
నవంబర్ 1న హీరోయిన్ ఇలియానా డి క్రూజ్ పుట్టినరోజు. 2006లో రామ్ పోతినేని హీరోగా నటించిన దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. అదే ఏడాది మహేష్‌బాబు నటించిన పోకిరితో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఆ తర్వాత ఖతర్నాక్, రాఖీ, మున్నా, ఆట వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
పవన్ కల్యాణ్‌తో జల్సా, రవితేజతో కిక్, అల్లు అర్జున్‌తో జులాయి వంటి సినిమాలు ఇలియానా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచాయి. శక్తి, నేను నా రాక్షసి, దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాల్లోనూ ఆమె నటించారు. ముఖ్యంగా కిక్, జల్సా, జులాయి సినిమాల్లో ఆమె గ్లామర్‌తో పాటు నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్ర కథానాయికల్లో ఒకరిగా కొనసాగిన ఇలియానా.. ఆ తర్వాత బాలీవుడ్‌పైనా దృష్టి సారించారు.
2012లో వచ్చిన హిందీ చిత్రం బర్ఫీతో బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాలో నటనకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ మహిళా అరంగేట్ర అవార్డు అందుకున్నారు. హిందీ సినిమాల్లో బిజీ అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకులకు ఇలియానా అంటే పోకిరి, జల్సా, కిక్, జులాయి వంటి విజయవంతమైన సినిమాలే ముందుగా గుర్తొస్తాయి. అందం, గ్లామర్, తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఒక దశలో టాలీవుడ్‌ను అలరించిన ఇలియానాకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఇది కూడా చదవండి: మిస్ వరల్డ్ నుంచి స్టార్ హీరోయిన్‌గా.. ఐశ్వర్యారాయ్ సక్సెస్ వెనుక అసలు కథ.!
[Ileana D'Cruz Birthday, Ileana Birthday Special, Ileana D'Cruz Telugu Movies, Ileana D'Cruz Biography, Ileana Hits and Flops, Ileana D'Cruz, Ileana Birthday, Ileana Movies]





