఫ్ ఇంట్లో పార్టీ జరిగిందని, ఆ పార్టీలో కరీనా కపూర్ కూడా పాల్గొందని తెలుస్తోంది. ఆ సమయంలోనే సైఫ్ తన ఇంట్లో పనిచేసే యువతితో రాసలీలలు సాగించాడని ప్రచారం జరుగుతోంది. ఆ యువతి ప్రియుడు సైఫ్ దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన ప్రియురాలితో ప్రవర్తించిన తీరుపై కోపం రావడంతో అతను కిచెన్‌లో ఉన్న కత్తితో సైఫ్‌పై దాడి చేసి గాయపరిచాడని అంటున్నారు. ఆ సమయంలో సైఫ్ కుమారుడు ఇబ్రహీం అతని మొదటి భార్య అమృతాసింగ్ దగ్గర ఉన్నాడని చెబుతున్నారు. అంతేకాదు, సైఫ్ గాయపడిన గంట తర్వాత కరీనా కపూర్‌కి సమాచారం వెళ్లిందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ విషయాలన్నీ ప్రచారంలోకి రావడంతో సైఫ్ కుటుంబం ఈ ఘటనపై కట్టు కథలు చెబుతోందని, జరిగిన విషయాన్ని కప్పిపుచ్చడానికే దొంగ తమ ఇంట్లో ప్రవేశించాడని అందర్నీ తప్పు దోవ పట్టిస్తున్నారని అంటున్నారు. ముంబైలోని అంత రిచ్ ఏరియాలో సిసి కెమెరాలు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అందులోనూ ఒక స్టార్ హీరో ఇంట్లోకి ఒక సాధారణ వ్యక్తి ఎలా ప్రవేశించగలుగుతాడు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పటివరకు సైఫ్ కుటుంబం చెప్పిన కథ, బయట ప్రచారంలో ఉన్న విషయాలను పరిశీలిస్తే.. ఆ ఇంటిలో బుధవారం అర్థరాత్రి ఏదో జరిగి ఉంటుందనే అనుమానం అందరికీ కలుగుతోంది. మరి పోలీసులు తమ విచారణలో ఎలాంటి విషయాలు బయటపెడతారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
