సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రామ్ చరణ్!
on Feb 2, 2025

ఇటీవల 'గేమ్ ఛేంజర్'తో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన రామ్ చరణ్ (Ram Charan), తన తదుపరి సినిమాలతో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేయాలని భావిస్తున్నాడు. అదిరిపోయే లైనప్ తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం తన 16వ సినిమాని బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న చరణ్, 17వ సినిమాని సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్నాడు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్ వంటి దర్శకుల పేర్లు వినిపించాయి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా పేరు తెరపైకి వచ్చింది. (Sandeep Reddy Vanga)
ఇటీవల రామ్ చరణ్ ని సందీప్ రెడ్డి కలిసినట్లు తెలుస్తోంది. వీరి మధ్య కథా చర్చలు జరిగినట్లు సమాచారం. చరణ్-సందీప్ రెడ్డి కాంబినేషన్ లో ఖచ్చితంగా సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే ప్రస్తుతం సందీప్ చేతిలో పలు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ప్రభాస్ తో 'స్పిరిట్', రణబీర్ కపూర్ తో 'యానిమల్ పార్క్' లైన్ లో ఉన్నాయి. అలాగే అల్లు అర్జున్ తోనూ ఒక సినిమా కమిట్ అయ్యి ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ లు పూర్తి కావడానికి టైం పడుతుంది. మరోవైపు రామ్ చరణ్ కూడా తన కమిట్ మెంట్స్ పూర్తి చేయాల్సి ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే, రామ్ చరణ్ 18 లేదా 19వ సినిమాని సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



