Home

»

Gossips

నాగ్‌తో సంప‌త్ నంది చిత్రం!?

May 27, 2022 3:09PM

`ఏమైంది ఈ వేళ‌`, `ర‌చ్చ‌`, `బెంగాల్ టైగ‌ర్`, `గౌత‌మ్ నంద‌`, `సీటీమార్`.. ఇలా ప‌రిమిత సంఖ్య‌లోనే సినిమాలు తీసినా ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సంప‌త్ నంది. కాగా, త్వ‌ర‌లో ఓ సీనియ‌ర్ స్టార్ తో సంప‌త్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని తీయ‌బోతున్నాడ‌ట‌.  

ఆ వివ‌రాల్లోకి వెళితే.. కింగ్ నాగార్జున‌తో సంప‌త్ నంది ఇటీవ‌ల సంప్ర‌దింపులు జ‌రిపార‌ట‌. క‌థ‌, పాత్ర న‌చ్చ‌డంతో నాగ్ కూడా ఈ ప్రాజెక్ట్ కి వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని బ‌జ్. అంతేకాదు.. మ్యాట్నీ ఎంట‌ర్టైన్మెంట్స్ ప‌తాకంపై నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నార‌ని స‌మాచారం. అలాగే, ఇందులో నాగ్ ఓ డిఫ‌రెంట్ రోల్ లో ఎంట‌ర్టైన్ చేస్తార‌ని వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే నాగ్ - సంప‌త్ నంది కాంబినేష‌న్ పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

ఇదిలా ఉంటే.. నాగార్జున ప్ర‌స్తుతం `గ‌రుడ వేగ‌` ఫేమ్ ప్ర‌వీణ్ స‌త్తారు కాంబినేష‌న్ లో `ద ఘోస్ట్` అనే మూవీ చేస్తున్నారు. మాజీ `రా` ఏజెంట్ గా నాగ్ క‌నిపించ‌నున్న ఈ సినిమాలో అత‌నికి జోడీగా సోనాల్ చౌహాన్ న‌టిస్తోంది. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రం.. ఇదే ఏడాది ద్వితీయార్ధంలో తెర‌పైకి రాబోతోంది. `బంగార్రాజు` వంటి హిట్ చిత్రం త‌రువాత నాగ్ నుంచి రాబోతున్న సినిమా కావ‌డంతో `ద ఘోస్ట్`పై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com