Home

»

Gossips

ఊహించని కాంబో.. యంగ్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ మూవీ..!

Jun 13, 2025

 

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో మైథలాజికల్ ఫిల్మ్ చేయాల్సి ఉండగా.. అది జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్ళిపోయింది. దీంతో అట్లీ తర్వాత బన్నీ ఏ దర్శకుడితో చేతులు కలుపుతాడనే ఆసక్తి నెలకొంది. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ పేరు తెరపైకి వచ్చింది. (Allu Arjun)

 

మలయాళ సినీ పరిశ్రమలో ప్రతిభగల దర్శకుడు, నటుడిగా పేరు పొందాడు బాసిల్ జోసెఫ్. ఆయన దర్శకత్వంలో  'కుంజిరామాయణం', 'గోధా', 'మిన్నల్ మురళి' సినిమాలు వచ్చాయి. వీటిలో 'మిన్నల్ మురళి' వివిధ భాషల ప్రేక్షకులకు చేరువై.. దర్శకుడిగా ఎంతో పేరు తెచ్చి పెట్టింది. 

 

ఇక నటుడిగానూ బాసిల్ జోసెఫ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యి, విశేష ఆదరణ పొందాయి. 'జయ జయ జయ జయ హే', 'గురువాయూర్ అంబలనాడయిల్', 'సూక్ష్మదర్శిని' వంటి సినిమాలు నటుడిగా మంచి పేరు తెచ్చి పెట్టాయి. యాక్టర్ గా ఫుల్ బిజీ అయిపోయిన బాసిల్ జోసెఫ్.. నాలుగేళ్లుగా డైరెక్షన్ జోలికి పోలేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ ను డైరెక్ట్ చేయబోతున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.

 

బాసిల్ జోసెఫ్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన అల్లు అర్జున్.. ఆయన డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇది గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ తెరకెక్కనుందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు.

 

కేరళలో అల్లు అర్జున్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. మలయాళ ప్రేక్షకులు 'మల్లు అర్జున్' అని అభిమానంతో పిలుస్తుంటారు. అలాంటిది ఇప్పుడు బన్నీ.. ఓ మలయాళ యువ దర్శకుడితో సినిమా చేయడానికి సిద్ధపడటం.. అక్కడి ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com