Home

»

Gossips

నిర్మాతగా రామ్ గోపాల వర్మ కుమార్తె రేవతి

Mar 21, 2011

ram gopal varma wallpapers, ram gopal varma stills, ram gopal varma images, ram gopal varma photos, ram gopal varma pics, ram gopal varma pictures నిర్మాతగా రామ్ గోపాల వర్మ కుమార్తె రేవతి రాబోతూందని ఒక వార్త ఫిలిం నగర్ వర్గాల్లో షికారు చేస్తోంది. నిజానికి రామ్ గోపాల వర్మ కుమార్తె రేవతి రష్యాలో మెడిసిన్ చదువుతోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల నటిగా, నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. అలాగే నటుడు విజయకుమార్ కుమార్తె శ్రీదేవి కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. సకల కళా వల్లభుడు కమల్ హాసన్ కుమార్తె కూడా నటిగా, సంగీత దర్శకురాలిగా సినీ పరిశ్రమలో రాణిస్తోంది.

ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తెలు ప్రియాంక, స్వప్న కూడా నిర్మాతలుగా కొన్ని చిత్రాలు నిర్మించారు. ఇలా చెప్పుకుంటూ పోతే సినీ సెలబ్రిటీల కుమార్తేలనేకమంది సినీ పరిశ్రమలో వివిధ రంగాల్లో రాణించి తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. అలాగే డాక్టర్ కోర్సు పూర్తి చేశాక ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ కుమార్తె రేవతి కూడా నిర్మాతగా సినీ రంగంలోకి ప్రవేశించి రాణించాలని మనం కూడా కోరుకుందాం.... ఏమంటారు...?

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com