ఐశ్వర్యారాయ్ గురించి అభిషేక్ కీలక వ్యాఖ్యలు..వాళ్ళ ఊహే నిజమైంది
on Nov 25, 2024
కొన్ని రోజుల క్రితం అభిషేక్ బచ్చన్(abhishek bachchan)ఐశ్వర్యా రాయ్(aishwarya rai)లు విడాకులు తీసుకోవడానికి సిద్దమవుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.ఐశ్వర్య తన కూతురుతో కలిసి ముంబైలోనే విడిగా ఉంటుందని, దీంతో ఆ ఇద్దరు విడిపోవడం గ్యారంటీ అని చెప్పుకుంటూ వచ్చారు.కానీ ఆ వార్తలన్నీ ఒట్టి పుకార్లే అని అందరకి అర్థమయ్యేలా, ఇద్దరు కలిసి ఒక ఫంక్షన్ కి కూడా హాజరయ్యారు.దీంతో ఇద్దరి అభిమానులు ఎంతగానో సంతోషించారు
రీసెంట్ గా అభిషేక్ సోషల్ మీడియా వేదికగా ఐశ్వర్య ని ప్రస్తావిస్తు నా శ్రీమతి ఐశ్వర్య కుటుంబం విషయంలో నన్నెంతగానో సపోర్ట్ చేస్తుంది.తన వల్లే సినిమాలపై దృష్టి పెట్టగలుగుతున్నాను. ఈ విషయంలో తనకి థాంక్స్ చెప్పాలనుకుంటున్నానని ట్వీట్ చేసాడు.విడిపోబోతున్నారనే రూమర్స్ తర్వాత అభిషేక్ మాట్లాడిన మాటలు కావడంతో ఇప్పుడు అవి వైరల్ గా నిలిచాయి.
ఇక అభిషేక్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బిహ్యాపీ,ఐ వాంట్ టూ టాక్, హౌస్ ఫుల్ 5 వంటి చిత్రాల్లో చేస్తున్నాడు.ఇందులో బీ హ్యాపీ మూవీ త్వరలోనే విడుదల కాబోతుంది.మిగతా రెండు షూటింగ్ దశలో ఉన్నాయి.
Also Read