క్రేజీ పాన్ ఇండియా మూవీలో రానా..!
on Apr 1, 2025

'హనుమాన్'తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న తేజ సజ్జ (Teja Sajja).. ప్రస్తుతం 'మిరాయ్' (Mirai) అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. మంచు మనోజ్ (Manchu Manoj) విలన్ గా నటిస్తున్నాడు. ఆగస్టు 1న విడుదల కానున్న 'మిరాయ్'పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది.
మిరాయ్ మూవీలో రానా దగ్గుబాటి (Rana Daggubati) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ రోల్ కోసం దుల్కర్ సల్మాన్ ని అనుకున్నారట. అయితే ఇప్పుడు రానా పేరు తెరపైకి వచ్చింది. రానా, తేజ సజ్జ మధ్య మంచి అనుబంధముంది. ఈ ఇద్దరు కలిసి ఐఫా అవార్డ్స్ కి హోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే మిరాయ్ లో కీ రోల్ కోసం సంప్రదించగా.. రానా వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం.
హీరో, విలన్ రోల్స్ మాత్రమే కాకుండా సినిమాకి హెల్ప్ అవుతుంది అనుకుంటే గెస్ట్ రోల్స్ చేయడానికి కూడా రానా వెనుకాడడు. ఇప్పటికే పలు సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిశాడు. ఇదే బాటలో ఇప్పుడే మిరాయ్ లో నటించడానికి అంగీకరించాడట. తేజ, మనోజ్ తో పాటు రానా కూడా తోడు కావడంతో.. ప్రేక్షకుల దృష్టి మిరాయ్ పై మరింత పడుతుంది అనడంలో డౌట్ లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



