Home

»

Gossips

మ‌ళ్ళీ `రా` ఏజెంట్ గానే క‌మ‌ల్ హాస‌న్!?

May 5, 2022 3:05PM

ఎలాంటి పాత్ర‌లోనైనా ఇట్టే ఒదిగిపోయే న‌టుల్లో లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ఒక‌రు. వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ ముందుకు సాగే ఈ వెర్స‌టైల్ స్టార్.. త్వ‌ర‌లో `విక్ర‌మ్`గా ప‌ల‌క‌రించ‌బోతున్నారు. `ఖైదీ`, `మాస్ట‌ర్` చిత్రాల ద‌ర్శ‌కుడు లోకేశ్ క‌న‌క‌రాజ్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి, మాలీవుడ్ స్టార్ ఫ‌హ‌ద్ ఫాజిల్ ఇత‌ర‌ ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ సంగీత‌మందిస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. వేసవి కానుక‌గా జూన్ 3న జ‌నం ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే, `విక్ర‌మ్`లో క‌మ‌ల్ హాస‌న్ పోషిస్తున్న పాత్ర‌కి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. `రా` ఏజెంట్ వేషంలో ఆయ‌న ఎంట‌ర్టైన్ చేయ‌నున్నార‌ట‌. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. 36 ఏళ్ళ క్రితం `విక్ర‌మ్` (1986) టైటిల్ తోనే క‌మ‌ల్ ఓ సినిమాలో యాక్ట్ చేశారు. అందులోనూ త‌న‌ది `రా` ఏజెంట్ పాత్ర‌నే కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి.. ఆనాటి `విక్ర‌మ్`కి, ఈనాటి `విక్ర‌మ్`కి ఏదైనా సంబంధం ఉందో?  లేదో?  తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com