English | Telugu

Bigg Boss 9 Telugu Immanuel: టికెట్ టూ ఫినాలే రేస్ నుండి ఇమ్మాన్యుయేల్ అవుట్.. ఏడ్చేసిన కళ్యాణ్!

బిగ్ ట్విస్ట్.. ఎస్.. ఇది నిజంగా ఎవరూ ఊహించనిది.. నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో రీతూ, ఇమ్మాన్యుయేల్ మధ్య పోటీ జరుగగా రీతూ గెలిచింది ఇమ్మాన్యుయేల్ ఓడిపోయాడు దీనికి కారణం కళ్యాణ్.. అదెలా అంటే.. అదే బిగ్ బాస్ మ్యాజిక్. నిన్నటి ఎపిసోడ్ లో ఏ‌ం జరిగిందో ఓసారి చూసేద్దాం.

నిన్నటి ఎపిసోడ్ లో మొదటి టాస్క్.. కట్టు నిలబెట్టు. ఇందులో రీతూ, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ పోటీపడ్డారు. ఇక వీళ్ళు ఆడే గేమ్ కు బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు‌. తమకి ఇచ్చిన బ్లాక్స్‌తో ఎత్తయిన టవర్‌ని నిర్మించి.. ఇంటి సభ్యులు విసిరే బాల్స్ నుంచి తమ టవర్‌ని బ్యాట్స్ సహాయంతో కూలకుండా కాపాడుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్‌కి సంజన సంఛాలక్. ఈ టాస్క్ లో తనూజ, భరణి ఇద్దరు రీతూని టార్గెట్ చేశారు. దాంతో అమర్ దీప్ గత సీజన్ లో ఎలా ఏడ్చాడో రీతూ అలా ఏడ్చింది. ఈ గేమ్ చూసిన ప్రతీ ఒక్కరికి రీతూని చూస్తే అమర్ దీప్ గుర్తొస్తాడు. ఇక ఈ టాస్క్ లో కళ్యాణ్ గెలిచాడు. అయితే బిగ్ బాస్ ఇక్కడ ఓ మెలిక పెట్టాడు.

ఇదే గేమ్ ని రెండు, మూడు స్థానాలలో నిలిచిన ఇమ్మాన్యుయేల్, రీతూలతో ఆడించాడు. ‌ఇక ఈ గేమ్ కి పోటీదారులకి ఇద్దరి సపోర్ట్ తీసుకోమన్నాడు. ఇక రీతూకి తనూజ, డీమాన్ పవన్ ఉండగా.. ఇమ్మాన్యుయేల్ కి కళ్యాణ్, భరణి ఉన్నారు. ఇక గేమ్ మొదలైంది. రీతూ, ఇమ్మాన్యుయేల్ ఇద్దరు టవర్స్ పేర్చారు. ఇక కళ్యాణ్ ఎంత ట్రై చేసినా రీతూ టవర్ ని కూల్చలేకపోతాడు కానీ తనూజ మాత్రం ఇమ్మాన్యుయేల్ టవర్ ని ట్వంటీ పర్సెంట్ కూల్చేస్తుంది. దాంతో రీతూ కంటే ఇమ్మాన్యుయేల్ టవర్ యొక్క ఫ్లోర్స్ తక్కువగా ఉంటాయి. ఇక ఇమ్మాన్యుయేల్ ఓడిపోయి టికెట్ టూ ఫినాలే రేస్ నుండి తప్పుకుంటాడు. రీతూ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది‌. ఇక తనవల్ల ఇమ్మాన్యుయేల్ ఓడిపోయాడని కళ్యాణ్ వాష్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు. ఇక అప్పుడే తనూజ వెళ్ళి చూస్తుంది. ఏంటి ఏడ్చావా అని తనూజ అడిగితే లేదని కళ్యాణ్ చెప్తాడు. ఇక ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ తో కూడా సారీ చెప్తూ ఏడ్చేస్తాడు కళ్యాణ్.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.