English | Telugu

Tanuja Elimination: తనూజ ఎలిమినేషన్ ఫిక్స్.. ఫేక్ ఓటింగ్ ని గుర్తించిన ఆడియన్స్!

బిగ్ బాస్ దత్తపుత్రిక తనూజ ఎలిమినేషన్ కన్ఫమ్.. ఎస్ నిజమే.. ఇది వందకి వంద శాతం నిజం.. ఎందుకంటే ఇది ఆడియన్స్ మాట.. అదే ఆడియన్స్ ఓటింగ్.. అదేంటది.. అన్ని పోల్స్ లో తనూజ టాప్ ఉందని అంటున్నారు కదా అని కొంతమంది అనుకోవచ్చు కానీ అసలు నిజమేంటో ఓసారి చూసేద్దాం.

తనూజకి ప్రతీ నామినేషన్లో యాభై నుండి అరవై శాతం ఓటింగ్ పడుతోంది. అంటే ఒక పదివేల ఓట్లు మొత్తంగా పడితే వాటిల్లో ఆరువేల ఓట్లు తనూజకే పడుతున్నాయి. ఇదంతా బిగ్ బాస్ చేస్తున్న ఫేక్ ఓటింగ్ అని , పీఆర్ లు చేసే డూప్లికేట్ ఓట్లని తెలుస్తోంది. అందుకే ప్రతీ రివ్యూయర్ చాలా స్ట్రాంగ్ గా తనూజకి బిగ్ బాస్ విన్నర్ చేయాలని చేస్తున్నాడని అంటున్నారు. మరి ఇది నిజమేనా అంటే నిజమే.. ఎందుకంటే తనూజ ఎంట్రీ రోజే.. తను అన్నపూర్ణ స్టూడియోస్ దత్తపుత్రిక అని నాగార్జున స్టేజ్ మీద చెప్పేశాడు. ఇక తను ఏం చేసినా పాజిటివ్ గా చూపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఫైనల్ ఓటింగ్ లో కూడా తనే టాప్ లో ఉంటుంది . దీనివల్ల జెన్యున్ కంటెస్టెంట్స్ కి అన్యాయం జరుగుతుంది.

నామినేషన్స్ లో ఉన్నావారిలో తనూజ మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత రెండో స్థానంలో పవన్ కల్యాణ్ పడాల, మూడో స్థానంలో సుమన్ శెట్టి ఉన్నారు. నాలుగు, ఐదు స్థానాల్లో సంజనా, భరణి కొనసాగుతున్నారు. ఇక ఆరు, ఏడు స్థానాల్లో సాయి శ్రీనివాస్, రాము రాథోడ్ ఉన్నారు. అంటే ప్రస్తుతం రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇలోపు ఓటింగ్ లో మార్పులు రావచ్చు. ఒకవేళ ఇదే ఓటింగ్ పడితే రాము రాథోడ్ కానీ సాయి శ్రీనివాస్ గానీ ఎలిమినేట్ అవ్వక తప్పదు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.