
సినీ పరిశ్రమలో హీరోలుగా రాణిస్తూ, లగ్జరీ జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఎందరో అందమైన నటీమణులతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. గ్లామర్ ప్రపంచంలో ఇలాంటి వాతావరణం ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత జీవితానికి, వైవాహిక బంధానికి తానేంత విలువ ఇస్తానో నటుడు మాధవన్ ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి చెప్పారు. జూన్ 6, 1999లో సరితని వివాహం చేసుకున్న మాధవన్ ఇటీవలే తమ 27వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు సుదీర్ఘమైన వైవాహిక ప్రయాణంలో నేనెప్పుడూ నా భార్యని మోసం చేయలేదు. ఎంతమంది అందగత్తెలు నా చుట్టూ ఉన్నా, రోజు ముగిసేసరికి ఇంటికి వెళ్లి నా భార్యని హత్తుకున్నప్పుడే నిజమైన ప్రశాంతత లభిస్తుంది. భార్య పట్ల విధేయత, నమ్మకం అనేవి నా రక్తంలోనే ఉన్నాయి. ఇదొక కుటుంబ లక్షణం. నా పూర్వీకులు టాటా సంస్థ వ్యవస్థాపకుడు జంషెడ్‌జీ టాటా పట్ల జీవితాంతం ఎంతగానో కృతజ్ఞతతో, విధేయతతో ఉండేవారు. దేవుడి పటాలతో పాటు ఆయన ఫోటోకి కూడా పూలమాల వేసి పూజించేవారు.
Also read: Peddi: ఇలా చేస్తే ఏ సినిమా అయినా హిట్ అంటున్న చరణ్.. స్టేజ్ పైన మీసం మెలేసాడు
అలాంటి కుటుంబం నుంచి వచ్చిన నేను, నా భార్యకి నమ్మకద్రోహం చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది గ్లామర్ ఫీల్డ్‌లో ఉంటూ ఆకర్షణలకు లోనవడం సహజమే అయినా, నేను మాత్రం భార్యకి భయపడే ఒక సాధారణ మధ్యతరగతి మద్రాసీ వ్యక్తిని. ఇంట్లోని ఆర్థిక వ్యవహారాలన్నీ నా భార్యనే చూసుకుంటుంది. నా ఫోన్, బ్యాంక్ ఖాతాల పాస్‌వర్డ్‌లు అన్నీ ఆమెకి తెలుసు. దాచడానికి ఏమీ లేదని స్పష్టం చేశారు. మాధవన్ ఎప్పటిలాగానే 'ధురంధర్ 2' లో అజయ్ సన్యాల్ అనే క్యారక్టర్ లో మెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే.




