SSMB29: షూటింగ్ కి బ్రేక్.. గొడవలే కారణమా..?
on Jul 7, 2025

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రాజమౌళి తన సినిమాలకు భిన్నంగా.. కనీసం అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వకుండానే.. జెట్ స్పీడ్ లో షూట్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆయన స్పీడ్ కి బ్రేక్ లు వేస్తూ.. ఒక కీలక షెడ్యూల్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు కెరీర్ లో 29వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ కి.. 'SSMB29' అనేది వర్కింగ్ టైటిల్. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశా వంటి ప్రాంతాల్లో కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా కోసం కెన్యాలో ఒక భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం ఆ దేశంలో శాంతి భద్రతల సమస్య నెలకొంది. దాంతో కెన్యా షెడ్యూల్ ను చిత్ర బృందం క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని ప్లాన్ చేశారట. అయితే ఇప్పుడు షెడ్యూల్ క్యాన్సిల్ కావడంతో.. ఆ సన్నివేశాలను ఎక్కడ షూట్ చేస్తే బాగుంటుంది అనే విషయంలో టీం తర్జన భర్జనలు పడుతున్నట్లు సమాచారం.
కెన్యా షెడ్యూల్ క్యాన్సిల్ అయిందన్న వార్త మహేష్ ఫ్యాన్స్ కి నిరాశ కలిగించేదే అయినప్పటికీ.. త్వరలో వారికి ఓ గుడ్ న్యూస్ కూడా వచ్చే అవకాశముంది. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు. ఆయన జన్మదినం కానుకగా.. గ్లింప్స్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అలాగే, ఆరోజు ప్రెస్ మీట్ పెట్టి.. సినిమాకి సంబంధించిన పలు విషయాలను రాజమౌళి పంచుకునే అవకాశాలున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



