బిబి జోడిలో పవర్ అస్త్రాన్ని యూజ్ చేసి జోకర్స్ అయ్యాం..
on Jan 26, 2026
బిబి జోడి సీజన్ 2 ఫుల్ జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఐతే ఈ వారం ఎపిసోడ్స్ లో ఎలిమినేషన్ ఉందంటూ జడ్జెస్ చెప్పారు. అలాగే రెండు రోజుల షోలో ఉన్న కంటెస్టెంట్స్ అంతా కూడా వాళ్ళ స్కోరింగ్ తెలుసుకున్నాక ఫేస్ ఆఫ్ కి వస్తున్న జోడీస్ గా డీమన్ పవన్ - రీతూ చౌదరి, ఆర్జే చైతు - కీర్తి భట్ అని అనౌన్స్ చేసాడు హోస్ట్. ఐతే ఈ రెండు జోడీలు కూడా పటాకా జోడీలు. వీళ్ళ మధ్య 90 సెకెన్ల డాన్స్ పోటీ పెట్టారు. ఐతే ఆర్జే చైతు జోడి కీర్తి భట్ రాలేదు. "ఆమె అసలు నడవలేకపోతోంది. అందుకే మా దగ్గర ఉన్న పవర్ అస్త్రాన్ని వాడుకోవాలనుకుంటున్నాం" అన్నాడు చైతు. ఈ పవర్ అస్త్రాకి ఉన్న పవర్ ఏంటి అంటే "స్వాప్ ది పొజిషన్" వేరే వాళ్ళ పొజిషన్ లోకి వీళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వీళ్ళ పొజిషన్ కి అంటే ఫేస్-ఆఫ్ లోకి వస్తారన్న మాట. చైతు ఈ అస్త్రాన్ని ధన్రాజ్ - భానుశ్రీతో స్వాప్ చేసుకోవాలని అనుకున్నాడు. దాంతో ధన్రాజ్ - భానుశ్రీ, డీమన్ పవన్ - రీతూ చౌదరి మధ్య పోటీ జరిగింది. చైతు జోడి సేఫ్ జోన్ లో వెళ్ళింది. ఐతే ఫైనల్ లో ధన్రాజ్-భానుశ్రీ ఎలిమినేట్ అయ్యారని జడ్జెస్ అనౌన్స్ చేసి తూచ్ మీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాం నెక్స్ట్ ఎపిసోడ్ కి అందరికీ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది మీకు మైనస్ పై నుంచి స్టార్ట్ అవుతుంది అంటూ శేఖర్ మాష్టర్ చెప్పారు. ఇక వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఐతే ఇక్కడ ఆర్జే చైతు ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో రీసెంట్ గా పెట్టాడు. "జడ్జెస్ ఎలిమినేషన్ లేదని డిసైడ్ అయ్యాక ఇంకా పవర్ అస్త్ర వలన ఉపయోగం ఏంటి ? ఆ పవర్ కి వేల్యూ ఏముంది ? జోకర్లు అయ్యాము ఆ పవర్ అస్త్రాన్ని యూజ్ చేసి" అంటూ పోస్ట్ పెట్టాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



