Home

»

Bollywood News

నసీరుద్దీన్ షాపై కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు

Aug 12, 2026 4:00PM

 

బాలీవుడ్ భామ కంగనా రనౌత్ సినీ హిస్టరీని చెప్పమంటే తెలుగు ప్రేక్షకులు సైతం గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తారు. ప్రభాస్ తో ఏక్ నిరంజన్ చేసిన కంగనా ఇప్పడు భారతీయ జనతా పార్టీ తరుపున ఎంపి గా సేవలందిస్తూ ఉంది.  తాజాగా ఆమె లెజండ్రీ యాక్టర్ నసీరుద్దీన్ షా పై చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.జార్ఖండ్‌ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా  విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నటుడు, గాయకుడు పీయూష్ మిశ్రా స్వయంగా రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియానికి చేరుకుని విద్యార్థులకి తన సంఘీభావం తెలిపాడు. 

ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ 'నసీరుద్దీన్ షా గతంలో దేశంలో జరిగిన విద్యార్థుల నిరసనలపై బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు నోరు విప్పడం లేదు. నోట్లో ఎముక ముక్క ఉన్న కుక్క మొరగలేదు. సినీ ప్రముఖులు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే మౌనంగా ఉంటున్నారని చెప్పాడు.  అయితే, ఇప్పుడు జార్ఖండ్‌లో విద్యార్థులపై లాఠీఛార్జ్ జరుగుతుంటే, 14వ జేపీఎస్సీ పరీక్ష వివాదంలో అభ్యర్థులు వీధుల్లోకి వస్తే నసీరుద్దీన్ షా మౌనంగా ఎందుకు ఉన్నారని పీయూష్ మిశ్రా సూటిగా ప్రశ్నించారు.  


Also Read: యష్ వైఫ్ రాధిక భావోద్వేగ పోస్ట్ 

పీయూష్ మిశ్రా వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, బిజెపి ఎంపీ కంగనా రనౌత్ 'తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ 'నిజానికి మనమంతా ఏదో ఒక రకంగా ఎవరికో ఒకరికి విశ్వాసపాత్రంగానే ఉంటాం. నేను తింటున్న ఈ దేశపు అన్నానికి కృతజ్ఞతగా విశ్వాసంగా ఉండటం, ఈ దేశం కోసం పోరాడటం నాకు గర్వకారణం. నసీరుద్దీన్ షా మాత్రం ఈ దేశంలో తింటూ పొరుగు దేశం కోసం పోరాడతారు. ఈ రోజుల్లో విశ్వాసపాత్రంగా ఉండటాన్ని కుక్క అని పిలిచినా అది గొప్ప ప్రశంస లాంటిదే. ఎందుకంటే సమాజంలో విశ్వాసం, అమాయకత్వం చాలా అరుదైపోయాయి. నసీరుద్దీన్ షా లాంటి 'నక్క' గా ఉండేదానికంటే, విశ్వాసమున్న కుక్కలా ఉండటమే నాకు ఎంతో ఇష్టం" అని రాసుకొచ్చింది. 

Kangana Ranaut, Naseeruddin Shah, Bollywood

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com