Home

»

Featured News

రజినీకాంత్ హీరోగా, చిరంజీవి విలన్‌గా 45 ఏళ్ళ క్రితం విడుదలైన సినిమా గురించి మీకు తెలుసా?

Mar 17, 2026

1978లో ప్రాణం ఖరీదు చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటించి తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. అలా 30 సినిమాలు చేసిన తర్వాత 1981లో రజినీకాంత్ హీరోగా నటించిన ‘రణవీరన్‌’ అనే తమిళ సినిమాలో విలన్‌గా నటించారు. అప్పటికే న్యాయంకావాలి, మొగుడు కావాలి, పున్నమినాగు, కోతలరాయుడు, నకిలీ మనిషి, లవ్ ఇన్ సింగపూర్ వంటి సినిమాలు చేశారు. అంతకుముందు కెరీర్ ప్రారంభంలోనే చిరంజీవి హీరోగా ఓ తమిళ సినిమా ప్రారంభమైంది. ఎన్టీఆర్, ఎఎన్నార్, కష్ణ, శోభన్‌బాబు వంటి టాప్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన కె.ఆర్.విజయ.. ఈ సినిమాలో హీరోయిన్. నటుడిగా ఎదుగుతున్న సమయంలోనే అంతటి సీనియర్ హీరోయిన్‌తో సినిమా చేసే అవకాశం రావడం నిజంగా చిరంజీవి అదష్టమనే చెప్పాలి. అయితే ఈ సినిమా కొంత షూటింగ్ జరిగిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఈ సినిమా షూటింగ్ సజావుగా జరిగి ఉంటే హీరోగా తమిళ్‌లో కూడా చిరంజీవి మంచి పేరు తెచ్చుకునే వారని కె.ఆర్.విజయ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 

రజినీకాంత్‌లోని కమర్షియల్ యాంగిల్‌ని మొదట గుర్తించిన దర్శకుడు ఎస్.పి.ముత్తురామన్. వీరిద్దరి కాంబినేషన్‌లో 25కి పైగా సినిమాలు వచ్చాయి. మొదట కె.బాలచందర్ వంటి దర్శకుల సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ వచ్చిన రజినీకాంత్.. ముత్తురామన్ వల్ల కమర్షియల్ హీరోగా మారిపోయారు. అలా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘రణవీరన్‌’. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన వీరప్పన్.. స్వతహాగ రచయిత. ఎంజీఆర్‌ని దష్టిలో పెట్టుకొని ఈ కథను సిద్ధం చేశారు. అయన రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చెయ్యలేకపోయారు. దాంతో రజినీకాంత్‌కి అవకాశం వచ్చింది. శ్రీదేవిని హీరోయిన్‌గా, చిరంజీవిని విలన్‌గా తీసుకున్నారు.

తమిళ్‌లో అప్పటికే మంచి యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న రజినీకాంత్‌కి ‘రణవీరన్‌’ మంచి విజ‌యాన్ని అందించింది. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువగానే ఉంటుంది. చిరంజీవి, రజినీకాంత్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటాయి. 1981 అక్టోబర్ 26న తమిళ్‌లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను మరుసటి ఏడాది ‘బందిపోటు సింహం’ పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. అయితే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను అంతగా రిసీవ్ చేసుకోలేదు. అప్పటి నుంచి రజినీకాంత్, చిరంజీవి మంచి స్నేహం ఉంది. చిరంజీవి మెగాస్టార్‌గా ఎదిగిన తర్వాత తను హీరోగా నటిస్తున్న సినిమాలో గెస్ట్ రోల్ చెయ్యాల్సిందిగా రజినీకాంత్ రిక్వెస్ట్ చేశారు. 1989లో విడుదలైన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రానికి రీమేక్‌గా తమిళ్‌లో రూపొందిన మా పిళ్ల‌య్‌ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు చిరంజీవి. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com