Home

»

Gossips

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పూజా హెగ్డే రొమాన్స్!?

May 5, 2022 2:27PM

రిలీజ్ కి రెడీ అయిన `లైగ‌ర్`లో బాలీవుడ్ బ్యూటీ అన‌న్యా పాండేతో రొమాన్స్ చేశాడు యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇక ఇటీవ‌ల సెట్స్ పైకి వెళ్ళిన శివ నిర్వాణ డైరెక్టోరియ‌ల్ కోసం స్టార్ బ్యూటీ స‌మంత‌తో జ‌ట్టుక‌ట్టాడు. క‌ట్ చేస్తే.. త్వ‌ర‌లో బుట్ట‌బొమ్మ పూజా హెగ్డేతోనూ ఆడిపాడేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌ట ఈ రౌడీ హీరో.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `లైగ‌ర్` త‌రువాత డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలోనే `జ‌న గ‌ణ మన‌` పేరుతో విజ‌య్ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో ఆర్మీ ఆఫీస‌ర్ గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. కాగా, ఇందులో అత‌నికి జోడీగా పూజా హెగ్డే న‌టించే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం. అదే గ‌నుక నిజ‌మైతే.. అటు పూరి ద‌ర్శ‌క‌త్వంలోనూ, ఇటు విజ‌య్ దేవ‌ర‌కొండ జోడీగానూ పూజా హెగ్డే నటించే తొలి చిత్ర‌మిదే అవుతుంది. త్వ‌ర‌లోనే `జ‌న గ‌ణ మ‌న‌`లో పూజా హెగ్డే ఎంట్రీపై క్లారిటీ రానున్న‌ది. మ‌రి.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూజా హెగ్డే జంట ఏ స్థాయిలో క‌నువిందు చేస్తుందో చూడాలి. కాగా, వ‌చ్చే ఏడాది ఆగ‌స్టులో `జ‌న గ‌ణ మ‌న‌` పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా జ‌నం ముందుకు రాబోతోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com