
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అభిమానులకు మరో క్రేజీ అప్‌డేట్. ఆయన నటిస్తున్న ‘కింగ్’ సినిమా డిసెంబర్ 24, 2026న థియేటర్లలోకి రానుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్‌తో పాటు దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్ వంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో భాగమయ్యారు.
తాజాగా షారుఖ్ ఖాన్ షేర్ చేసిన కొత్త పోస్టర్‌లో ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘‘ఖతిల్ నహి.. ఆశిక్ హూన్’’ అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను షేర్ చేశారు. అంటే, ‘‘హంతకుడిని కాదు.. ప్రేమికుడిని’’ అనే అర్థం వచ్చే ఈ డైలాగ్‌తో సినిమాలో తన పాత్రపై ఆసక్తి పెంచారు. 60 ఏళ్ల వయసులోనూ షారుఖ్ ఇలా రొమాంటిక్ టచ్‌తో కనిపించడం విశేషం. చేతిలో గన్, ఒంటి మీద రక్తపు మరకలు, నోటితో గులాబీ పట్టుకొని స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్న షారుఖ్ లుక్ అదిరిపోయింది.
‘కింగ్’ సినిమాలో షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ కూడా కీలక పాత్రలో కనిపించనుంది. 2023లో ‘ది ఆర్చీస్’తో నటిగా పరిచయమైన సుహానాకు ఇది థియేటర్లలో పెద్ద అవకాశం కానుంది. ఇక దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ తదితరులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.
‘పఠాన్’ తర్వాత దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో షారుఖ్ చేస్తున్న సినిమా కావడంతో ‘కింగ్’పై అంచనాలు భారీగా ఉన్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈసారి షారుఖ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి: ‘ఆదర్శ కుటుంబం’ ఈవెంట్‌కు ఎన్టీఆర్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అప్డేట్ ఇస్తాడా.?
[Shah Rukh Khan King New Look, King Movie Release Date, King Movie 2026, Shah Rukh Khan, Siddharth Anand, Suhana Khan, Deepika Padukone, Bollywood News, Telugu News]





