Home

»

Gossips

'విరాట పర్వం' విడుదల తేదీ మళ్ళీ మారింది!

May 29, 2022 8:06PM

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'విరాట పర్వం'. ఈ సినిమాని జూలై 1 న విడుదల చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు మళ్ళీ విడుదల తేదీ మారబోతున్నట్లు తెలుస్తోంది.

'నీది నాది ఒకే కథ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వేణు మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత తన తదుపరి సినిమాని విభిన్న చిత్రాలు చేసే రానా, సాయి పల్లవితో ప్రకటించగానే 'విరాట పర్వం'పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. అందుకు తగ్గట్లే ఈ మూవీ గ్లింప్స్, టీజర్ ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. దీంతో ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారంతా. కానీ ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాని జూలై 1 న విడుదల చేస్తున్నట్లు రీసెంట్ గా ప్రకటించారు. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇప్పుడు మూవీ టీమ్ బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వనుందట. ప్రకటించిన తేదీకంటే ముందుగానే ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. అన్ని కుదిరితే జూన్‌ 17 నే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని న్యూస్ వినిపిస్తోంది.

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com