మోనాలిసా హీరోయిన్ అయిపోయింది.. ఏప్రిల్ నుంచి షూటింగ్!
on Jan 30, 2025
ఒకప్పుడు కళాకారులకు పాపులారిటీ రావాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. కానీ, ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న మాధ్యమాల ద్వారా ఎంతో ఈజీగా వారి పేరు ప్రపంచమంతా పాకిపోతోంది. ముఖ్యంగా యూట్యూబ్‌లో చేసే వీడియోల ద్వారా, షార్ట్స్ ద్వారా ఓవర్‌నైట్ స్టార్స్ అయిపోతున్నారు. అలాంటి ఉదాహరణలు ఈమధ్యకాలంలో మనం చాలా చూశాం. కానీ, ఎలాంటి మీడియా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది మోనాలిసా. అతి పేద కుటుంబానికి చెందిన ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాతో వెలుగులోకి వచ్చింది. తన డస్కీ స్కిన్, తేనెకళ్లతో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది.
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మోనాలిసా అనే అమ్మాయి తళుక్కున మెరిసింది. తన కుటుంబంతో కలిసి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముతున్న ఆమెను కొందరు యూట్యూబర్లు చూసి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కేవలం కొన్ని గంటల్లోనే మోనాలిసా పేరు దేశమంతా మారుమోగిపోయింది. వీటిని చూసిన బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెకు తన తర్వాతి సినిమాలో ఛాన్స్ ఇస్తానని ఎనౌన్స్ చేశారు. దీనిపై ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా స్పందించింది. మనకి డస్కీ స్కిన్ ఉన్న హీరోయిన్లు కరువైపోయారని, మోనాలిసా లాంటి అందమైన అమ్మాయిని ఎంకరేజ్ చెయ్యడంలో ఎలాంటి తప్పు లేదని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది.
ఇప్పుడు డైరెక్టర్ సనోజ్ మిశ్రా తను ఇచ్చిన మాట నిలబెట్టుకోబోతున్నాడు. మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఖర్గోన్ జిల్లా మహేశ్వర్‌లోని మోనాలిసా ఇంటికి వెళ్లారు సనోజ్. మోనాలిసా తండ్రి జైసింగ్ భోస్లేకి సినిమా పరిశ్రమ గురించి వివరించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆయనకు వచ్చిన సందేహాలను కూడా నివృత్తి చేశారు. చివరికి తమ కుమార్తె సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని సనోజ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆయన దర్శకత్వంలో రూపొందనున్న ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’లో మోనాలిసా నటించనుంది. ఈ సినిమాలో రిటైర్డ్ ఆర్మీ అధికారి కూతురుగా మోనాలిసా కనిపిస్తుంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు సోదరుడు అమిత్‌రావు పరిచయం అవుతున్నాడు. 20 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్ నుంచి మోనాలిసా షూటింగ్‌లో పాల్గొంటుంది. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
