దురంధర్ కి హృతిక్ రోషన్ ఇచ్చిన రివ్యూపై విమర్శలు
on Dec 11, 2025
.webp)
-హృతిక్ రివ్యూ ఎలా ఉంది
-విమర్శలకి కారణం ఏంటి!
-200 కోట్ల క్లబ్ లోకి చేరువలో
బాలీవుడ్ స్టార్ హీరో 'రణవీర్ సింగ్'(Ranveer singh)ఇండియా వ్యాప్తంగా 'దురంధర్'(Dhurandhar)తో బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా కలెక్షన్స్ ని రాబడుతుందంటే దురంధర్ సాధించిన విజయం ఎంత స్పష్టంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇండియన్ రా పోలీస్ ఆఫీసర్ గా రణవీర్ పాకిస్థాన్ వెళ్లి అక్కడి తీవ్రవాదులని అంతమొందించే క్యారక్టర్ లో చేసిన పెర్ ఫార్మెన్స్ ని అందరు మెచ్చుకుంటున్నారు. ఈ సందర్భగా వచ్చే కథ, నేపధ్యాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా మరో స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan)ఒక ఇంటర్వ్యూ లో దురంధర్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు.
హృతిక్ మాట్లాడుతు 'దురంధర్' నాకు చాలా బాగా నచ్చింది. మూవీ అంటే ఇలాగే ఉండాలి. ఇంత గొప్ప కథని సెల్యులాయిడ్ పైకి తీసుకొచ్చినందుకు మేకర్స్ కి నా అభినందనలు. హృదయాన్ని హత్తుకునేలా తీర్చిదిద్దారు. కాకపోతే రాజకీయపరమైన అంశాలని చూపించిన విధానాన్ని అంగీకరించలేకపోతున్నాను. కానీ ఒక పేక్షకుడిగా సినిమాని ఆస్వాదించడంతో పాటు కథ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. దీంతో హృతిక్ మాటలపై పలువురు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు మూవీలో కేవలం పాకిస్థాన్ ఉగ్రవాదుల క్రూరత్వాన్ని చూపించడంతో పాటు వాళ్ళు చేసే భయానక దాడుల్ని చూపించారు. ఆ విషయాలని ఎందుకు అంగీకరించలేకపోతున్నారని హృతిక్ ని ప్రశ్నిస్తున్నారు.
also read: దారుణమైన రీతిలో చిన్మయి మార్ఫింగ్ పిక్.. డబ్బులు తీసుకొని చేసింది వీళ్ళే
ఇక దురంధర్ పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా 2000 వ సంవత్సరం నేపథ్యంలో జరిగే కథాంశంతో తెరకెక్కింది. ఇప్పటికే 180 కోట్ల క్లబ్ లోకి చేరి రికార్డు కలెక్షన్స్ వైపు దూసుకెళ్తుంది. రణవీర్ సింగ్ తో పాటు సంజయ్ దత్, మాధవన్, అక్షయ్ ఖన్నా,వంటి ప్రతిభావంతమైన నటుల పెర్ ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉంది. ప్రతి ఫేమ్ లోను ఆదిత్య ధర్ దర్శకత్వ ప్రతిభ కట్టిపడేస్తుండగా డిసెంబర్ 5 న థియేటర్స్ లోకి అడుగుపెట్టింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



