పహల్ గామ్ దాడి తర్వాత సల్మాన్ ఖాన్ వెనకడుగు వేశాడా!
on Apr 25, 2025
స్టార్ హీరో 'సల్మాన్ ఖాన్'(Salman Khan)ఈద్(Eid)కానుకగా మార్చి 30 న 'సికందర్'(Sikandar)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ సల్మాన్ కి భారీ విజయాన్ని అందిస్తుందని అభిమానులతో పాటు ప్రేక్షకులు చాలా బలంగా నమ్మారు. కానీ ఎవరు ఊహించని విధంగా 'సికందర్' పరాజయాన్ని చవిచూసింది. దీంతో సల్మాన్ తన తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో చేస్తాడు, ఎలాంటి కథతో చేస్తాడనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ నేపథ్యంలోనే తన హిట్ మూవీస్ లో ఒకటైన 'భజరంగీ భాయిజాన్' కి సీక్వెల్ చెయ్యబోతున్నాడనే న్యూస్ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా వినిపిస్తుంది.
ఇప్పుడు ఈ మూవీని సల్మాన్ చెయ్యడనే వార్తలు ముంబై సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే ఈ మూవీ పాకిస్థాన్ కి చెందిన ఆరు సంవత్సరాల 'షాహిదా' అనే పాప ఇండియా వచ్చి తప్పిపోతోంది. దీంతో 'భజరంగీ భాయిజాన్(Bajrangi Bhaijaan)అనే హిందు యువకుడిగా చేసిన సల్మాన్, ఆ పాపని భద్రంగా పాకిస్థాన్ కి పంపిస్తాడు. ఈ నేపథ్యంలో కథ తెరకెక్కగా ఆ రెండు క్యారక్టర్ ల మధ్య ఎంతో అనుబంధాన్ని కూడా చూపించడం జరిగింది. సెకండ్ పార్ట్ కూడా ఇండియా(India)పాకిస్థాన్ మధ్య నడిచే కథతోనే తెరకెక్కబోతుందనే వార్తలు వచ్చాయి. రచయత విజయేంద్ర ప్రసాద్ చెప్పిన కథ సల్మాన్ కి నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే న్యూస్ కూడా బయటకి వచ్చింది. కానీ పహల్ గామ్ లో ఉగ్రవాదులు 28 మందిని పొట్టన పెట్టుకోవడంతో పాకిస్థాన్ తో తాడో పేడో తేల్చుకోవాలని మన వాళ్ళు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్,ఇండియా నేపథ్యంలో మూవీ తెరకెక్కించడం అసాధ్యం. దీంతో 'భజరంగీ బాయ్ జాన్' సీక్వెల్ ప్రయ్నత్నాలు సల్మాన్ విరమించుకున్నట్టుగా తెలుస్తుంది.
భజరంగీ బాయ్ జాన్ 2015 జులై 17 న ఈద్ కానుకగా విడుదలవ్వగా సల్మాన్ కి జోడిగా కరీనాకపూర్(Kareena Kapoor)చేసింది. కబీర్ ఖాన్(Kabir Khan)దర్శకత్వంలో సల్మాన్, రాక్ లైన్ వెంకటేష్ సుమారు 75 కోట్లరూపాయిల బడ్జెట్ తో నిర్మించారు. వరల్డ్ వైడ్ గా 918 కోట్లు వసూలు చేసింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
