స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న నిత్యామీనన్!
on Jul 20, 2022

50 కి పైగా సినిమాల్లో నటించి సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె సౌత్ కి చెందిన ఒక స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది.
మలయాళంలో పలు సినిమాల్లో నటించిన నిత్యామీనన్ ఓ మలయాళ స్టార్ హీరోతో కొంతకాలంగా ప్రేమలో ఉందట. పెద్దల అంగీకారంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలొస్తున్నాయి. మలయాళ వెబ్ సైట్స్ లో నిత్యామీనన్ పెళ్లి వార్తలు దర్శనమివ్వడంతో.. ఆమెను పెళ్లాడే స్టార్ హీరో ఎవరా అంటూ చర్చలు మొదలయ్యాయి. మలయాళ స్టార్స్ లో మనకు బాగా తెల్సిన దుల్కర్ సల్మాన్, ఫహాద్ ఫాజిల్, పృథ్వీరాజ్ వంటి వారికి ఇప్పటికే పెళ్లయిపోయింది. దీంతో నిత్యామీనన్ మనసు దోచిన ఆ స్టార్ ఎవరా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
కాగా 'అలా మొదలైంది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నిత్యామీనన్.. 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'జనతా గ్యారేజ్' వంటి సినిమాలతో ఆకట్టుకుంది. ఈ ఏడాది 'భీమ్లా నాయక్' చిత్రంతోనూ అలరించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



