English | Telugu

First Finalist Kalyan Padala : బిగ్ బాస్ సీజన్-9 ఫస్ట్ ఫైనలిస్ట్ పవన్ కళ్యాణ్ పడాల!

ఇది కదా కామన్ మ్యాన్ పవర్.. పవన్ కళ్యాణ్ పడాల మరోసారి ఋజువు చేసుకున్నాడు. కథ క్లైమాక్స్ కి వచ్చే కొద్ది కళ్యాణ్ విజయం వైపు అడుగులు వేస్తున్నాడు. మొదటి నాలుగు వారాలు అసలు హౌస్ లో పెద్దగా గుర్తింపు లేదు కానీ ఆ తర్వాత నుండి ఫుల్ ఆడుతున్నాడు.

పడిలేచిన కెరటంలా పవన్ కళ్యాడ్ పడాల ముందుకెళ్తున్నాడు. రమ్య మోక్ష, దువ్వాడ మాధురి వచ్చినప్పుడు కళ్యాణ్ గురించి తక్కువగా మాట్లాడిన పట్టించుకోలేదు.. ఎప్పుడు అయితే శ్రీజ రీఎంట్రీ ఇచ్చి తనకి అన్నీ చెప్పిందో .. అప్పటి నుండి తన ఆటతీరు మారింది. నిన్నటి ఎపిసోడ్ లో అతని ఆట చూస్తే ఎవరికైనా ఇదే నిజమనిపిస్తుంది. సోమవారం నుండి శుక్రవారం వరకు సాగిన టికెట్ టు ఫినాలే రేస్ లో కళ్యాణ్ విజయం సాధించాడు. అసలు నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేద్దాం. మొదటగా రీతూ, భరణిల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత రీతూ, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ లకి ఓ టాస్క్ ఇవ్వగా అందులో కళ్యాణ్ గెలుస్తాడు. ఇక అదే గేమ్ ని రీతూ, ఇమ్మాన్యుయేల్ ఆడతారు. అందులో రీతూ గెలుస్తుంది.

ఇక ఫైనల్ రేస్ రీతూ చౌదరి, పవన్ కళ్యాణ్ పడాల మధ్య జరిగింది. ఈ టాస్కులో గోనిసంచెలు తీసి విసరడం.. టన్నెల్ నుంచి పాకడం.. ఆ తర్వాత ఓ పైప్ మీద నుంచి నడవడం.. ఇవన్నీ దాటాక ఓ టన్నెల్ కి ఉన్న లాక్ తీసి అందులో నుండి బాల్స్ తీసుకొని తమకి కేటాయించిన బుట్టలో పడేయాలి. వీటి తర్వాత తమ ఫోటో ఉన్న పేపర్స్ ని సరైన క్రమంలో జతచేయాలి. అలా ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళే విజేత.‌ ఇక ఈ టాస్క్ పవన్ కళ్యాణ్ పడాలకి చాలా ఈజీ . ఎందుకంటే అతనికి మిలటరీ ట్రైనింగ్ లో ఇవే ఉంటాయి. ఇక ఈ గేమ్ లో సూపర్ ఫాస్ట్ గా వచ్చి టాస్క్ ముగిస్తాడు కళ్యాణ్. రీతూ ఓడిపోయి టికెట్ టూ ఫినాలే నుండి తప్పుకుంటుంది. కళ్యాణ్ విజేతగా నిలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ ది సీజన్-9 (First Finalist Of the Season 9 Telugu ) అవుతాడు. ఆ తర్వాత ఆ ఫైనలిస్ట్ ట్రోఫీ పట్టుకొని గాల్లోకి చూపిస్తాడు. కాసేపటికి బిగ్ బాస్ మామ సాంగ్ వేస్తాడు. హౌస్ మేట్స్ అంతా స్టెప్పులు వేస్తారు.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.