బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య క్యాట్ ఫైట్స్ కామనే అయినా.. కొందరు భామల మధ్య ఉండే క్లోజ్ బాండింగ్ కొన్నిసార్లు సరికొత్త వివాదాలకు, గాసిప్స్‌కు దారితీస్తూ ఉంటుంది. ప్రస్తుతం బీ-టౌన్ గ్లామర్ క్వీన్స్ దిశా పటానీ, మౌనీ రాయ్‌ల మధ్య ఉన్న స్నేహం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. వీరిద్దరూ గత కొంతకాలంగా విడదీయరాని స్నేహితులుగా మారడమే కాకుండా, ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా క్లోజ్ అయ్యారు. అయితే ఈ అతి సాన్నిహిత్యమే వీరిపై కొన్ని విచిత్రమైన రూమర్స్ రావడానికి కారణమైంది.
గత కొద్ది రోజులుగా నెట్టింట వీరిద్దరూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమే కాదు.. 'లెస్బియన్స్' అంటూ, వీరు ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో విపరీతమైన గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ రూమర్లకు మరింత ఆజ్యం పోస్తూ వీరిద్దరూ తరచూ హాట్ ఫోటోషూట్స్ చేయడం, కలిసే ఫారెన్ వెకేషన్స్ ప్లాన్ చేసుకోవడం నెటిజన్లలో పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మౌనీ రాయ్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు దారితీసింది.
తమపై వస్తున్న డేటింగ్, లెస్బియన్ వార్తలకు ముగింపు పలకాలని భావించిన మౌనీ రాయ్.. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో దిశా పటానీతో కలిసి దిగిన ఒక అందమైన ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోకు 'నా లిటిల్ సిస్టర్‌ను చాలా మిస్సవుతున్నాను' (Missing my little sister) అనే క్రేజీ క్యాప్షన్‌ను జోడించారు. తద్వారా తామిద్దరం అక్కాచెల్లెళ్ల వంటి బంధాన్ని కలిగి ఉన్నామని, సమాజం అనుకుంటున్నట్లు తమ మధ్య మరే ఇతర రిలేషన్ లేదని పరోక్షంగా నెటిజన్లకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారీ నాగకన్య.
కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ ఫోటో పోస్ట్ చేసిన కేవలం కొద్ది నిమిషాల్లోనే మౌనీ రాయ్ ఆ పోస్ట్‌ను హఠాత్తుగా డిలీట్ చేసేశారు. లెస్బియన్ రూమర్ల దుమారానికి అడ్డుకట్ట వేయాలని వేసిన ఈ ప్లాన్.. చివరకు రివర్స్ అయి మరో కొత్త వివాదాన్ని తెచ్చిపెట్టింది. అసలు మౌనీ ఆ పోస్ట్‌ను అంత అర్జంటుగా ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? పోస్ట్ కింద నెటిజన్లు పెట్టిన నెగిటివ్ కామెంట్ల వల్ల భయపడిందా? లేక నెటిజన్లు మరింతగా ట్రోల్ చేస్తారనే భయంతో వెనక్కి తగ్గిందా? అంటూ నెట్టింట రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి.
సినిమాల విషయానికొస్తే.. మౌనీ రాయ్ 'బ్రహ్మాస్త్ర' లాంటి భారీ చిత్రంలో నెగెటివ్ రోల్‌లో మెప్పించగా, దిశా పటానీ గతేడాది టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'కల్కి 2898 AD' చిత్రంలో గ్లామరస్ రోల్‌లో మెరిసింది. ఈ ఇద్దరు భామలు తమ కెరీర్‌లో బిజీగా ఉంటూనే, పర్సనల్ లైఫ్‌తో నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరు క్లారిటీ ఇస్తున్నా కూడా రూమరాయుళ్లు మాత్రం వీరిపై వార్తలు అల్లడం ఆపడం లేదు. ఈ డిలీటెడ్ పోస్ట్ వ్యవహారంపై ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు మున్ముందు ఎలాంటి వివరణ ఇస్తారో, తమ తదుపరి ప్రాజెక్టులతో ఎలా అలరిస్తారో వేచి చూడాలి.





