
సినిమా అంటే భాషతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక రామాయణం వంటి ఇతిహాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కథతో రూపొందుతున్న సినిమాపై ఇండియాలోనే కాదు.. పాకిస్థాన్‌లోనూ ఆసక్తి కనిపిస్తోంది. అక్కడి హిందువులు 'రామాయణ' సినిమా కోసం చేస్తున్న సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న చిత్రం 'రామాయణ'. నితేశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లోని కరాచీలో నివసిస్తున్న హిందువులు కూడా సినిమాకు తమ మద్దతు తెలియజేస్తున్నారు.
పాకిస్థాన్‌లో హిందువులు జరుపుకునే పండుగలు, అక్కడి సంప్రదాయాలను పరిచయం చేసే యూట్యూబర్ సుమిత్ చంద్ర ఈ వేడుకలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో స్థానిక హిందువులు రామాయణ సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ కనిపించారు. అంతేకాదు.. కరాచీలోని ఓ ఆలయంలో సినిమా పోస్టర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

రామాయణం తమకు కేవలం సినిమా మాత్రమే కాదని.. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు, సంస్కృతితో ముడిపడిన కథ అని అక్కడి హిందువులు చెబుతున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
దీపావళి సందర్భంగా ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని వేడుకలు నిర్వహించడం కూడా ఆసక్తిని పెంచుతోంది. భిన్నమైన పరిస్థితుల్లో జీవిస్తున్నప్పటికీ తమ సంస్కృతితో ముడిపడిన కథపై వారు చూపిస్తున్న అభిమానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
'రామాయణ' సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తొలి భాగం 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆస్కార్‌కు వెళ్లిన సినిమా తెలుగులోకి.. ట్రైలర్ మామూలుగా లేదు.!
[Ramayana Craze In Pakistan, Ramayana Fever in Pakistan, Ramayana Movie Pakistan, Pakistani Hindu Fans, Ranbir Kapoor, Sai Pallavi, Yash, Telugu Film News]




