English | Telugu
Bigg Boss 9 Telugu Top-5 contestants : బిగ్ బాస్ సీజన్-9 లో టాప్-5 ఎవరంటే!
Updated : Nov 26, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో రోజురోజుకి విన్నర్ ఎవరు అవుతారా, టాప్-5 లో ఎవరుంటారనే క్యురియాసిటి అందరిలోను నెలకొంది. హౌస్ లో ప్రస్తుతం తొమ్మిది మంది ఉన్నారు. గతవారం దివ్య ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ ఇమ్మాన్యుయల్ తన పవరస్త్రాని ఉపయోగించడంతో దివ్య సేవ్ అయింది. ప్రస్తుతానికి విన్నింగ్ రేస్ లో తనూజ పుట్టస్వామి, కళ్యాణ్ పడాల ఉన్నారు. ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో లేడీ బిగ్ బాస్ విన్నర్ అయితే అవ్వలేదు. ఒకవేళ బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తే ఈసారి లేడీ బిగ్ బాస్ విన్నర్ ని చూడాల్సిందే.
కళ్యాణ్ పడాల విన్నర్ అవుతాడా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే అతను టాస్క్ ల పరంగా తన బెస్ట్ ఇస్తున్నాడు. మిగతా వారికంటే ఇప్పటివరకు టాప్-2 లో ఉన్నాడు. ఇక టాప్-3 ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ ఉండే అవకాశం ఉంది. మొదట్లో అందరు అతడే విన్నర్ అని అనుకున్నారు. హౌస్ లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. తను లేకుంటే ఈ సీజన్ లేదన్నట్లు అంతా ఎంటర్‌టైన్‌మెంట్ చేసాడు. ఇక టాప్-4 విషయానికి వస్తే డీమాన్ లేదా రీతూ ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత టాప్-5 భరణి అని చెప్పొచ్చు. రీఎంట్రీ తర్వాత నుండి గేమ్ బాగా ఆడుతున్నాడు. ఇదే గేమ్ ఎంట్రీ నుండి ఆడితే భరణి విన్నర్ అయ్యేవాడు.. అందులో ఆశ్చర్యం లేదు.
మొన్న ఫ్యామిలీ వీక్ లో వచ్చిన వాళ్ళలో చాలా మంది సుమన్ శెట్టిని టాప్ -5 కంటెస్టెంట్ అన్నారు కానీ ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ లో టాప్-6 పొజిషన్ లో ఉన్నాడు. ఇక ఈ వారం ఓటింగ్ లో దివ్య, సంజన లీస్ట్ లో ఉన్నారు.. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళిద్దరూ బయటకు వెళ్లడం ఖాయం.. ఒకవేళ ఫినాలే వీక్ కి టాప్-6 అని బిగ్ బాస్ ప్లాన్ చేస్తే మాత్రం ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ అవుతుంది. సంజన, దివ్య ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు.