Home

»

Gossips

తార‌క్ తో సాయిప‌ల్ల‌వి రొమాన్స్!?

May 5, 2022 3:17PM

`ఆర్ ఆర్ ఆర్`తో పాన్ - ఇండియా స్టార్ అయిపోయారు యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్. త్వ‌ర‌లో తార‌క్.. విజ‌న‌రీ కెప్టెన్ కొర‌టాల శివ‌తో జ‌ట్టుక‌ట్ట‌నున్నారు. `జ‌న‌తా గ్యారేజ్` (2016) వంటి సంచ‌ల‌న చిత్రం త‌రువాత ఎన్టీఆర్ - కొర‌టాల కాంబోలో రాబోతున్న సినిమా కావ‌డంతో.. `ఎన్టీఆర్ 30`పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. జూన్ నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో తార‌క్ కి జోడీగా ఆలియా భ‌ట్ న‌టించాల్సి ఉంది. అయితే, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంది. ఈ నేప‌థ్యంలో.. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్న పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఇందులో డాన్సింగ్ సెన్సేస‌న్ సాయిప‌ల్ల‌వి ఓ హీరోయిన్ గా న‌టించే ఛాన్స్ ఉంద‌ట‌. ఈ మేర‌కు సంప్ర‌దింపులు కూడా జ‌రిగాయ‌ని టాక్. త్వ‌ర‌లోనే తార‌క్ - కొర‌టాల సెకండ్ జాయింట్ వెంచ‌ర్ లో సాయిప‌ల్ల‌వి ఎంట్రీపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. మ‌రి.. తార‌క్ - సాయిప‌ల్ల‌వి జోడీ ఏ స్థాయిలో మెస్మ‌రైజ్ చేస్తుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. కాగా, ఈ సినిమాకి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ బాణీలు అందించే అవ‌కాశ‌ముంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com