Home

»

Gossips

దువ్వాడ జగన్నాథమ్ పరువు తీస్తున్న పవన్ ఫ్యాన్స్

Feb 25, 2017 3:38PM

మెగా ఫ్యాన్స్ యందు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వేరయా అంటుంటుంది చిత్రలోకం. అవును... మెగా ఫ్యాన్స్ నుంచి పవన్ ఫ్యాన్స్ సెపరేట్ అయిపోయి చాలా కాలం అయ్యింది.  మెగా హీరోల్లో మిగిలిన వారి సంగతెలా వున్నా, బన్నీ  అంటే.. పవన్ ఫ్యాన్స్ కి బొత్తిగా పడడం లేదు.  దానికి కారణం.. `చెప్పను బ్రదర్` అనే  ఎపిసోడే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకొంటా.  ఆ రోజు బన్నీ  ఆ మాట  ఎందుకన్నాడో తెలీదు గానీ అందుకు ప్రతిఫలం ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాడు.  ఆ ఎఫెక్ట్ తాజాగా దువ్వాడ జగన్నాథమ్ టీజర్ పై పడింది.

మహా శివరాత్రి సందర్భంగా డీజే టీజర్ ఈ రోజే బయటకు వచ్చింది. నిజానికైతే టీజర్ అదిరిపోయింది. కానీ యూ ట్యూబ్ లో డీజే టీజర్ కి వస్తున్న డిజ్ లైక్స్ చూస్తే షాక్ తినక తప్పదు. ఎందుకంటే ఈ టీజర్ కి ఎన్ని లైకులు వచ్చాయో అంతే స్థాయిలో డిజ్ లైకులు వస్తున్నాయి. దానికి కారణం యాంటీ బన్నీ ఫ్యాన్స్ అనే పవన్ ఫ్యాన్స్. చెప్పను బ్రదర్ అనే ఎపిసోడ్ కి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ రూపంలో ప్రతీకారం తీర్చుకొంటున్నారన్న మాట. డీజే వీడియో కింద కామెంట్లు చూస్తే పవన్ ఫ్యాన్స్,  బన్నీ ఫ్యాన్స్  మధ్య  ఎంత పెద్ద అడ్డు గోడ వుందో , వాళ్ల మధ్య విభేదాలు  ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతోంది.  

ఈ టీజర్ కి వీలైనన్ని డిజ్ లైక్స్ కొట్టమని పవన్ ఫ్యాన్స్ మేసేజ్ లు పంపుకొంటున్నారంటే పరిస్థితి  ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవొచ్చు.  దానికి ప్రతిగా బన్నీ ఫ్యాన్స్ కూడా స్పందిస్తున్నారు.  డిజ్ లైక్స్ కొడుతోంది పవన్ ఫ్యాన్సే అని...   నిజంగా వాళ్లు పవన్ ఫ్యాన్స్ అయితే. పవన్ ని ఫాలో అయితే  ఇలా చేయరని ఘాటుగానే కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి పవన్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ గోల మళ్లీ మొదలైంది.  ఇది  ఎంత వరకూ వెళ్లి ఆగుతుందో చూడాలి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com