English | Telugu

Mask man Harish Remuneration: మాస్క్ మ్యాన్ హరీష్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బిగ్ బాస్ సీజన్-9 ప్రారంభంలో మోస్ట్ టఫెస్ట్ కంటెస్టెంట్ అండ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ మాస్క్ మ్యాన్ హరీష్ అని అనుకున్నారంతా.. కానీ సీన్ రివర్స్ అయింది. తను వెళ్లిన నుండి హౌస్ మేట్స్ తో సరిగ్గా మాట్లాడింది లేదు.. కబుర్లు చెప్పింది లేదు.. ఎంత సేపు లోన్లీగా ఉండటం.. ఇలా ప్రతీది నెగెటివ్ గానే పోట్రేట్ అయింది.

నాలుగో వారం హౌస్ నుండి మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేట్ అయ్యాడు. అతను కొందరికి బ్లాక్ మాస్క్ అండ్ వైట్ మాస్క్ ఇచ్చాడు. హరీష్ ఎలిమినేషన్ అని నాగార్జున అన్నాక హౌస్ మేట్స్ ఎవరు బాధ పడలేదు. అంటే అతను హౌస్ లో ఉండటం కంటే వెళ్ళిపోతేనే బాగుంటుందని అందరు అనుకున్నారు. ఇక నాగార్జున అయితే డైరెక్ట్ గా ఓ మాట అనేసాడు. హౌస్ లో సోఫాలు, ఫ్రిడ్జ్, టేబుల్స్ ఎలాగో నువ్వు అలాగే అని వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున అన్నాడు. అయితే మాస్క్ మ్యాన్ ఎలిమినేషన్ అయ్యాక.. బజ్ ఇంటర్వ్యూ చేశాడు శివాజీ. తను బయట కూడా అలానే ఉంటాడని, నీతిగా నిజాయితీగా ఉందామని చూస్తానంటూ మాస్క్ మ్యాన్ హరీష్ చెప్పాడు. అయితే జనాలని గెల్చుకుంటేనా హౌస్ లో ఉంటావని శివన్న అన్నాడు. బిగ్ బాస్ హౌజ్‌లో అందరితో ఎక్కువగా వాదించడం, టాస్క్‌లు పెద్దగా ఆడకపోవడం, రూడ్‌గా ఉండటం మైనస్‌గా మారింది. ఈ కారణాల వల్ల హరీష్ ఎలిమినేట్ అయ్యాడు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు తనకి రెమ్యునరేషన్ ఎంతో ఓసారి చూసేద్దాం.. బిగ్ బాస్‌ లో పాల్గొన్నందుకు హరీష్‌కు వారానికి రూ. అరవై(60)వేల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నాలుగు వారాలు హౌస్ లో ఉన్న మాస్క్ మ్యాన్ హరీష్.. సుమారుగా 28 లేదా 29 రోజుల పాటు ఉన్నాడు. ఇరవై ఎనిమిది(28) రోజుల్లో రూ. 2 లక్షల 40 వేల వరకు డబ్బు సంపాదించినట్లు తెలుస్తోంది. మరి హౌస్ లో మాస్క్ మ్యాన్ ఆటతీరు మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.