Home

»

Gossips

ఫ‌హ‌ద్ టార్గెట్: ఫ‌స్ట్ బ‌న్నీ.. నెక్స్ట్ చ‌ర‌ణ్..?

Aug 18, 2021 4:22PM

మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తిరుగులేని న‌టుడిగా రాణిస్తున్నారు ఫ‌హ‌ద్ ఫాజిల్.  అగ్ర ద‌ర్శ‌కుడు ఫాజిల్ త‌న‌యుడిగా మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఫ‌హ‌ద్.. విభిన్న పాత్ర‌లు పోషిస్తూ అన‌తికాలంలోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే 2017లో `బెస్ట్ సపోర్టింగ్ యాక్ట‌ర్`గా నేష‌న‌ల్ అవార్డ్ సైతం అందుకున్నారు.

ఇదిలా ఉంటే.. ఫ‌హ‌ద్ త్వ‌ర‌లో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ రూపొందిస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `పుష్ప‌`లో ఫ‌హ‌ద్ విల‌న్ గా న‌టిస్తున్నారు. పాన్ - ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ.. రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. కాగా, ఈ సినిమా నిర్మాణ ద‌శలో ఉండ‌గానే మ‌రో మెగా ప్రాజెక్ట్ లో బ్యాడీగా న‌టించే ఆఫ‌ర్ అందుకున్నార‌ట ఈ వెర్స‌టైల్ యాక్ట‌ర్. ఆ ప్రాజెక్ట్ మ‌రేదో కాదు.. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కించ‌నున్న సినిమా. పొలిటికల్ థ్రిల్ల‌ర్ గా రూపొందనున్న ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా ఫ‌హ‌ద్ న‌టిస్తార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే `#RC 15`లో ఫహ‌ద్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.

మ‌రి.. ఫ‌స్ట్ బ‌న్నీ - నెక్స్ట్ చ‌ర‌ణ్ అంటూ టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ పాన్ - ఇండియా మూవీస్ చేస్తున్న ఫ‌హ‌ద్.. ఆయా చిత్రాల‌తో ఎలాంటి ఫ‌లితాల‌ను అందుకుంటారో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com